ఇసుక బాధలు పట్టించుకోని పవన్

కొద్ది పాటి ఇసుక వుంటే పలుకుబడి వున్న వారు పట్టుకుపోతున్నారు

జ‌గన్ పాలన కాలంలో ముల్లు గుచ్చుకుంటే కత్తి గుచ్చుకున్నంత నటన పదర్శన జ‌రిగేది ఇటు మీడియాలో అటు పవన్ కళ్యాణ్ లో. ఇసుక పాలసీ సెట్ చేసే గ్యాప్ లోనే విశాఖ వెళ్లి నానా హడావుడి చేసారు. భవన నిర్మాణ కార్మికులకు పని కరువైపోయింది అంటూ. కానీ తేదేపా ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నెల రోజులుగా ఇసుక దొరకడం అన్నది కష్టమైపోయినా మీడియా అటు దృష్టి సారించలేదు. సోషల్ మీడియాకు పట్టనే లేదు. మీడియా సంగతి సరే, భవన నిర్మాణ కార్మికులు అంటూ సదా కలవరించే డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ కు కూడా పట్టనే లేదు.

ప్రభుత్వం ఇసుక పాయింట్ ల దగ్గర చేరవేసిన స్టాక్ అంతా ఉచిత ఇసుక అంటూ గంటల్లో ఖాళీ చేసేసారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు సిసలు దోపిడీ. వర్షాల కారణంగా నదుల నుంచి ఇసుక తీయడం సాధ్యం కావడం లేదు. కొద్ది పాటి ఇసుక వుంటే పలుకుబడి వున్న వారు పట్టుకుపోతున్నారు. రోజుల తరబడి వాహనాలు, డ్రైవ‌ర్లు, కూలీలు ఇసుక ర్యాంప్ ల దగ్గర వుండిపోవాల్సి వస్తోంది. దాంతో వారి కూలీలు, భత్యాలు అన్నీ కలిసి ఇసుక ఖరీదు పెరిగిపోతోంది.

ఇప్పుడు కోస్తా జిల్లాల్లో ఇసుక దొరకడం కష్టంగా వుంది. దొరికినా రేటు ఎక్కువగా వుంది. మరో పక్కన వర్షాలు. దీంతో పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడి వుండి వుంటే ఈ పాటికి మీడియా, సోషల్ మీడియా గగ్గోలు పెట్టేవి. పవన్ కళ్యాణ్ ఏదో ఓ ప్రకటన చేసేవారు. ప్రస్తుతానికి అంతా గప్ చుప్ గా వుంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఙనాలకు పరిస్థితి తెలిసి వస్తోంది.

స్టాక్ యార్డ్ ల్లో వున్న ఇసుకను కాపాడుతూ, అదే పాలసీని వర్షాకాలం దాటే వరకు కొనసాగించి వుంటే ఈ సమస్య వచ్చేది. వర్షాకాలం తరువాత ఇసుక లభ్యత పెరిగినపుడు ఉచిత ఇసుక అంటే అది వేరుగా వుండేదేమో? ప్రస్తుతానికి అయితే ఉచిత ఇసుక పథకం, ఇసుక రేట్లను పెంచేసింది.

18 Replies to “ఇసుక బాధలు పట్టించుకోని పవన్”

  1. What govt can do if it’s raining and unable to get sand from river? I was recently traveling in andhra people said sand prices reduced drastically after new govt. previously it was 1000rs a ton. Now it is 300 a ton with delivery. So 70% down.

        1. where is the rates down ? TDP MLA /Ministers itself unhappy with the policy .Eeeadu /ABN has written many articles how local leader are looting sand . lorry drivers saying those who paid money to the local leader , they are getting sand before the the people who got the receipts .

          TDP leaders are storing the sand inn private dumps or selling the sand in other states . ha ha

  2. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    రైతులకు పం ట రుణాలపై సున్నా వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లు బకాయిలు పెట్టి పథకాన్ని

    నిర్వీ ర్యం చేశావు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చి న తర్వా త బకాయిలతో కలిపి రైతులకు

    అం దిం చిన వడ్డీ రాయితీ రూ.2,050 కోట్లు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  3. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    రైతులకు పం ట రుణాలపై సున్నా వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లు బకాయిలు పెట్టి పథకాన్ని

    నిర్వీ ర్యం చేశావు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చి న తర్వా త బకాయిలతో కలిపి రైతులకు

    అం దిం చిన వడ్డీ రాయితీ రూ.2,050 కోట్లు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  4. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    ఉచిత విద్యు త్ను నీరుగారుస్తూ రూ.8,845 కోట్లు బకాయిలు పెట్టిన చరిత్ర మీది. ఉచిత

    వ్యవసాయ విద్యు త్ సబ్సి డీ రూ.43,744 కోట్లు వైఎస్ జగన్హయాం లో అం దిం చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  5. “గాలి” వాటుగా, ఇసుక మాటుగా నోరుపెగలని రాజకీయం సెయ్యడం ఆలవాటేగా!

Comments are closed.