డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆవేశపరుడు. ఎప్పుడెలా మాట్లాడుతుంటారో ఆయనకే తెలియదు. చెప్పుడు మాటలు ఎక్కువగా వింటుంటారని ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లు చెప్తుంటారు. ఏ మాత్రం విలువల్లేని, పోకరీ కోసం అనవసరంగా నాలుగేళ్లకు సరిపడేలా వైసీపీ, టీడీపీకి డిప్యూటీ సీఎం పవన్ ఆయుధాన్ని ఇచ్చారనే చర్చకు తెరలేచింది.
చిన్నారులు, మహిళలకు లైంగిక వేధింపులు, హత్యాచారాలు జరుగుతున్నాయని, జనం తమను తిడ్తున్నారని… హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ఇలాగైతే తానే హోంశాఖ మంత్రి బాధ్యతల్ని తీసుకోవాల్సి వస్తుందంటూ ఏవేవో మాట్లాడారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వుంటూ, బహిరంగ వేదికలపై ఇలా మాట్లాడ్డం ఏంటని టీడీపీ నేతల నుంచి ప్రశ్న.
అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే రీతిలో నిలదీశారు. చర్యలు తీసుకునే అధికారం చేతిలో పెట్టుకుని, ఇవేం మాటలని మండిపడ్డారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ తీవ్రస్థాయిలో పవన్‌పై విరుచుకుపడ్డారు. నీ మంత్రిత్వశాఖ గురించి సహచర మంత్రులు ఇలాగే మాట్లాడితే ఏంటి పరిస్థితి? అని మండిపడ్డారు. పవన్ తప్పులు చేయకపోతాడా? దొరక్కపోతాడా? అని మిత్రులు, ప్రత్యర్థులు ఎదురు చూడసాగారు.
ఈ నేపథ్యంలో జనసేన ఇన్‌చార్జ్ బాగోతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇదే సందర్భంలో పవన్‌కల్యాణ్‌ను కూడా టార్గెట్ చేశారు. యథా పవన్, తథా ఇన్‌చార్జ్ అంటూ సెటైర్స్ విసిరారు. అలాంటి వాళ్లందరికీ జనసేన పార్టీనే సరైందన్న దెప్పిపొడుపులు వెల్లువెత్తాయి.
జగన్‌కు సంబంధించి సరస్వతి ప్రాజెక్టు అసైన్డ్ భూములు ఆక్రమించిందని, అలాగే కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూముల్ని, పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అటవీ భూముల్ని ఆక్రమించారని టీడీపీ మీడియాలో కథనాలు వచ్చిన వెంటనే. సంబంధితశాఖ మంత్రిగా నిజాలు నిగ్గుతేల్చాలని పవన్ ఆదేశించారు.
కానీ సొంత పార్టీ ఇన్‌చార్జ్‌పై, మరీ ముఖ్యంగా మహిళల్ని వేధించిన ఆరోపణలే కాదు, వీడియోలు, ఆడియోలు బయటికొచ్చినా.. నిజాలు నిగ్గు తేల్చాలని పోలీస్ అధికారుల్ని ఆదేశించడానికి పవన్‌కు మనసు రాలేదు. అసలేం జరగనట్టు, తనకు సంబంధం లేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు పవన్ వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంత వరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా జనసేన అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.
ఆరోపణలపై వాస్తవాలు తేలే వరకూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండాలని పవన్ ఆదేశించినట్టు మీడియాలో ప్రకటన వచ్చింది. కానీ జానీ మాస్టార్ విషయంలో జనసేన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటన విడుదల చేసింది. మరి తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ విషయంలో మాత్రం అలాంటి ప్రకటనేదీ కనిపించడం లేదు. పవన్ చేసే ఈ తప్పే వైసీపీ, టీడీపీకి పవన్‌కల్యాణ్ ఆయుధం ఇచ్చినట్టైందన్న చర్చ జరుగుతోంది.
ఇదే తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సొంత పార్టీకి చెందిన మహిళ ఆరోపణలు చేయగానే, గంటల వ్యవధిలోనే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కోర్టులో బాధిత మహిళ కేసు వెనక్కి తీసుకున్నా, ఇంత వరకూ ఆదిమూలంపై సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదు. చంద్రబాబు నుంచి నేర్చుకుంటున్నా అని చెప్పే పవన్, ఏం నేర్చుకున్నావనే నిలదీతకు తిరుపతి జనసేన ఇన్‌చార్జ్‌పై చర్యలు తీసుకోకపోవడం కారణమైంది. ఇకపై హోంశాఖ మంత్రి అనితే… చాల్లేవయ్యా పవన్ అనే రోజులు ఎంతో దూరంలో లేవని పలువురు అంటున్నారు. ఇకపై మహిళల భద్రత, రక్షణ గురించి పవన్ నీతులు చెపితే, విరుచుకుపడడానికి తనకు తానుగా ప్రత్యర్థులకు ఇచ్చిన ఆయుధంతో దాడి చేస్తారని గుర్తించుకోవాలి.
Atleast JSP lo, TDP lo charyalu Teesukunnaaru. Mari YCP lo???
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఆయుధం అంటే గొడ్డలి లేక కోడికత్తి లేకపోతే కనీసం గులకరాయి.. అంతే కానీ దీన్ని ఆయుధం అని మావోడి స్కూల్ లో నేర్పించలేదులే
నాలుగు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుంది అంటావ్
Nud call available >>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది
Emo sir naaku kanapadadu, vinapadadu.
గంట అరగంట, సంజన సుకన్య ఎపిసోడ్ కూడా కనిపించలేదు వినిపించలేదు, ఒక ఎంపీ బట్టలు విప్పి వీడియోలు చేస్తే కనిపించదు వినిపించడు
Shameless covering. Someone’s mistake does not give you right to make the same mistake. Learn common sense before commenting on public forums, sir.
Someone’s mistake can’t be used as a pretext to cover your mistake. Common sense missing!!
Pavan సపోర్ట్ చేస్తాడో పార్టీ నుంచి డిస్మిస్ చెస్తాడో ఏదో ఒకటి చేసే వరకు ఆగటం లేదా మీకు? ఏదీ చేయాలన్న ముందు తనకి వాస్తవం తెలియాలి, తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది, తొందరెందుకు రాజా
Vc available
లక్ష్మీ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు రాజస్థాన్ పోలీస్ లు?
ఒరేయ్ వెంకిటి ..
గంట (అంబటి)
అరగంట (అవంతి)
పావు గంట (మాధవ్)
24 గంటలు (దువ్వాడ)
వీళ్ల విషయంలో నోరు మెదపలేదు.. పెన్ను కదలేదు
అంతెందుకు మన జగన్ అన్న సొంత తల్లి మీద చెల్లి మీద కే సు పెట్టినా కూడా ఫ్యామిలీలో ఇలాంటివి చాలా కామన్ బ్రో అని కథల మింగారు..
Veedhe padda falthu gaadhu , challe