టాలీవుడ్ ను రీ-రిలీజ్ ట్రెండ్ ఊపేస్తోంది. గతేడాది, అంతకుముందు ఏడాది లెక్కలేనన్ని పాత హిట్స్ మళ్లీ తెరపైకొచ్చాయి. ఆ ట్రెండ్ కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతోంది. జనవరిలో రీ-రిలీజ్ ట్రెండ్ పెద్దగా కనిపించలేదు కానీ, ఫిబ్రవరి నుంచి వీటి హవా మొదలైంది.
సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఐదేళ్ల కిందట ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమాను వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. కాకపోతే టైటిల్ మార్చేశారు. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనేది టైటిల్.
అదే రోజున ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా కూడా రీ-రిలీజ్ చేశారు. రామ్ చరణ్ నటించిన ఫ్లాప్ మూవీ ‘ఆరెంజ్’ కూడా రీ-రిలీజ్ అయింది. అప్పటి కంటే ఇప్పుడు బాగా ఆడింది ఈ సినిమా.
ఇక ఈ రీ-రిలీజ్ ఫీవర్ మార్చి నెలలో కూడా కొనసాగబోతోంది. శేఖర్ కమ్ముల తీసిన ‘గోదావరి’ సినిమాతో మార్చి బాక్సాఫీస్ మొదలుకాబోతోంది. ఆ తర్వాత వారం రోజులకు వెంకీ-మహేష్ కలిసి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమా వస్తోంది.
ప్రభాస్ నటించిన ‘సలార్-1’, నాని-విజయ్ దేవరకొండ కలిసి చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలు కూడా మార్చి నెలలో మరోసారి వెండితెరపైకి రాబోతున్నాయి. ఈ సినిమాల మధ్యలో కార్తి నటించిన ‘యుగానికొక్కడు’ సినిమా కూడా వస్తోంది. ఇలా ఫిబ్రవరిలో మొదలైన రీ-రిలీజ్ ఫీవర్, మార్చి నెలలో ఊపందుకోబోతోంది.
ఈ ఆర్టికలోడికి తెలుగుసినీమా చరిత్ర తెలీనట్టుంది….గతం లో కొన్ని ముఖ్యమైన బ్యానర్ లోని చిత్రాలుంప్రతి ఏడాది రికీజ్ చేసి సంపాదించుకుని వాళ్ళు..ఈ మధ్య pb సినీమాలెక్కువై,వాటికే థియేటర్లు దొరక్క గజిబిజి అయ్యి పాఠవాటిని పక్కన పెట్టేరు….కొత్త వాటిలో 99%శాతం రిలీజుల్లో బిల్తాపడే సరికి ఇదిగో మల్లినిలా..
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,