రేపట్నుంచి షూటింగ్.. పవన్ వస్తారా?

మరోసారి అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగారు. పవన్ నుంచి స్పష్టమైన హామీ పొందారు. షూటింగ్ కు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. హీరోకు దగ్గరగా ఉండడం కోసం బెజవాడలోనే షూట్ పెట్టుకున్నారు. Advertisement లెక్కప్రకారం,…

మరోసారి అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగారు. పవన్ నుంచి స్పష్టమైన హామీ పొందారు. షూటింగ్ కు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. హీరోకు దగ్గరగా ఉండడం కోసం బెజవాడలోనే షూట్ పెట్టుకున్నారు.

లెక్కప్రకారం, రేపట్నుంచి పవన్ సెట్స్ పైకి రావాలి. మరి ఆయన లొకేషన్ కు వస్తారా? ముఖానికి రంగేసుకుంటారా? నిన్నటివరకు ఈ అనుమానం లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. దీనికి కారణం పవన్ మరోసారి దీక్ష చేపట్టారు.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన ఈ ప్రత్యేక దీక్షబూనారు.

ఈ దీక్షలో ఆయన 11 రోజుల పాటు ఉంటారు. మరి దీక్షలో ఉంటుండగానే ఆయన షూటింగ్ కు హాజరవుతారా లేక హరిహర వీరమల్లు షూటింగ్ ను 11 రోజులు వాయిదా వేస్తారా…?

పవన్ కల్యాణ్ గతంలో కూడా కొన్ని దీక్షలు చేపట్టారు. అలా దీక్షలో ఉన్న ప్రతిసారి సినిమా షూటింగ్స్ కు ఆయన దూరంగానే ఉన్నారు. ఈసారి కూడా ఆయన దీక్షలో ఉన్నారు. మరి షూటింగ్ కు వస్తారా?

జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ 20 రోజులు కాల్షీట్లు ఇస్తే, పార్ట్-1 సిద్ధమౌతుంది.

9 Replies to “రేపట్నుంచి షూటింగ్.. పవన్ వస్తారా?”

    1. Don’t blame bro pawan kalyan is real time and reel time hero…… Do your work he done his work for Ap he donates 400 Lakh rupees to 400 panchayaths…. At least you donate 1% of them and comment on him….. 😊 hope you may realize

      1. donate chestadu andi movie ki 50 cr

        tisukutunnadu ani cheptunnadu

        party fund Kuda 2000 cr vundhi anta

        mext 3 wife’s ki settlement chesedu

        inkha janam and manam antunnadu

        ontariga poti chese dammi lekha

        3 flags yettukunnadu

      2. He is in the govt . There is no need to donate .he can give govt funds.what u mean is he can’t fight for funds he is not a leader he is a donator.donation can be done in any govt.

Comments are closed.