చిరంజీవి గారు! ఈ భగవద్గీత శ్లోకం చూడండి

చిరంజీవి ఆకర్షణీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా వినాలనిపిస్తుంది.

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

ఇది భగవద్గీత శ్లోకం.
“శ్రేష్టులు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.”

ఇది ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పిన మాట. అప్పుడు మహర్షులు వంటి వారిని “శ్రేష్టులుగా” పరిగణించేది సమాజం. కానీ కలియుగంలో, అందులోనూ నేటి సమాజంలో సినీనటులు, రాజకీయనాయకులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు..వీళ్లనే శ్రేష్టులుగా చూస్తోంది లోకం. ఎందుకంటే తరచూ వాళ్లే వార్తల్లో మెరుస్తున్నారు. వాళ్ల గురించే చర్చలు చేస్తాం. వాళ్లు ఫలానా మంచి పని చేస్తే అదర్శవంతమైన పని అనుకోవడం; చెత్త పని చేస్తే “ఛీ” అనుకోవడం రివాజైపోయింది. కనుక పైన చెప్పిన నాలుగు రంగాల్లోనూ ఉన్న ప్రముఖులకి సామాజిక బాధ్యత వాచా, కర్మణా పాటించాల్సిన పరిస్థితి ఉంది.

సుప్రసిద్ధ నటులు చిరంజీవికి ఈ ఏడు 70 ఏళ్లు నిండుతున్నాయి. అయినప్పటికీ శారీరక పటుత్వాన్ని కాపాడుకోవడంలో ఆయనలోని శ్రేష్టత్వం కనపడుతోంది. యువ కథానాయకులతో పోటీ పడుతున్న వారి నటనాప్రస్థానం అద్భుతంగా అనిపిస్తుంది.

అలాగే వారి నేత్ర, రక్తదాన కార్యక్రమాలు మెచ్చుకోదగ్గ గొప్ప విషయాలు. ఆ విధంగా ఆయన “కర్మణా” (చేతల పరంగా) శ్రేష్ఠుడిగానే ఉన్నారు. మరి “వాచా” (వాక్కు పరంగా) ఉన్నారా?

ఇన్నాళ్లూ సరే! తాజాగా మాత్రం కాస్తంత తప్పటడుగులు వేస్తోంది ఆయన మాట.

చిరంజీవి ఆకర్షణీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా వినాలనిపిస్తుంది. మధ్యలో చిన్నచిన్న ఛలోక్తులు అవీ కూడా వినిపిస్తుంటారాయన. కానీ ఆ ఊపులో ఆయన కొన్ని విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే వారిలోని శ్రేష్ఠత్వానికి భంగం కలగకుండా ఉంటుంది.

ఉదాహరణకి ఆయన సినిమా వేదికలమీద రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకురావడం అనవసరం. అది మంచా, చెడా అనేది కాదు..”అనవసరం” అని మాత్రమే ఇక్కడ చెబుతున్నది. ప్రజారాజ్యం నుంచే జనసేన పుట్టింది..లాంటి విషయం, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం..వీటి గురించి వేరే సినిమా వేదికల మీద మాట్లాడడం అప్రస్తుత ప్రసంగమే అవుతుంది.

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన విషయం చరిత్రలో ఒక పేజీ. ఆ రోజుల్లో వేటూరి సుందరరామమూర్తి ఒక సభలో చిరంజీవి పక్కన ఉండగానే, “బృందావనంలో ఉన్నవాడు దండకారణ్యంలోకి వెళ్తున్నాడు..” అంటూ అలంకారప్రాయంగా చెప్పారు. హాయిగా సినిమాలు చేసుకుంటున్నవాడికి రాజకీయ కష్టాలెందుకో అనే శ్లేష ఆయన మాటల్లో వినపడింది. కానీ చిరంజీవి దానిని ప్రశంసగా తీసుకున్నట్టు కనిపించారు. ప్రసన్నంగా నవ్వారు. కానీ కాలక్రమంలో కవిగారి మనోభావం చిరంజీవికి అర్ధమయ్యే ఉంటుంది. అది వేరే విషయం.

చిరంజీవి ప్రస్తుతానికి మాజీ రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయాల్లో లేనని, ఇక అడుగు పెట్టబోనని ఆయనే స్వయంగా చెప్తున్నారు. దానికి పూర్తిగా కట్టుబడి ఏ విధమైన రాజకీయ ప్రస్తావనలూ వేదికల మీద తీసుకురాకపోవడం మంచిది.

