మాట‌లు తేడా కొడుతున్నాయి.. మెగాస్టారూ!

ఒక సినిమా న‌టుడిని అభిమానులు అయినా ఎంత‌కాలం గుర్తుంచుకుంటారు?

ఆ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా ఈవెంట్ లో గొప్ప‌లు చెప్పుకున్న వైనంపై ఆ వీడియో కింద కామెంట్ల‌లో కొంత‌మంది మోహ‌న్ బాబు ను ప్ర‌స్తావించుకున్నారు. త‌ను ఎంత గొప్ప న‌టుడినో మోహ‌న్ బాబు గ‌తంలో చెప్పుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ, చిరంజీవి కూడా అదే బాట ప‌ట్టాడంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. నిస్సందేహంగా వీరు గొప్ప న‌టులే! అయితే.. ఎటొచ్చీ త‌మ గొప్ప న‌ట‌న గురించి, న‌ట‌న‌లో త‌మ గొప్ప‌ద‌నం గురించి తామే చెప్పుకోవ‌డ‌మే అదెంత‌టి వారి విష‌యంలో అయినా.. విడ్డూరంగా ఉంటుంది!

వీరి స‌మ‌కాలీకుడు, న‌ట‌న‌లో వీరి క‌న్నా నాలుగాకులు ఎక్కువే న‌మిలిన మ‌మ్ముట్టీ ఆ మ‌ధ్య ఒక ఇంట‌ర్వ్యూలో ఇచ్చి.. ఒక సినిమా న‌టుడిని అభిమానులు అయినా ఎంత‌కాలం గుర్తుంచుకుంటారు? అంటూ ఒక ప్ర‌శ్న వేశారు. మ‌హా అంటే.. కొన్ని సంవ‌త్స‌రాలు, ఆ త‌ర్వాత ఎంత‌టి న‌టుల‌నైనా అభిమాన‌గ‌ణాలు కూడా మ‌రిచిపోతారంటూ మ‌మ్ముట్టీ ఆ వీడియో ఇంట‌ర్వ్యూలో వ్యాక్యానిస్తారు. చెప్పుకోవాలంటే.

త‌నెంత గొప్ప న‌టుడినో, త‌నెలాంటి పాత్ర‌ల‌ను అవ‌లీల‌గా పోషించాన‌నో లేక ఎంత క‌ష్ట‌ప‌డ్డ‌ట్టో చెప్పుకోవ‌చ్చు మ‌మ్ముట్టీ కూడా! న‌టిస్తే ఏమంత గొప్ప‌? కాల ప్ర‌వాహంలో ఎవ‌రినైనా అంతా మ‌రిచిపోతారు, కొత్త నీరు వ‌స్తుంద‌న్న‌ట్టుగా మ‌మ్ముట్టీ స్పంద‌న ఉంది. ఏదో తాత్విక ధోర‌ణిలో కూడా కాదు, ప్రాక్ట‌క‌ల్ గా స్పందించాడు ఆ స్టార్ హీరో!

అయితే తెలుగులో ఎందుకో మోహ‌న్ బాబు అయినా, మెగాస్టార్ అయినా త‌మ గొప్ప‌ద‌నాల‌ను చెప్పుకుంటున్నారు పాపం! వీరిని తెలుగు సినిమా ప్రియులు ఎప్పుడో గుర్తించారు! స్టార్ ఇమేజ్ ల‌ను ఇచ్చారు. వీరిని ఆరాధించారు. హీరోలుగా, న‌టులుగా వీరిని ఇప్ప‌టికీ అభిమానిస్తూ ఉన్నారు. అలాంట‌ప్పుడు.. త‌మ న‌ట‌నా ప‌టిమ‌ల గురించి తామే ఎందుకు చెప్పుకుంటున్న‌ట్టు అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే జ‌నిస్తుంది.

చిరంజీవి త‌న న‌ట‌నా ప్రావీణ్యం గురించి చెప్పుకున్న త‌ర్వాత మ‌రో సినిమా ఫంక్ష‌న్లో మాట్లాడిన మాట‌లు చోద్యం అనిపిస్తాయి. బ్ర‌హ్మానందం అనే సినిమా ఫంక్ష‌న్లో మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘ఎరుపు’ ఫేస్ అంటూ ఒక మాట మాట్లాడారు! అందుకు అర్థం ఏమిటో ఆయ‌న‌కే తెలియాలి. అయితే ఆయ‌న వ‌య‌సుకు, ఆయ‌న స్టార్ స్టేట‌స్ కూ అలాంటి మాట‌లు మాట్లాడ‌టం ఏమిటో కూడా ఆయ‌న‌కే తెలియాలి. ఆ వ‌య‌సులో ఉన్న బ్ర‌హ్మానందాన్ని ఉద్దేశించి అలాంటి మాట మాట్లాడ‌టం కూడా ఏమిటో మ‌రి. దాన్ని ప‌ట్టుకుని డీ గ్రేడ్ ఇన్ స్టాగ్ర‌మ్ పేజీల వాళ్లు మెగాస్టార్ కూడా మ‌నోడే అంటూ ఉన్నారంటే.. ఇక వేరే వ‌ర్ణ‌న‌లు అవ‌స‌రం లేదు!

