ట్రంప్ వల్ల భారతీయుల కష్టసుఖాలు

ఇల్లీగల్ గా ఉండిపోయి బతికేయాలనుకుంటే.. ఆ పాత రోజులు కావివి. ట్రంప్ ప్రభుత్వం వెతికి పట్టుకుని మరీ ఇంటికి పంపే పని పెట్టుకుంటోంది.

ట్రంప్ జనవరిలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్నాడు. తొలి సంతకాన్ని కొన్ని కీలకమైన అంశాలపై చేయబోతున్నాడు. అందులో ఒకటి సిటిజెన్షిప్ కి సంబంధించినది. ఆ విషయం తెలియగానే కొందరు భారతీయుల్లో ఆనందం, అనేకమందికి భయం పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ ఆ పాయింటేంటి? ఎవరికి ఆనందం, ఎవరికి దుఃఖం అనేది తెలుసుకుందాం.

అమెరికాలో పుడితే చాలు, ఆ పిల్లలకి ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తుంది. ఇన్నాళ్లూ మనకి తెలిసింది ఇదే.

అందుకే మనవాళ్లల్లో చాలామంది ఇండియాలో గర్భం దాల్చిన మూడు నాలుగు నెలలకి టూరిస్ట్ వీసా మీద అమెరికా వెళ్లి అక్కడ పిల్లల్ని కంటున్నవాళ్లున్నారు.

హెచ్ 1 బి వీసా మీద ఉద్యోగనిమిత్తం వెళ్లిన భారతీయులు కూడా అక్కడ పిల్లల్ని కంటే ఆ పిల్లల వరకు పౌరసత్వం వచ్చేస్తోంది. క్రమంగా ఈ తల్లిదండ్రులకి గ్రీన్ కార్డులు రావడం, పౌరసత్వం రావడం జరుగుతాయి. ఒకవేళ ఈ తల్లిదండ్రులకి గ్రీన్ కార్డ్ రావడం బాగా లేటైపోయినా, అక్కడే పుట్టిన పిల్లలకి 21 ఏళ్లు రాగానే వాళ్ల తల్లిదండ్రులుగా వీళ్లు గ్రీన్ కార్డ్ పొందే అవకాశముంది. గ్రీన్ కార్డ్ వచ్చిన ఐదేళ్లకి ఆటోమేటిక్ గా సిటిజెన్షిప్ వస్తుంది.

ఇన్నేళ్లూ జరుగుతున్నది ఇదే.

అయితే ఇప్పుడు ట్రంప్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాడు. భారతీయ తల్లిదండ్రులకి అమెరికాలో పిల్లలు పుట్టినంత మాత్రాన అ పిల్లలకి అమెరికా పౌరసత్వం రాదట. కనీసం ఇద్దరిలో ఒక పేరెంటైనా అమెరికన్ సిటిజెన్ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యుండాలట. అదీ ట్రంప్ పెడుతున్న మొదటి మడత.

ఎందుకంటే “అమెరికా ఫస్ట్” నినాదాన్ని బలంగా అమలు చేయదలచుకున్నాడు. భారతీయులు కావొచ్చు, మరే ఇతర దేశీయులైనా కావొచ్చు.. పిల్లల్ని కనేసి వాళ్లని సిటిజెన్స్ గా లెక్క పెంచేస్తున్నారు. పిల్లలు సిటిజెన్సే కాబట్టి ఎప్పుడో అప్పుడు వాళ్లు కూడా అమెరికన్స్ అయ్యే అవకాశముంది కనుక అక్కడే సెటిలైపోతున్నారు. దానివల్ల సిటిజెన్స్ కి కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఎంతో మంది సిటిజెన్స్ కి ఉద్యోగాలు రావట్లేదు. అలా కాకుండా హెచ్ 1 బి మీద వచ్చిన వాళ్ల పిల్లలని కూడా ఫారినర్స్ గానే ఉంచితే తల్లిదండ్రులకి అమెరికాలో సెటిలైపోవచ్చన్న ఆలోచనలు తగ్గుతాయి.

