త్రివిక్రమ్ సినిమా చూడాలంటే ఎన్నాళ్లు ఆగాలి!

2024 జనవరిలో వచ్చింది గుంటూరుకారం. దర్శకుడు త్రివిక్రమ్ సినిమా. మళ్లీ మరోసారి ఆయన మ్యాజిక్ తెర మీద చూడాలంటే కనీసం ఇంకో రెండేళ్లు ఆగాల్సి వచ్చేలా వుంది.

2024 జనవరిలో వచ్చింది గుంటూరుకారం. దర్శకుడు త్రివిక్రమ్ సినిమా. మళ్లీ మరోసారి ఆయన మ్యాజిక్ తెర మీద చూడాలంటే కనీసం ఇంకో రెండేళ్లు ఆగాల్సి వచ్చేలా వుంది.

ఎందుకంటే ఈసారి త్రివిక్రమ్ ఎంచుకున్నది పాన్ ఇండియా, భారీ మైథలాజికల్ టచ్ వున్న సినిమా. అది కూడా పాన్ ఇండియా హీరో బన్నీతో. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బన్నీ ఒకె అంటే ఏప్రియల్-మేలో ప్రారంభం అవుతుంది. కానీ ఒక్క షెడ్యూలు మాత్రమే. సిజి వర్క్ లు ఎక్కువ వుండే సీన్లు తీస్తారు.

తరువాత బన్నీ మరో సినిమాను సమాంతరంగా ప్రారంభిస్తారు. ఆ సినిమాతో ఈ సినిమా చేసుకుంటూ వెళ్తే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. ఆ తరువాత అన్నీ పూర్తి చేసుకుని విడుదల కావాలంటే మరో ఆరు నెలలు. అంటే ఎలా లేదన్నా మరో రెండేళ్ల నుంచి రెండున్నరేళ్ల వరకు త్రివిక్రమ్ సినిమా తెర మీద కనిపించదు. 2027 చివరిలో లేదా 2028లో త్రివిక్రమ్ సినిమా వస్తుందనుకోవాలి.

దర్శకుడు రాజమౌళి మాత్రమే ఈ రకంగా వుంటున్నారు ఇన్నాళ్లూ. 2022లో ఆర్ఆర్ఆర్ వచ్చింది. మళ్లీ తరువాత సినిమా 2027 లో రావచ్చు. అంటే దాదాపు అయిదేళ్ల గ్యాప్. ఇప్పుడు ఈ జాబితాలో త్రివిక్రమ్ జాయిన్ అవుతున్నారు.

5 Replies to “త్రివిక్రమ్ సినిమా చూడాలంటే ఎన్నాళ్లు ఆగాలి!”

  1. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

Comments are closed.