కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో వివిధ విశ్వ విద్యాలయాల వైస్ చాన్సెలర్లను బెదిరించి, రాజీనామాలు చేయించారని మండలిలో వైసీపీ సభ్యుడు చంద్రశేఖరరెడ్డి ఆరోపణలు …విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కోపం తెప్పించాయి. తీవ్ర కోపోద్రిక్తుడైన లోకేశ్ ఆధారాలేవీ అని వైసీపీకి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆధారాలు ఇస్తున్నా, అధికార పక్షం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది.
ఇదే విషయమై బుధవారం మీడియాతో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అధికార పక్షంపై మండిపడ్డారు. వీసీలను బెదిరించడంపై తాము ఆధారాలు ఇస్తున్నా, మంత్రి నారా లోకేశ్ తీసుకోలేదని విమర్శించారు. అన్ని ఆధారాలతో చట్టసభలో మాట్లాడుతుంటే అధికార పక్ష నేతలు బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి సర్కార్ వైఫల్యాలను సభలో ఎండగడుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విరుచుకుపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 మంది వీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే తాము రాజీనామాలు చేస్తున్నట్టు తమ లేఖల్లో వీసీలు పేర్కొన్నారని ఆయన అన్నారు. కేవలం ఇద్దరు వీసీలతో మాత్రమే ప్రభుత్వం రాజీనామా చేయించలేదన్నారు. అందులో ఒక వీసీ వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరొకరు మంత్రి అచ్చెన్నాయుడు మిత్రుడికి సంబంధించిన వారని ఆయన అన్నారు.
వీసీలపై బెదిరింపులకు సంబంధించి అన్ని ఆధారాలను మంత్రి లోకేశ్‌కు ఇస్తామన్నారు. ఇప్పటికైనా విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Dismiss kadha cheyalasindhi… RL ela teesukuntaru .. Yes tappu chesaru
2019 nundi 2024 time lo bedirimpula gurinchi vicharana cheyali actually
హే.. ఎం మాట్లాడుతున్నావ్…. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు , కనీసం ఒక్క వీసీ చేత కూడా రాజీనామా చేయించ లేకపోయారు.. appsc చైర్మన్ ని గానీ, ఎలక్షన్ కమిషన్ చేత రాజీనామా చేయించ లేకపోయారు. అదే… బాబోరు చూడండి.. ‘వాళ్ళే స్వచ్ఛందంగా’ రాజీనామా చేసుకునేలా చేశారు… వాళ్లకి అలాంటి రాజకీయాలు కావలి అంట.. మీరేమో దేవుడున్నాడులే అనుకునేవారు.. ఎక్కడికి వెళ్ళాడో ఆ దేవుడు ఇప్పుడు..
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
We will ask for evidences but in reality will not take evidences or file cases with those evidences. Similarly, we will say 4L jobs were given but in reality potential to create 4L jobs was created. Similarly, we will follow democracy but in reality it is the democracy that is defined by Red Book. That is the meaning of Manchi Prabhutvam!!