గ్రీన్ కార్డ్ లేనంత వరకు హెచ్ 1 బి వీసా మీద ఇండియా రావాలంటే భయపడే రోజులు పెరిగిపోతాయి. ఇండియా వెళ్ళిన వాళ్లకి తిరుగు ప్రయాణానికి స్టాంపింగ్ అవుతుందో లేదోనన్న సస్పెన్స్ వెంటాడుతుంటుంది. ఈ ఇన్సెక్యూరిటీ మధ్య అమెరికా నివాసాన్ని ఎంచుకోవడం తగ్గుతుంది.

పైగా ఇండియన్ పాస్ పోర్ట్ మీద అమెరికాలో పెరిగే పిల్లలకి కాలేజీలో చదివే వయసొస్తే వాళ్లు స్టూడెంట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడే పుట్టి, అక్కడే పెరిగి 20 ఏళ్ల జీవితం గడిపినా కూడా ఆ దేశం విదేశీయుణ్ణి చూసినట్టే చూస్తుంది. అలా బిక్కుబిక్కుమంటూ సెకండ్ గ్రేడ్ జీవనం సాగించేకంటే భారతదేశమే నయమనే పరిస్థితులు దాపురిస్తాయి. దాంతో ఇండియా నుంచి అమెరికా వెళ్లే వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది.

ఈ పరిస్థితులన్నీ ప్రస్తుతం అమెరికాలో సిటిజెన్స్ గానూ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గానూ ఉన్నవాళ్లకి ఆనందం. ఎందుకంటే వాళ్ల పిల్లలకి ఢోకా లేదు. కాంపిటీషన్ తగ్గుతుంది. ఉద్యోగాలు కూడా “సిటిజెన్స్ తర్వాతే ఫారినర్స్” అనే చట్టం కూడా ప్రవేశపెడుతున్నాడు ట్రంప్. కుప్పలు తెప్పలుగా కొత్త తరం భారతీయులు అమెరికా రావడం ఆగిపోతే అక్కడున్న భారతీయ మూలాలున్న అమెరికన్ పౌరులకి ఆనందమేగా మరి.

ఇక దుఃఖం ఎవరికంటే:
– ప్రస్తుతం హెచ్ 1 బి మీద ఉన్నవాళ్లు.
– హెచ్ 1 బి మీద ఉంటూ, మరో మూడు నాలుగు నెలల్లో అక్కడే పిల్లల్ని కనడానికి లైన్లో ఉన్న భారతీయ తల్లిదండ్రులు
– చదువు నిమిత్తం లక్షలు ఖర్చుపెట్టుకుని అమెరికాకి వచ్చి అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనుకునే యువతీయువకులు.

ఇప్పుడు అమెరికన్ పౌరులైన భారతీయ వధూవరులకి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది కదా ఇండియా నుంచి అనుకోవచ్చు. కానీ ఆ వధూవరులకి ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్లు మ్యాచ్ కారు. వాళ్ల భావజాలానికి, వీళ్ల ఆలోచనలకి మధ్య పెద్ద అగాధం ఉంటుంది. కనుక అలాంటి ప్రయత్నాలు చేసి అమెరికన్ పౌరసత్వాన్ని పొందాలనే ఆలోచనలు కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.

ఈ లెక్కన ఎలా చూసినా అమెరికా వెళ్లి సెటిలవ్వడం అనే భారతీయుల కలలు నెరవేరనట్టే.

ఎందుకింత కఠినతరమైన నిర్ణయం తీసుకుంటున్నాడు ట్రంప్ అంటే…ఇదే తనకి ఆఖరి టర్మ్. అమెరికా ప్రెసిడెంట్ గా రెండు సార్లకు మించి పనిచేయడానికి ఎలాగూ లేదు. కనుక తనని తాను బలమైన నేతగా, సిటిజెన్ల ప్రెసిడెంటుగా తన కీర్తిని నిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నాడు.

ఈ నిర్ణయాలవల్ల ఓట్లేసే సిటిజెన్స్ అందరూ ఆనందిస్తున్నారు. తనకి కావాల్సింది ఓటర్ల మనసు గెలుచుకోవడమే కదా.

