రాజ్-లావణ్య వివాదంపై వర్మ విశ్లేషణ

రాజ్ తరుణ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతోంది. కానీ చివరికి ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందని నాకు అనిపిస్తోంది

హీరో రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్లు సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని, గర్భం చేసి, అబార్షన్ కూడా చేయించాడని ఆరోపిస్తోంది లావణ్య అనే అమ్మాయి. దీనిపై గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. ఎంతోమంది తమకు తోచిన విశ్లేషణలు ఇస్తున్నారు.

మరి ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశ్లేషిస్తే ఎలా ఉంటుంది? సెన్సేషన్ ఎక్కడుంటే అక్కడ పాదం పెట్టే ఆర్జీవీ.. ఈ ఇష్యూలో కూడా వేలు పెట్టాడు. రాజ్-లావణ్య అంశంపై తనదైన విశ్లేషణ ఇచ్చాడు. అతడు పూర్తిగా రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడాడు.

“నాకు రాజ్ మాత్రమే కావాలంటే అది చాక్లెట్ కాదు కదా. అతడికి ఇష్టంలేనప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదో ఒక పాయింట్ దగ్గర అండర్ స్టాండింగ్ కు రావాలి. 11 ఏళ్లు సహజీవనం చేశానంటోంది, పెళ్లి చేసుకొని, 20 ఏళ్లు కాపురం చేసినోళ్లే విడాకులు తీసుకుంటున్నారు. సహజీవనంలో విడిపోవడం అసలు పాయింట్ కాదు.”

లావణ్య వరుసగా ఆడియో క్లిప్స్ రిలీజ్ చేయడంపై ఆర్జీవీ స్పందించాడు. క్రిమినల్ ఆలోచనలు ఉన్నవాళ్లే ఇలాంటి పనులు చేస్తారని చెబుతున్నాడు. ఆడియో రికార్డ్ చేయడమనే ఆలోచనే క్రిమినల్ మైండ్ సెట్ నుంచి వస్తుందని, ఆ ఆడియో క్లిప్స్ ను లీక్ చేయడం క్రిమినల్ మెంటాలిటీని సూచిస్తుందని అంటున్నాడు.

“రాజ్ తరుణ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతోంది. కానీ చివరికి ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ ఆమెకు కొంత డబ్బిచ్చాడని ఆమె స్వయంగా చెబుతోంది. కోర్టు లోపల అవుతుందా, కోర్టు బయట అవుతుందా అనే సంగతి పక్కనపెడితే.. డబ్బుతోనే ఈ మేటర్ సెటిల్ అవుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఉండడమనేది మాత్రం అసంభవం.”

రాజ్-లావణ్య వ్యవహారం మీడియా సర్కస్ గా మారిందనేది వర్మ అభిప్రాయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదొక వెబ్ సిరీస్ గా మారిపోయిందని అన్నాడు. రాజ్ కు బెయిల్ వచ్చేసింది కాబట్టి, కొత్తగా ఇవ్వాల్సిన సాక్ష్యాలు కూడా ఏం లేవు కాబట్టి, చివరికి పనిమనుషుల ఇంటర్వ్యూలు కూడా పూర్తయిపోయాయి కాబట్టి, మరో వారం రోజుల్లో ఈ వివాదం మీడియాకు ఓల్డ్ న్యూస్ కింద మారిపోతుందని విశ్లేషిస్తున్నాడు వర్మ.

16 Replies to “రాజ్-లావణ్య వివాదంపై వర్మ విశ్లేషణ”

  1. పాపం.. జగన్ రెడ్డి ఓడిపోయాక.. వీడికి పెద్దగా పనిలేనట్టుంది.. సంపాదన కూడా లేనట్టుంది..

    జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డాడు.. ఫలితాలు వచ్చిన రోజు పొద్దున్న 10 గంటలకే ప్లేట్ ఫిరాయించేసాడు.. ఇలాంటోళ్ళ సహాయం తో జగన్ రెడ్డి మళ్ళీ గెలవాలనుకొన్నాడు..

    ఇప్పుడు 11 అనే టైటిల్ తో సినిమా తీస్తే.. కాస్త సెన్సేషన్ అవొచ్చు..

  2. పోర్న్ డైరెక్టర్ వచ్చాడు నీతులు చెప్పటానికి , పోర్న్ సినిమాలు అని చెప్పి సాక్షి యాంకర్ స్వప్న రెడ్డి , శ్యామల , అరియనా , ఆషూ రెడ్డి , నీచుడు ఆలీ గాడు వీళ్ళని ఏమిచేసావు రా ఎదవ ?

  3. ఆఖరికి ఒక పనికిమాలిన కధనాన్ని బిగ్ స్టోరీ అని వేసుకునే స్థాయికి వచ్చేసావా GA😭😭

  4. ఇలాంటి వార్తల తో మీడియా నడిపే మీకు “ఒలింపిక్స్.. ఇండియా ఇంకెన్నేళ్లు ఇలా!” ఆలోచన ఎందుకు?

    1. మరే, ఆలోచన చేయకూడదు. చేస్తే, గత పదేళ్ళలో మీ అభిమాన ప్రభుత్వం క్రీడలకు పెద్దగా చేసిందేమీ లేదని ఒప్పుకోవలసి ఉంటుంది కదా. కుస్తీ క్రీడాకారులు నెలలు తరబడి ఆందోళన చేసినా బెదరని 56 అంగుళాల ఛాతీ మీది. అంతకు ముందు ప్రభుత్వాలు కూడా క్రీడలను పెద్దగా పట్టించుకోలేదు. దయచేసి వాళ్ళ మీద నెపం పెట్టి గత 10 ఏళ్లలో మీరేమి చేయని విషయాన్ని సమర్ధించుకోకండి

      1. డబ్బులు పంచుడు పితామహుడు ఎన్టీఆర్ అభిమానులకి అసలు ఈ చర్చ లోకి వచ్చే అర్హత లేదు, ఎన్టీఆర్ ముందు వరకు ఎంతో కొంత అభివృద్ధి జరిగేది. చంద్రబాబు చాలా నయం ఎన్టీఆర్ కంటే.

Comments are closed.