Advertisement

Advertisement


Home > Movies - Movie News

సంక్రాంతి బరిలో మరో మూవీ

సంక్రాంతి బరిలో మరో మూవీ

ఎవ్వరూ తగ్గట్లేదు. అంతా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. ఓవైపు చిరంజీవి తన విశ్వంభర సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించినప్పటికీ మిగతా హీరోలు ఏమాత్రం సంకోచించకుండా తమ సినిమాల్ని కూడా సంక్రాంతికే విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు.

ప్రభాస్ సినిమా ఒకటి సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. అటు బాలయ్య కూడా తన అప్ కమింగ్ మూవీస్ లో ఒకదాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరాడు. పైగా ఇది అతడికి ప్రతిష్టాత్మక చిత్రం కూడా.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రవితేజ హీరోగా ప్రకటన వచ్చేసింది. కెరీర్ లో రవితేజకు ఇది 75వ చిత్రం. ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు డైరక్ట్ చేయబోతున్నాడు. భీమ్స్ సంగీతం అందిస్తాడు.

ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్ భేరి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నడిచే కామెడీ చిత్రం ఇది. ఉగాది సందర్భంగా ఈరోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ.

ఇప్పటివరకు ఈ బ్యానర్ చాలా సినిమాలు తీసింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేదు. గతంలో భీమ్లానాయక్, ఆదికేశవ సినిమాల్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి తప్పుకున్నారు. ఈసారి రవితేజ సినిమాతోనైనా సంక్రాంతికి వస్తారేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?