సీఎం రమేష్‌ హవా

విశాఖ జిల్లా వరకూ చూస్తే టీడీపీకి ఎంతమంది సీనియర్లు మాజీ మంత్రులు ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 2024 మధ్యలో సీనియర్లు ఎవరూ వైసీపీ సర్కార్‌ మీద పోరాటానికి బయటకు రాలేదని…

విశాఖ జిల్లా వరకూ చూస్తే టీడీపీకి ఎంతమంది సీనియర్లు మాజీ మంత్రులు ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే 2019 నుంచి 2024 మధ్యలో సీనియర్లు ఎవరూ వైసీపీ సర్కార్‌ మీద పోరాటానికి బయటకు రాలేదని అధినాయకత్వం అప్పట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

దాంతో 2024 ఎన్నికలలో టిక్కెట్ల దగ్గర కూడా కొందరు కీలక నేతలకు చివరి నిముషం వరకూ నాన్చి టిక్కెట్‌ను ఇచ్చింది. ఇక మంత్రివర్గంలో సీనియర్లను తీసుకోలేదు కూడా. అలా షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిందని ప్రచారం సాగింది.

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు. ఆమెతో పాటుగా జిల్లాలో కూటమి తరఫన బాధ్యతలు పూర్తి స్ధాయిలో నెరవేర్చేందుకు అనకాపల్లి ఎంపీ బీజేపీ నేత అయిన సీఎం రమేష్‌ ఉన్నారు. ఆయన పూర్వాశ్రమంలో చంద్రబాబుకు అనుంగు సన్నిహితుడు. అలాగే టీడీపీలోనే పుట్టి పెరిగారు.

దాంతో విశాఖలో కూటమి తరఫున వ్యవహారాలు చక్కబెట్టాలంటే ఆయనకే ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారని అంటున్నారు. దాంతో ఎక్కడో కడప జిల్లా నుంచి వచ్చిన సీఎం రమేష్‌ విశాఖ జిల్లాలో హవా చలాయిస్తున్నారని అంటున్నారు.

అంగబలం అర్ధబలం దండీగా ఉండడం వల్లనే ఆయనను ముందు పెడుతున్నారని కూడా అంటున్నారు. దాంతో కూటమి ప్రభుత్వంలో సీనియర్లది ఇక పరిమితమైన పాత్రనే అని కూడా గుసగుసలు పోతున్నారు.

7 Replies to “సీఎం రమేష్‌ హవా”

  1. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    2014-19 మధ్య ఐదేళ్లలో పం టల బీమా కిం ద మీరు ఇచ్చిం ది రూ.3,411 కోట్లే కదా?.

    వైఎస్ జగన్ హయాం లో ఇచ్చిం ది రూ.7,802 కోట్లు కదా? మరి ఎవరిది దరిద్రపు పాలన?

  2. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    రైతులకు పం ట రుణాలపై సున్నా వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లు బకాయిలు పెట్టి పథకాన్ని

    నిర్వీ ర్యం చేశావు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చి న తర్వా త బకాయిలతో కలిపి రైతులకు

    అం దిం చిన వడ్డీ రాయితీ రూ.2,050 కోట్లు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  3. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    ఉచిత విద్యు త్ను నీరుగారుస్తూ రూ.8,845 కోట్లు బకాయిలు పెట్టిన చరిత్ర మీది. ఉచిత

    వ్యవసాయ విద్యు త్ సబ్సి డీ రూ.43,744 కోట్లు వైఎస్ జగన్హయాం లో అం దిం చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  4. వైసీపీ హయాంలో అధికారం చెలాయించిన వీసారెడ్డి , సుబ్బారెడ్డి లు ఎక్కడ నుండి వచ్చార్రా ..

Comments are closed.