ఇక ఇదే స‌మ‌యంలో మ‌న‌వ‌డు, వార‌స‌త్వం అన‌డం ద్వారా మెగాస్టార్ త‌న ధోర‌ణి ఏమిటో చాటుకున్న‌ట్టుగానే ఉంది. కోడ‌లు కొడుకును కంటానంటే అత్త వ‌ద్దంటుందా అంటూ.. వెనుక‌టికి ఒక ముఖ్య‌మంత్రే వ్యాక్యానించారు! ఇప్ప‌టికీ పురుష సంతానం గొప్ప‌, స్త్రీ సంతానం త‌క్కువ అనే ధోర‌ణి మ‌న స‌మాజం నుంచి పోలేదు. ఇలాంటి స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌ముఖులు, గుర్తింపును క‌లిగిన వారు ఇలా మాట్లాడ‌టం స‌మాజంపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపిస్తుందో వారే ఆలోచించుకోవాలి!

ఇక మరో సినిమా ఫంక్ష‌న్లో ‘జై జ‌న‌సేన‌’ నినాదంతో కూడా చిరంజీవి విమ‌ర్శ‌ల‌కు గురి కాక త‌ప్ప‌డం లేదు. ప్ర‌జారాజ్యానికి రూపంత‌ర‌మే జ‌న‌సేన అంటూ చిరంజీవి ఏదో చెప్పుకొచ్చారు! అయితే ప్ర‌జారాజ్యం ఎప్పుడో కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. అలా విలీనం అయిపోయాకా.. మ‌ళ్లీ రూపాంత‌రం ఏమిటి? మ‌రి ఒక‌వేళ ప్రజారాజ్యానికి రూపాంత‌ర‌మే జ‌న‌సేన అయి ఉంటే.. ఈ పార్టీ ఆవిర్భావం అప్పుడే ప్ర‌క‌టించి ఉంటే స‌రిపోయేది క‌దా! 2014లో చెప్ప‌లేదు, 2019లో చెప్ప‌లేదు, 2024 ఎన్నిక‌ల ముందు కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు లేవు! ఉన్న‌ట్టుండి ఈ రూపాంత‌ర ప్ర‌క‌ట‌న ఏమిటో మ‌రి.

జై జ‌న‌సేన అంటూ చిరంజీవి అనొచ్చు కానీ, మ‌ళ్లీ ప్ర‌జారాజ్యాన్ని గుర్తు చేసి.. కోరి విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్టుగా ఉంది! మొత్తానికి మెగాస్టార్ మాట‌లు ఎలా ఉన్నాయి అంటే ర‌క‌ర‌కాలుగా ఉన్నాయి మాస్టారు అనొచ్చు! మ‌రి ఈ ధోర‌ణి ముందు ముందు ఎలా ఉండ‌బోతోందో!

17 Replies to “మాట‌లు తేడా కొడుతున్నాయి.. మెగాస్టారూ!”

  1. ఈ గొడవలన్నీ విశ్వంభర ప్రమోషన్ కి ఉపయోగపడతాయి. నువ్వు తగ్గకు, రోజుకి ఒక ఆ/ర్టి/క/ల్ చొప్పున వడ్డిస్తూ వుండు.

  2. మమ్మూటీ రాంగ్. ఏపీ లో డైరెక్ట్ దేవుడి స్టేటస్ కి ప్రమోట్ చేసి జనాన్ని విగ్రహంల తో బాదేస్తారు. కేరళలో ఇంకా అలా అవ్వలేదేమో. ఇక్కడ గోదారి కాడ లఘు సంకకి పోయిన ఫ్లూట్ తో కొడతాడని భయం. సెక్యూరిటీ గుర్డ్స్ ఉండరు. డైరెక్ట్ దేముడు ముసిగేసిన మనిషీ కాపలా. ఇదే ప గా కాని ప గా తీర్చుకోవడమే.

  3. మొదలే నీ కొడుకూ కోడండ్లిద్దరూ చక్కల్లాగున్నారు. పదేండ్లపాటూ వెయ్యి పద్ధతుల్లో ప్రయత్నిస్తే క్లింగుమంటూ ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్టు అంటే.. అన్నయ్యా! మగైనా, ఆడైనా ఒకే.. .. నీకున్న లెగసీతో సినిమాల్లోకి వీజీగా వచ్చేయొచ్చు. కానీ, తేడాగా మాడా పుడితే మాత్రం మన బుస్ బాబు రికమండేషన్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ వేషాలు వేసుకోవాలి. ఆలోచించుకో!

Comments are closed.