సీఐడీ అధికారుల‌కు బాబు స‌ర్కార్ చీవాట్లు!

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తే, మీ వ‌ల్లే మొత్తం బెడిసి కొట్టింద‌ని తిట్టిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, పార్ల‌మెంట్ స‌భ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్ట్ విష‌యంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించార‌ని సీఐడీ అధికారుల‌పై కూట‌మి స‌ర్కార్ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఏపీ హైకోర్టులో మిథున్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌కు, అనంత‌రం ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డానికి మ‌ధ్య రెండుమూడు రోజుల గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ, ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని సీఐడీ అధికారుల‌కు చీవాట్లు పెట్టిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ లిక్క‌ర్ స్కామ్ జ‌రిగింద‌ని, అందులో మిథున్‌రెడ్డికి వాటా వుంద‌ని కూట‌మి ప్ర‌భుత్వం భావిస్తోంది. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డం ద్వారా, ఆ త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేయాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశం, ఆ మేర‌కు సీఐడీని ముందు పెట్టి, ప్ర‌భుత్వ పెద్ద‌లు చ‌క్క‌టి గేమ్ స్టార్ట్ చేశారు.

అంతిమంగా మిథున్‌రెడ్డి భుజాల‌పై రాజ‌కీయ గ‌న్ పెట్టి, జ‌గ‌న్‌ను కాల్చాల‌నేది ప్ర‌భుత్వ పెద్ద‌ల ల‌క్ష్యమ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు టీడీపీ అనుకూల మీడియా లిక్క‌ర్ స్కామ్‌పై క‌థ‌నాలు రాయ‌డం, అంతిమంగా వైఎస్ జ‌గ‌న్‌కు ఆర్థిక ల‌బ్ధి క‌లిగింద‌ని ప‌రోక్షంగా చెప్ప‌డం తెలిసిందే.

పార్ల‌మెంట్ స‌మావేశాల నిమిత్తం ఢిల్లీలో మిథున్‌రెడ్డి వుండ‌డంతో 15 మందితో రెండు మూడు సీఐడీ బృందాలు కూడా అక్క‌డికి వెళ్లాయి. త‌న కోసం సీఐడీ బృందాలు వ‌చ్చిన‌ట్టు మిథున్‌రెడ్డి ప‌సిగట్టారు. దీంతో ఆయ‌న జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఈ లోపు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం, మ‌ధ్యంత‌ర బెయిల్ దొర‌క‌డం తెలిసిందే. దీంతో విజ‌య‌వాడ నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌లు సీఐడీ అధికారుల‌కు ఫోన్ చేసి ఓ రేంజ్‌లో చీవాట్లు పెట్టిన‌ట్టు తెలిసింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తే, మీ వ‌ల్లే మొత్తం బెడిసి కొట్టింద‌ని తిట్టిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

18 Replies to “సీఐడీ అధికారుల‌కు బాబు స‌ర్కార్ చీవాట్లు!”

    1. madhyam లో ఎంత తిన్న పర్లేదు ప్రెసిడెంట్ మెడల్ లాగా ఆడడ దిడ్డంగా తినిచ్చు అన్న మాటా

      1. మీరు మరీను ఆలా అంటారు ఏంటి .. మద్యం డబ్బు మాత్రమే ఎందుకు తీసుకుని అమ్మరు అంటే ..నోరు విప్పారు ..

    2. అధికారం వొచ్చాక చెప్పండి ..అప్పటి వరకు పగటి కాలాలు అంటారు ..

    3. ఇంకా నాలుగేళ్లు ఉంది కదన్నా .. జగన్ రెడ్డి చెప్పాడు కదా.. కళ్ళు మూసుకుని పడుకో..

    1. వామ్మో.. అవునా.. అయితే ఈసారి మన జగన్ రెడ్డి కి 11 కూడా కష్టమే అంటావ్..

    2. వై ఎస్ వివే*కా నీ హ*త్య చేసిన వాడు,

      వై ఎస్ ఆ*ర్ భా*ర్య మీద కే*సు పె*ట్టిన వాడు,

      ప్యాలెస్ పులకేశి సచ్చే దాకా?

  1. ప్యాలెస్ పులకేశి టైం లో Cid అంటే ఏదో బాఫూన్ బ్యాచ్ లాగ ఉండేది.

    వాటికన్ దశమ భాగాల ముఠా

    Cid వేషాలు వేసుకుని వచ్చేవాళ్ళు

    1. ఇప్పుడు కాస్త నయం, Cid అధికారి అంటే కనీస నమ్మడానికి కుదురుతుంది.

      కాకపోతే ఎవరైనా సరే, cm చెప్పినట్టు చేయాలి.

Comments are closed.