Advertisement

Advertisement


Home > Movies - Movie News

వకీల్ సాబ్ అసలు రంగు తేలే టైమ్ వచ్చేసింది

వకీల్ సాబ్ అసలు రంగు తేలే టైమ్ వచ్చేసింది

రివ్యూస్ అదిరిపోయాయి. అఫీషియల్ గా చెప్పకపోయినా వసూళ్లు బ్రహ్మాండం అంటూ కథనాలు వచ్చేశాయి. బాహుబలి-2 తర్వాత వకీల్ సాబే అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో నిజానిజాలు పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా అసలు రంగు ఈరోజుతో తేలిపోతుంది.

ఏపీ, నైజాంలో 78 కోట్ల రూపాయలు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది వకీల్ సాబ్ మూవీ. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా ఈరోజు కూడా వసూళ్లు రావాలి. ఈరోజు మాత్రమే కాదు.. ఈరోజు నుంచి ప్రతి రోజు అంతో ఇంతో షేర్ యాడ్ అవ్వాలి. సినిమా మంచి ఆక్యుపెన్సీతో ఆడాలి. అప్పుడు మాత్రమే వకీల్ గట్టెక్కుతాడు.

ఉన్నంతలో ఈ సినిమాకు కలిసొచ్చే అంశం మరో వీకెండ్. రాబోయే వారాంతం ఏ పెద్ద సినిమా విడుదల కావడం లేదు. లవ్ స్టోరీ సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు. కాబట్టి వర్కింగ్ డేస్ తో పాటు.. రాబోయే వీకెండ్ కూడా సినిమా గట్టిగా ఆడితేనే బ్రేక్ ఈవెన్ సాధ్యం.

మరోవైపు వారాంతమైన ఆదివారం రోజునే వకీల్ సాబ్ కు హౌజ్ ఫుల్స్ పడలేదు. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు సగమే నిండాయి. కరోనా భయంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లు రాకపోవడం వల్లనే ఈ సమస్య ఎదురైంది. ఇలాంటి కఠిన పరిస్థితుల మధ్య ఇవాళ్టి నుంచి వకీల్ సాబ్, థియేటర్లరకు జనాల్ని రప్పించగలడా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మొదటి 3 రోజుల వసూళ్లతో ఇప్పటికే 60శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. మరో వారం రోజులు టైమ్ ఉంది కాబట్టి సులభంగానే టార్గెట్ అందుకుంటుంది. కాకపోతే ఇది ఏ రేంజ్ హిట్ అవుతుందనేది ఈ వారం రోజుల వసూళ్లపైనే ఆధారపడి ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?