పార్టీ ఉందా బన్నీ..?

సక్సెస్ పార్టీ పేరిట ఓ పెద్ద పార్టీ ఇచ్చి, అందర్నీ ఆహ్వానిస్తే ఆల్ ఈజ్ వెల్ అనిపించుకున్నట్టవుతుంది.

మెగా కాంపౌండ్ లో విబేధాల గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏపీ ఎన్నికల టైమ్ లో చీలిక స్పష్టంగా కనిపించింది. కాంపౌండ్ తో క్లోజ్ గా ఉండే బన్నీ వాసు లాంటివాళ్లు ఈ వివాదంపై ఇప్పటికే స్పందించారు. ఓ మంచి సందర్భం కోసం వెయిట్ చేస్తున్నానని, అలాంటి సందర్భం ఒక్కటొస్తే, అంతా కలిసిపోతారనే నమ్మకం తనకు ఉందని గతంలో చెప్పుకొచ్చాడు.

ఇప్పుడా సందర్భం రానే వచ్చింది. అటువైపు నుంచి ఓ అడుగు ముందుకు పడింది. ఇటు వైపు నుంచి అల్లు అర్జున్ కూడా ఓ అడుగు ముందుకేస్తే బన్నీ వాసు కలలుగంటున్న “సందర్భం” వచ్చేస్తుంది.

పుష్ప-2 రిలీజైంది. ఈ సినిమాపై సాయిదుర్గతేజ్ పోస్ట్ పెట్టాడు. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక నాగబాబు కూడా సినిమా పేరు, బన్నీ పేరు ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో వివాదం ముదిరి పాకాన పడినప్పుడు వీళ్లిద్దరే హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా సాయిదుర్గతేజ్, బన్నీని సోషల్ మీడియాలో అన్-ఫాలో కొట్టగా.. ఆ తర్వాత నాగబాబు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మనోడు, పరాయివాడు అంటూ పెద్ద పోస్ట్ పెట్టి తర్వాత డిలీట్ కొట్టారు.

ఆ ఇద్దరూ ఇప్పుడు బన్నీకి అనుకూలంగా పోస్టులు పెట్టారు. కాబట్టి ఇప్పుడు బన్నీ చొరవ తీసుకోవాల్సి టైమ్ వచ్చింది. ఈ దిశగా ఆయన ఇప్పటికే కొన్ని స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. బాలయ్య చిట్ చాట్ షోలో పవన్ ను పొగిడాడు. తన సినిమాకు టికెట్ రేట్లు పెంచినప్పుడు పవన్ కు థ్యాంక్స్ చెప్పాడు.

ఇదే క్రమంలో సక్సెస్ పార్టీ పేరిట ఓ పెద్ద పార్టీ ఇచ్చి, అందర్నీ ఆహ్వానిస్తే ఆల్ ఈజ్ వెల్ అనిపించుకున్నట్టవుతుంది. ఇలా పార్టీ ఇవ్వడం బన్నీకి కొత్త కాదు కాబట్టి, ఇదే సరైన సమయం అంటున్నారు తెలిసినవాళ్లు. మరి పార్టీ ఉందా పుష్పా..?

11 Replies to “పార్టీ ఉందా బన్నీ..?”

  1. Already పార్టీలో నలిగి, మునిగిపోయినట్లున్నాడు పాపం…సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు స్పందించలేనంతగా. దానికి కూడా అయ్యవారి team మాత్రమే తమ స్పందన తెలియపరుస్తుంది.

  2. తన భార్య గారి ఫ్రెండ్ గారి మొగుడు గారిని ఇంటికి పిలిచి బిరియాని పెట్టించి మరీ తనతో పాటు బెనిఫిట్ షో కి తీసుకెళ్లాడు. సినిమా సంగతి పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ కి ఎలా దూరంగా ఉండాలా అనే ఆలోచిస్తున్నాడు…

Comments are closed.