ఎమ్మెల్సీ కుమారుడిపై దాడికి టీడీపీ య‌త్నం!

త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించ‌డాన్ని పోలీసులు అడ్డుకోవ‌డం టీడీపీ నేత‌ల‌కు రుచించ‌లేదు.

సిటింగ్ ఎమ్మెల్సీ, ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు కుమారుడు అలిన్‌, పీఏ శ్రీ‌నివాస్‌పై టీడీపీ నేత‌లు దాడికి ప్ర‌య‌త్నించారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మంగ‌ళ‌గిరిలోని సీకే క‌ళాశాల పోలింగ్ బూత్ వ‌ద్ద టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తుండ‌డంతో ల‌క్ష్మ‌ణ‌రావు కుమారుడు, పీడీఎఫ్ నాయ‌కులు అడ్డు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఇరువ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు భారీ సంఖ్య‌లో వుండ‌డంతో దాడికి తెగ‌బ‌డ్డారు. అలిన్‌, పీఏ శ్రీ‌నివాస్‌పై దాడి చేసేందుకు కూట‌మి నేత‌లు వెంప‌ర్లాడారు. అయితే వాళ్ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దాడి నుంచి త‌ప్పించుకోగ‌లిగారు.

అయితే దాడిని అడ్డుకున్న పోలీసుల‌తో టీడీపీ వాగ్వాదానికి దిగారు. త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రించ‌డాన్ని పోలీసులు అడ్డుకోవ‌డం టీడీపీ నేత‌ల‌కు రుచించ‌లేదు.

టీడీపీ అభ్య‌ర్థి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పీడీఎఫ్ అభ్య‌ర్థి ల‌క్ష్మ‌ణ‌రావు మ‌ధ్య పోటీ హోరాహోరీని త‌ల‌పిస్తోంది. దీంతో రిగ్గింగ్‌, ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డానికి టీడీపీ తెర‌లేపింద‌న్న విమ‌ర్శ పీడీఎఫ్ నుంచి వ‌చ్చింది. కొన్నిచోట్ల టీడీపీ నేత‌ల ప్ర‌లోభాల్ని పీడీఎఫ్ నాయ‌కులు అడ్డుకున్నారు.

11 Replies to “ఎమ్మెల్సీ కుమారుడిపై దాడికి టీడీపీ య‌త్నం!”

  1. పీడీఎఫ్ చేసిన పోరాటం కూడా మన పులివెందుల పులుల సంఘం .. వైసీపీ నాయకులు చేయలేకపోయారు..

    పారిపోయి దాక్కున్నారు.. పిరికిపందలు ..

      1. బొల్లి గాడు… సూపర్ 6 కి డబ్బుల్లేవు … అని అంటున్నాడు.

        మరి.. ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు.. అప్పుడే.. 8 నెలలలకే.. 1.2 లక్షలకోట్ల అప్పుచేసాడు.. అంటే.. రోజుకి.. 500 కోట్ల అప్పు!

        ఎక్కడ ఖర్చు చేస్తున్నాడో.. వైట్ పేపర్ రిలీజ్ చెయ్యడు.. కాని అప్పులు చేసేస్తున్నాడు! ఇది… Bolli పాలన Transparency!

        1. ఒరేయ్ సన్నాసి…ఏది ఆ లక్ష కోట్ల లెక్క చెప్పు. ఎప్పుడు తెచ్చారో, ఎక్కడ తెచ్చారో?

        2. ఒరేయ్ gutle…ఏది ఆ లక్ష కోట్ల లెక్క చెప్పు. ఎప్పుడు తెచ్చారు, ఎక్కడ తెచ్చారో?

        3. ఆ లక్ష కోట్ల లెక్క చెప్పు. ఎప్పుడు తెచ్చారు, ఎక్కడ తెచ్చారో?

Comments are closed.