Advertisement

Advertisement


Home > Movies - Movie News

రియా కష్టాలు.. రిమాండ్ పొడిగించిన కోర్టు

రియా కష్టాలు.. రిమాండ్ పొడిగించిన కోర్టు

సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగుచూసిన వెంటనే అరెస్టయింది రియా చక్రబొర్తి. సెప్టెంబర్ 9న ఆమెను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, అప్పట్నుంచి ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ్టితో ఆమె రిమాండ్ గడువు పూర్తవ్వడంతో మరోసారి ముంబయి స్థానిక కోర్టులో రియాను హాజరుపరిచారు. కోర్టు మరోసారి రియా రిమాండ్ గడువును పెంచింది. అక్టోబర్ 6 వరకు రిమాండ్ ను కొనసాగిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ క్రమంలో రియా హైకోర్టు మెట్లు ఎక్కింది. తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రియా, ఆమె సోదరుడు షోవిక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి రేపు విచారణ జరుగుతుంది. హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తే, రియాకు విధించిన రిమాండ్ రేపటితో ముగిసిపోతుంది. లేదంటే.. తదుపరి బెయిల్ వచ్చేంతవరకు లేదా అక్టోబర్ 6 వరకు ఆమె బైకుల్లా జైలులో ఉండాల్సిందే.

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత ఊహించని విధంగా రియా వాట్సాప్ ఛాట్స్ లీక్ అయ్యాయి. అందులో ఆమె డ్రగ్ డీలర్స్ తో ఛాట్ చేస్తున్నట్టు ఉంది. ఆ వాట్సాప్ ఛాట్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఎన్సీబీ, ముందుగా రియా సోదరుడు షోవిక్, ఆ తర్వాత రియాను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలు సరఫరా చేసే పలువురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. అరెస్టైన కొందరు షోవిక్ ను గుర్తుపట్టారు కూడా.

మరోవైపు ఈ కేసులో రియా, మరికొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను బయటపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటివరకు రకుల్ ప్రీత్, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లాంటి పేర్లు తెరపైకి రాగా.. తాజాగా దీపిక పదుకోన్ పేరు కూడా వినిపించింది. ఈ మేరకు ఇప్పటికే దీపికకు పలు సేవలు అందిస్తున్న మేనేజర్ కరిష్మాను విచారిస్తున్న అధికారులు.. రేపోమాపో దీపికతో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

అసలు సినీపరిశ్రమలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, వాటి మూలాలు ఏంటనే అంశంపై ఎన్సీబీ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్, పంజాబ్ నుంచి ముంబయిలోకి డ్రగ్స్ వస్తున్నాయని ప్రాధమికంగా గుర్తించారు. ఇక ఆఫ్రికా దేశాల నుంచి దుబాయ్ కు.. అట్నుంచి ఇండియాకు డ్రగ్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ నెట్ వర్క్ ను కనిబెట్టేందుకు ఎన్సీబీలో ఓ వింగ్ తీవ్రంగా కృషిచేస్తోంది.

చంద్రబాబు రాజకీయ జీవితంలో రెండో తప్పు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?