స్వయంభు… షూటింగ్ పూర్తి

నిఖిల్ గెటప్, ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని స్టిల్స్ అన్నీ ఆసక్తికరంగా వున్నాయి. వన్స్ ప్రమోషన్ మెటీరియల్ బయటకు రావడం మొదలైతే సినిమాకు బజ్ వేరే లెవెల్ లో వుంటుంది.

నిఖిల్- భరత్ కృష్ణమాచారి కాంబినేషన్ లో టాగోర్ మధు నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ స్వయంభు. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. అన్నీ ఎక్కువే. స్టార్ కాస్ట్. షూటింగ్ టైమ్..ప్రీ ప్రొడక్షన్ వర్క్, సిజి వర్క్ లు ఒకటి కాదు. అన్నీ భారీనే. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దం అవుతోంది. సినిమా షూటింగ్ వర్క్ దాదాపు పూర్తయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు మాత్రం మిగిలాయి.

అయితే అలా అని సినిమా ఇప్పుడే విడుదల చేసేందుకు లేదు. ఎందుకంటే ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కువే. కనీసం రెండు నెలలు పడుతుందని అంచనా. అందుకే సినిమాను జూలైలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికెే ఈ సినిమా నాన్ థియేటర్ రైట్స్ అన్నీ నిఖిల్ కెరీర్ లో హయ్యస్ట్ రేట్లకు ఇచ్చేసారు. ఓవర్ సీస్ రైట్స్ ను అందరూ ఆశ్చర్యపోయేలా ఆరుకోట్ల నలభై లక్షలకు విక్రయించారు.

నిఖిల్ గెటప్, ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని స్టిల్స్ అన్నీ ఆసక్తికరంగా వున్నాయి. వన్స్ ప్రమోషన్ మెటీరియల్ బయటకు రావడం మొదలైతే సినిమాకు బజ్ వేరే లెవెల్ లో వుంటుంది. ఈ సినిమా తరువాత నిఖిల్ ఇండియా హవుస్ సినిమా చేస్తున్నారు. దాని తరువాత ఆసియన్ సినిమాస్ లో ఓ సినిమా చేస్తారు.

3 Replies to “స్వయంభు… షూటింగ్ పూర్తి”

Comments are closed.