బాబుకు రెండు వర్గాల ఓట్లూ కావాలి… ఎలా?

తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఆశ పడుతున్నాడు. తప్పేమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అంతిమ లక్ష్యం అధికారమే అవుతుంది. అందులోనూ బాబు కొన్నేళ్లపాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా…

తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నాడు. ఆశ పడుతున్నాడు. తప్పేమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అంతిమ లక్ష్యం అధికారమే అవుతుంది. అందులోనూ బాబు కొన్నేళ్లపాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాదును తానే నిర్మించానని, సైరాబాదును నిర్మించానని చెప్పుకుంటాడు. సరే … రాజకీయ నాయకులకు ఇలా చెప్పుకోవడం మామూలే. హైదరాబాదు అభివృద్ధి వెనుక అనేకమంది సీఎంలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా డెవెలప్ చేశారు. ఎవరినీ తక్కువ చేయలేము.

ఇక బాబు విషయానికొస్తే ఏపీలో జగన్ పార్టీని చిత్తుగా ఓడించి అధికారంలోకి రావడంతో మంచి జోష్ మీద ఉన్నాడు. దీంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామంటున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో ఎవరూ చెప్పలేరు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు కూడా రానివ్వరు. కానీ రాజకీయాల్లో ఏ అద్భుతమైన జరగొచ్చు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నాడు కాబట్టి ఆ ఎన్నికల్లో సత్తా ఏమిటో తెలిసిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి అంచనాలు వేయలేం.

పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ ఇప్పుడు అనవసరం. ముందుగా పార్టీని నడిపించే సమర్ధ నాయకుడు లేదా నాయకురాలు కావాలి. అంటే తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు అన్న మాట . ఎన్టీఆర్ టైమ్ నుంచి టీడీపీ బీసీల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ హయాంలోనే అనేకమంది బీసీలు రాజకీయాల్లోకి ఎంటరై బలమైన నాయకులుగా ఎదిగారు.

తెలంగాణలో బీసీలు ఎక్కువ కాబట్టి వాళ్ళను కాదని ముందుకు పోవడం కష్టం. కాబట్టి వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణలో టీడీపీ అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఎన్నికల్లో వారి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందులోనూ ఎన్టీఆర్ కుటుంబ అభిమానులు ఉన్నారు. బాబు ఒకప్పుడు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడో మరేం పోటు పొడిచాడో ఇప్పుడు అనవసరం.

కానీ ఆ వర్గాన్ని కూడా విస్మరించడానికి వీలు లేదు. అంటే బాబుకు రెండు వర్గాల ఓట్లూ కావాలి. కాబట్టి బాబు టీటీడీపీ చీఫ్ కోసం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. సమర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. బాబు ఏం చేస్తాడో చూడాలి.

9 Replies to “బాబుకు రెండు వర్గాల ఓట్లూ కావాలి… ఎలా?”

  1. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద కుమార్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించునున్నట్టు సమాచారం.

  2. టీడీపీ పార్టీ మొదట్లో విప్లవాత్మక మార్పుల జన జీవితాల్ని మార్చడానికి పంచేసిండవచు. కానీ కాలక్రమేణా అది కమ్మ వారి కమ్మ కులం లో కేళకంగా ఉండే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ వ్యాపార ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడమే. దీన్నే విజన్ చంద్రబాబు అంటారు. ఇది చేస్తూ మిగిలిన దిగువ మద్యతరగతి వారికీ రెండు బిస్కట్ లు వేస్తారు అంతే. అలాగే వైస్సార్సీపీ కూడా రెడ్ల లో ఉన్న ఆలోచనలకూ ప్రతిబిబంగా వచ్చింది. కానీ జగన్ మోహన్ నేనొక్కడినే అంత అనుకుంటూ పార్టీ కి విజయం చేకూర్చిన వాళ్ళకి అన్యాయం చేసి గుడాసి పోయాడు. నెక్స్ట ఎలక్షన్ లకు కాంగ్రెస్ తో కలవకుంటే రెడ్డి గ్రూప్ మొత్తం జగన్ ను పూర్తి గ వదిలేస్తుంది

  3. అలా చేస్తే అది తప్పుడు దారి లో వెళ్లడమే, ఏపీ ప్రయోజనాలు వదులుకోవడం ప్లస్ ఏపీ మీద ఫోకస్ తగ్గిపోవడం! అందుకని తెలంగాణా obsession వదులుకోవాలి.

Comments are closed.