ఎంత వయిలెన్స్ అయితే అంత గొప్ప!

రోజులు మారుతున్నాయి. టేస్ట్ మారుతోంది. రక్తపాతాలు, హింస, సెక్స్ ఇవన్నీ ప్రేక్షకులకు హుక్ పాయింట్లుగా మారుతున్నాయి.

రోజులు మారుతున్నాయి. టేస్ట్ మారుతోంది. రక్తపాతాలు, హింస, సెక్స్ ఇవన్నీ ప్రేక్షకులకు హుక్ పాయింట్లుగా మారుతున్నాయి. థాంక్స్ టు వైలెంట్ వీడియో గేమ్స్.. థాంక్స్ టు ఓటిటి వెబ్ సిరీస్. ఒకప్పుడు ఎ సర్టిఫికెట్ అంటే భయం. ఇప్పుడు ఎ సర్టిఫికెట్ సినిమాలు అంటే ప్రియం. హీరో అంటే టక్ చేసుకుని, నీట్ గా వుండే కాలం కాదు. హీరో అంటే టూ వయిలెంట్ గా వుండాలి. అలా అని హీరో వయిలెంట్ గా వుంటే సరిపోదు. సినిమాలో సీన్లు కూడా అలాగే వుండాలి.

పుష్ప రఫ్ క్యారెక్టర్.. పుష్ప 2 దాన్ని మించి. యానిమల్ వయిలెంట్ హీరో పాత్ర. దసరా రగ్డ్ సినిమా. సరిపోదా శనివారం యాంటీ హీరో పాత్ర. ఇలా రాసుకుంటూ వెళ్తే జాబితా పెద్దదే. ట్రెండ్ మారుతోంది అనడానికి ఒక్క సినిమా కాదు.. చాలా సినిమాలు కోట్ చేయచ్చు.

లేటెస్ట్ గా వచ్చిన హిట్ 3 టీజర్ కు మంచి స్పందన వచ్చింది. కానీ టీజర్ మొత్తం వయిలెన్స్.. వయిలెన్స్.. వయిలెన్స్. కానీ జనం అంతలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అంటే రీజన్ ఒకటే, మారుతున్న ట్రెండ్. ఈ మారుతున్న ట్రెండ్ కారణంగానే. నాని లాంటి ఫ్యామిలీ హీరో దసరా మీదుగా హిట్ 3 వరకు వచ్చారు అంటే దానికి రీజన్ ఇదే.

కానీ గ్రౌండ్ లో బాధపడేవారు వున్నారు. పిల్లలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ, మాట వినడం లేదని హైదరాబాద్ లో ఒక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆవేదన పడ్డారు. టీచర్ ఆవేదన పడితే ఫలితం ఏముంటుంది. తల్లితండ్రులు పడాలి. అప్పుడు ఫలితం ఏమైనా వుండొచ్చు. లేదంటే ఇంకా ఇంకా వయిలెంటు సినిమాలు చూసే రోజులు ముందు వున్నాయి.

3 Replies to “ఎంత వయిలెన్స్ అయితే అంత గొప్ప!”

Comments are closed.