పాత జ్ఞాపకాల్ని తుడిచేస్తూ, కొత్తగా!

గతంలో ఏ ట్విట్టర్ లోనైతే ఆమెపై భారీగా ట్రోలింగ్ జరిగిందో, ఇప్పుడు అదే ట్విట్టర్ లో ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు జనం.

జీవితం ఎప్పుడూ అనుకున్నట్టు సాగదు, ఆటుపోట్లు సహజం. వాటిని తట్టుకొని నిలబడడం నేర్చుకోవాలి. సమంత కూడా ఇదే పని చేసింది. వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంది. ఈ క్రమంలో ఆమె కొన్నింటికి దూరమైంది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వెనక్కు వస్తోంది.

ఒక టైమ్ లో సమంతపై జరిగిన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. దానికి ప్రధాన వేదికగా మారిన ట్విట్టర్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. అలా ట్విట్టర్ కు దూరమైన ఈ బ్యూటీ, ఎట్టకేలకు తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.

పాత జ్ఞాపకాల్ని తుడిపేస్తూ, ట్విట్టర్ లో కంటెంట్ మొత్తం డిలీట్ చేసి కొత్తగా ప్రవేశించింది. ఈ ఒక్క పనితో ఆమె చాలా అంశాలపై స్పష్టత ఇచ్చినట్టయింది. తను తిరిగి సినిమాల్లోకి వస్తాననే సంకేతాన్ని ఆమె ఇచ్చినట్టయింది.

గతంలో ఏ ట్విట్టర్ లోనైతే ఆమెపై భారీగా ట్రోలింగ్ జరిగిందో, ఇప్పుడు అదే ట్విట్టర్ లో ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు జనం.

అయితే ఆమె ఇనస్టాగ్రామ్ లో ఉన్నంత యాక్టివ్ గా, ట్విట్టర్ లో ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. ట్రోలింగ్ లేకపోతే ట్విట్టర్ లో కొనసాగడానికి సమంతకు ఎలాంటి అభ్యంతరం లేదు.

One Reply to “పాత జ్ఞాపకాల్ని తుడిచేస్తూ, కొత్తగా!”

Comments are closed.