ఈ ఏడాది కూడా మేజిక్ పనిచేస్తుందా?

ఆర్ఆర్ఆర్ సినిమాను మినహాయిస్తే.. ఏటా మార్చి నెలలో చిన్న సినిమా లేదా మీడియం రేంజ్ సినిమా హిట్టవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాను మినహాయిస్తే.. ఏటా మార్చి నెలలో చిన్న సినిమా లేదా మీడియం రేంజ్ సినిమా హిట్టవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ ఏడాది మార్చి నెలలో కూడా ఆ మేజిక్ రిపీట్ అవుతుందా?

గతేడాది మార్చిలో టిల్లూ స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. 2023 మార్చిలో బలగం లాంటి సెన్సేషనల్ మూవీతో పాటు దసరా, దాస్ కా ధమ్కీ సినిమాలొచ్చాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు 2022 మార్చిలో ఆర్ఆర్ఆర్ రాగా.. 2021 మార్చి నెలలో జాతిరత్నాల్లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అంతకంటే ముందు పలాస సినిమా వచ్చింది. మరి ఈ ఏడాది మార్చిలో ఆ మేజిక్ ను రిపీట్ చేసే సినిమా ఏది?

మార్చి మొదటి వారంలో జిగేల్, ఛావా సినిమాలొస్తున్నాయి. ఆల్రెడీ ఉత్తరాదిన హిట్టయిన ఛావా సినిమా తెలుగులో వస్తోంది. దీంతో ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి.

రెండో వారంలో దిల్ రుబా, కోర్టు సినిమాలొస్తున్నాయి. ‘క’ సినిమా సక్సెస్ తో ఊపుమీదున్న కిరణ్ అబ్బవరం నుంచి దిల్ రుబా వస్తోంది. ఇక నాని నిర్మాతగా, ప్రియదర్శి హీరోగా కోర్ట్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై నాని చాలా నమ్మకంగా ఉన్నాడు. మూవీ చివర్లో ప్రేక్షకులంతా లేచి చప్పట్లు కొడతారని చెబుతున్నాడంటే, నాని ధైర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

మూడోవారం చెప్పుకోదగ్గ సినిమాల్లేవు. నాలుగో వారం మాత్రం రోజుకో సినిమా ఉంది. 27న లూసిఫర్-2, 28న రాబిన్ హుడ్, 29న మ్యాడ్ స్క్వేర్ సినిమాలొస్తున్నాయి. లూసిఫర్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక భీష్మ లాంటి హిట్ తర్వాత వెంకీ కుడుముల, నితిన్ కలిసి చేస్తున్న సినిమా రాబిన్ హుడ్ కావడంతో ఈ మూవీపై కూడా అంచనాలున్నాయి. అటు సూపర్ హిట్టయిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ వస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా కూడా మార్చి 28న వస్తుందని మేకర్స్ పదేపదే చెబుతున్నారు. అదే కనుక జరిగితే రాబిన్ హుడ్ లేదా మ్యాడ్ స్క్వేర్ లో ఒకటి వాయిదా పడుతుంది. మొత్తమ్మీద మార్చి నెలలో ఏ సినిమా మేజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి. సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టే ఆ సినిమా ఏదనేది మరో నెల రోజుల్లో తేలిపోతుంది.

2 Replies to “ఈ ఏడాది కూడా మేజిక్ పనిచేస్తుందా?”

Comments are closed.