ఈ నిర్ణయాల వల్ల డెమోక్రటిక్ ఓటర్స్ కూడా క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపుకు మొగ్గవచ్చు. ఈ ఎన్నికల్లో దాదాపు అదే జరిగింది. అది మరింతగా జరిగి ఓటర్లంతా రిపబ్లికన్లకి పోలరైజ్ అయిపోతే ఇక డెమాక్రటిక్ పార్టీ బలహీనమైపోతుంది. ఆ పోలరైజేషన్ గేం లో ఇది ట్రంప్ తీసుకుంటున్న మొదటి నిర్ణయం.

అమెరికాలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మాత్రమే ట్రంప్ దేశంలోంచి తోలేస్తానన్నాడు.. కనుక లీగల్ గా మాత్రమే అమెరికా వెళ్లే మన భారతీయులకి ఇబ్బందేమీ లేదనే అనుకున్నారు నిన్నటి వరకు. కానీ ఇక్కడ లీగల్ ఇమిగ్రెంట్స్ కి కూడా ఇబ్బందికరమైన అంశాలున్నాయని అర్ధమవుతోంది కదా.

ముఖ్యంగా వర్రీ కావాల్సింది ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు. చదువు పూర్తవగానే ఓపీటీ మీద ఉండడానికి కూడా కఠినతరమైన నియమాలు రాబోతున్నాయి. గడువు దాటి ఒక్క రోజున్నా కూడా ఇల్లీగల్ స్టే కింద పరిగణించి ఇండియా పొమ్మనడం ఖాయం. కనుక చదువు అవ్వగానే సకాలంలో ఉద్యోగం రాకపోతే ఇండియాకి వచ్చేయడం తప్ప మరో దారే ఉండదు. అక్కడే ఇల్లీగల్ గా ఉండిపోయి బతికేయాలనుకుంటే.. ఆ పాత రోజులు కావివి. ట్రంప్ ప్రభుత్వం వెతికి పట్టుకుని మరీ ఇంటికి పంపే పని పెట్టుకుంటోంది. కొన్ని వర్గాల కథనం ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆచూకి చెప్పి పట్టించే వాళ్లకి పారితోషకాలు కూడా ప్రకటించబోతోందట ట్రంప్ సర్కార్. కనుక వీధికొక విజిల్ బ్లోయర్ ఉంటాడు. ఇల్లీగల్ స్టే చేస్తూ ఎవ్వరూ తప్పించుకోలేరు.

అమెరికాలో సిటిజెన్లకి ప్రాధాన్యం పెంచడం, కొత్త సిటిజెన్స్ ని కలుపుకోవడంలో కఠినమైన నియమాలు, డాలర్ వేల్యూ పెంచడం, అమెరికన్ ఎకానమీని పరుగెత్తించడం, ఎలాన్ మస్క్ చేతిలో ప్రపంచ విపణిని పెట్టడం, అన్ని దేశాలూ తమ సార్వభౌమత్వానికి తలొగ్గేలా తమ ఆర్ధిక శక్తిని, వ్యాపార రాజకీయాలని నడపడం..ఇవే ట్రంప్ సర్కార్ రూట్ మ్యాప్ లోని మైలురాళ్లు. రానున్న నాలుగేళ్లల్లో ఇవన్నీ అమలు చేసుకుంటూ ఉంటాడు. ప్రపంచం చూస్తూ ఉంటుంది. అదీ పరిస్థితి.

– పద్మజ అవిర్నేని

29 Replies to “ట్రంప్ వల్ల భారతీయుల కష్టసుఖాలు”

  1. నాకైతె పిచ్చ happy

    గత 10 లెదా 15 years గా అక్కడున్నొల్ల overaction బరించలెకపొచున్నాం

    ముఖ్యంగా అడవాల్లను పట్టలెకున్నాం వాళ్ళు ..వాళ్ళ overaction

    1. ఇక్కడ అప్పలమ్మ లందరూ పల్లెటూరి గబ్బిలాయి అమ్మాయిలు అక్కడ పోయి ఈ are from America ani ఓవరాక్ట్ing video u instagram lo pettdam సవదెంగడం

  2. “Although Indians make up about 1% of American society, they pay about six per cent of the taxes. They’re amongst the top producers, and they do not cause problems. They follow the laws,” Rich McCormick- Republican leader.

