ఏపీలో ఒక ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్నాయి. మిగిలిన రెండు పట్టభద్రుల స్థానాల్లో ఏకంగా టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉన్నారు. టీడీపీకి రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయినప్పటికీ ఎన్నికలు రాజకీయంగా రసవత్తరంగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూడు చోట్లా టీడీపీకి, అలాగే ఆ పార్టీ మద్దతు ఇస్తున్న స్థానాల్లో గెలుపు గ్యారెంటీ లేదు. దీంతో ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడైనా సరే విజయాన్ని సొంతం చేసుకోవాలనే వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎటూ బరిలో వైసీపీ లేకపోవడంతో తమను నిలువరించే శక్తిసామర్థ్యాలు ప్రత్యర్థులకు లేవనే ధీమా కూటమి నేతల్లో కనిపిస్తోంది.
ఒకవేళ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే, కూటమి గెలుపు అనుమానం కావడంతో సహజంగానే భయం వెంటాడుతోంది. దీంతో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరిగే 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూటమి ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ టార్గెట్ పెట్టినట్టు తెలిసింది. ఏం చేస్తారో తమకు తెలియదని, గెలుచుకుని రావాలని ఆదేశించడంతో ఎంతకైనా బరి తెగించడానికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.
కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎంత ప్రహసనంగా మారాయో చూస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి అధికారంలో ఉన్న నాయకులు ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. పైగా అదే హీరోయిజంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నికలు పారదర్శకంగా సాగడంపై సర్వత్రా అనుమానాలు, భయాలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప, విద్యావంతులు, ఉద్యోగులు, మేధావుల నిజమైన ప్రజాభిప్రాయం ఏంటో తెలిసే అవకాశం లేదని పలువురు అంటున్నారు. కావున కూటమితో తలపడే ప్రజా, ఉపాధ్యాయ సంఘాలు ముందస్తు భద్రతా చర్యల కోసం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం వుంది.
అవును గత 6 ఏళ్లుగా ఎన్నికలు గోరంగా జరుగుతున్నాయు ఆంద్రప్రదేశ్ లో
దురాక్రమణ ఏంట్రా?? లోకేష్ ఏమైనా ల0గా మోహన గాడి ప్యాలెస్ ని పెళ్ళాం తో సహా ఆక్రమించుకుంటున్నాడా??
అరాచకాలు అను.. వాటికి spelling నేర్పిందే ఈడు..
ఏదేమైనా గట్టునుండి ల0గా ఆరోపణలు చెయ్యడం కంటే ఎన్నికల్లో దిగి పోరాడి ఓడిపోయినా గౌరవం దక్కెది. ఏమంటావ్??
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
యుద్ధ భూమిలో చివరి వరకు పోరాడి ఓడేవాడు వీరుడా .. లేక యుద్ధ భూమి వొదిలేసి పారిపోయినవాడు వీరుడా ..
అధికారం లో ఉన్నప్పుడు తన ప్రాంతంలోనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఇలా ఎందుకు రాయలేదు
చంబా పులకేశి ముంచే పాలన. నిస్సిగ్గు గా dsc మొదటి సంతకం కు ఇంతవరకు దిక్కులేదు.graduates నిజం తెలుసుకోండి మోసాన్ని ఓడించండి