    Trump doing bad things to Indians is very unlikely especially when Modiji is in power.

    1. MOdi ji can’t even be able to collect the power dues from Bangladesh for his favorite adani what he can do outside of india, he failed our economy and destroyed the middle class completely

  3. ఇది జరగాలంటే 2/3 మెజారిటీ వుండాలి. జరిగే పని కాదు. ఉత్తుత్తి కబుర్లు! ట్రంప్ చెప్పేది చేసేది వేరే!

  4. ఆ వీధికోక విజిల్ బ్లోవర్లు మన వారే ఉంటారు.. మన వారే మన వారిని ఏరి ఏరి పారేస్తారు.. ఆ విధంగా డబ్బు కి డబ్బు వస్తుంది.. పిల్లలకి పోటీ తగ్గుతుంది.. మన మాస్ జనాలకి ఇంక కష్ట కాలం మొదలు.. కులాలు ప్రాంతాలు సినిమాలు అని చెప్పి పిచ్చి వేషాలు వేస్తే నారతీసి ఇంటికి పంపుతారు…

  5. అదే జగన్ రెడ్డి అయితే మెడలు వొంచి ప్రత్యేక హోదా తెచ్చినట్టు అక్కడ కూడా ట్రంప్ మెడలు వొంచి ఇండియన్స్ కి అమెరికా పౌరసత్వం ఇప్పించేవాడు

  6. ఇంకొక దేశం లో సుఖం అనుకొనే వాళ్లకు చెప్పేదిలేదు ఏమైనా లోపాలుంటే మనదేశాన్ని సరిదిద్దుకొంటే సరిపోతుంది ఇక్కడే మనకు ఆనందం గ ఉంటుంది

    1. mana jeevithakalam lo kavalanukune marpu jaragadu. Vaddanukunnavallu vellipotaru, emi alichana leni valla tho saha! US lo prasanthatha chala ekkuva! Tappu pattadanikemi ledu ika!

        1. Avunu, adavilo bathukutha kuda prasanthamga untaru kada tribals. 100 years kritham rajula bathukula kante manam bagunnam. Future marintha easyga lives lead cheselaga undali kanee, prathi daniki edusta undalsina pani ledu. India inka chala venakabadi undi, infra and in other aspect incl. processes etc. I rather live in US than in India b/c I won’t get to live a 1000 years. My time is limited and so are the rest of us. Better make good use of it without screwing others like the assholes we’ve around us who call themselves “leaders”!

      1. మార్పులు క్రమేపి వస్తాయి సర్ ఒకే సారి రావు 1970 లలో ఓటర్ ల మైండ్ సెట్ ఇప్పటి ఓటర్ లకు ఉంటే జగన్ ఓడిపోడు

  7. America has been shaped by immigrants rather than solely by native-born citizens. If policies were to restrict international students, the nation could risk losing its competitive edge and potentially fall behind other global powers in the next one to two decades.

  8. కులాలు ప్రాంతాలు సినిమాలు అని చెప్పి పిచ్చి వేషాలు వేస్తే నారతీసి ఇంటికి పంపుతారు

  9. దయచేసి ఇండియా నీ బండ బూతులు తిడుతూ, America ki, వెళ్ళి పోష్ పోష్ అని అడ్డమైన drugs అలవాటు చేసుకొని చదువు పేరు తో చండలపు కల్చర్ అలవాటు చేసుకున్న స్టిడెంట్స్ మళ్ళీ ఇక్కడకు పంపి మా దేశాన్ని పాడు చేశ్యకండి

  10. Practically not possible H4 ki job lu lepaimanu students ki opt 1 yr Cheyamanu half scrap poddi… but impossible… Hyderabad kante America ke ekkuva travel chesaru ee 5 yrs… Scrap anta akkade

Comments are closed.