అదలా ఉంటే మరొక తూకం తప్పిన మాట- రాం చరణ్ కొడుకును కంటే బాగుణ్ణు అనేది. నిజానికి ఆయన ఆక్షేపించదగిన విధంగా ఏమీ మాట్లాడలేదు. చాలా హుందాగా, సరదాగా, ఇంట్లో మాట్లాడుకున్నట్టు మనసు విప్పి ప్రవాహంలో అన్న మాట అది. అది విన్నవాళ్లు ఎవరికీ తప్పుగా అనిపించదు కూడా. కానీ అది ఈ రోజు జాతీయ స్థాయి వార్త అయ్యింది. చిరంజీవి స్త్రీ శిశువులకి వ్యతిరేకి అని, పురుషాహంకారం ప్రదర్శించారని అక్కర్లేనీ వార్తలన్నీ వడ్డిస్తున్నారు. అలాగని ఆ మీడియానీ తప్పు పట్టే ప్రసక్తి లేదు. అది ఎప్పుడూ తెరిచిపెట్టిన పెట్రోల్ బావి లాంటిది. చిన్న అగ్గి రవ్వపడ్డా భగ్గు మంటుంది. చిరంజీవి అన్న మాటని వక్రదృష్టితో చూసి విశ్లేషిస్తోంది జాతీయ మీడియా. కనుక ఆకర్షణీయంగా మాట్లాడడమే కాదు ఎంతో ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి చిరంజీవికి ఉంది.

ఇక మూడోది..సొంత తాతయ్యని తక్కువచేసి మాట్లాడడం. దౌహిత్రుడుగా తాతయ్యలోని మంచిగుణాలే ప్రపంచానికి చెప్పాలి తప్ప వేరేవి కాదు. మనుషులన్నాక బలహీనతలు ఉంటాయి, అలాగే బలాలూ ఉంటాయి. లోకం విడిచి వెళ్లిపోయాక బలాలే మాట్లాడుకోవాలి తప్ప బలహీనతలు కావు. చిరంజీవి దృష్టిలో ఆయన తాతయ్యగారి ఇద్దరు భార్యల సంసారం, మూడో వ్యక్తితో వ్యవహారం చెప్పి.. అవి కాక ఇంకెన్నున్నాయో తెలియదనడం..అనవసర ప్రస్తావన. చిరంజీవి దృష్టిలో గొప్ప శృంగారపురుషుడిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టు అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన స్థాయికి అది తక్కువ అనిపించుకుంటుంది. ఎందుకంటే అలా చెప్పి ఆగకుండా, ఆ లక్షణం తనకు రాలేదని, ఆయనలోని దానగుణమే కొంత వచ్చిందని చెప్పుకున్నారు. కానీ లోకం చెడు, మంచి చెప్పినప్పుడు మంచిని పక్కన పారేసి చెడునే శ్రద్ధగా వింటుంది. “మీకు మీ తాతగారి పోలికలు రాలేదు కానీ, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి వచ్చాయిలేండి” అంటూ వీడియోలు పెడుతున్నారు కుర్రకారు. ఎందుకొచ్చిన గోల చెప్పండి. తనని తాను పొగుడుకోవడానికి తాతగారిని తెగడడం చిరంజీవి స్థాయికి తగదు.

ఇక్కడ చెప్పేది ఒక్కటే…కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి, కాస్తంత తప్పు దొర్లితే రాద్ధాంతం చేయడానికి ప్రపంచం వేచి చూస్తూ ఉంటుంది, వారనుకునే “శ్రేష్టుల” విషయంలో. కనుక చిరంజీవి ఆచి తూచి మాట్లాడాలి. హాస్యం పేరుతో, సరదా పేరుతో ఏది మాట్లాడాలనుకున్నా అది ఎవర్ని ఏవిధంగా తగులుతుందో ఆలోచించాలి. “అవన్నీ ఎందుకు, మనసుకు తోచింది మాట్లాడే హక్కు లేదా” అంటే సామాన్యుడికి కొంతవరకూ ఉంటుంది. కానీ ఏది మాట్లాడినా చరిత్రలో నిక్షిప్తమైపోయే స్థాయిగల చిరంజీవికి మాత్రం ఆ హక్కు ఉండదు. చాలా ఆలోచించి ఒక మాట అనాలి. అప్పుడే ఆయన నటుడిగానే కాకుండా, ఆదర్శవంతమైన వ్యక్తిగా కూడా ఎప్పటికీ చరిత్రలో చిరంజీవిగా నిలిచుంటారు. స్వస్తి.

ధర్భశయనం సూర్యనారాయణ, యు.ఎస్.ఏ

29 Replies to “చిరంజీవి గారు! ఈ భగవద్గీత శ్లోకం చూడండి”

  1. ఆ చిరునే.. దణ్ణం పెట్టినట్టే పెడుతూ తమ్ముడితో జగ్గడు గు..ద్ద అంతా చీల్చి చీల్చి చండాలం చెపిచ్చాడు:)

  2. దణ్ణం పెట్టినట్టే పెట్టి తమ్మి తో j గాడి గు/ద్ద బెంగిచ్చాడు..చాల లేదా.. ఓ ఒకటే రాసేస్తుండావ్!

    ఆ నేషనల్ ఛానళ్లు..ఇక్కడి మీ బు..లుగు ఛానళ్లు చిరు ఎతులు పీక్కోండి .

  3. దణ్ణం పెట్టినట్టే పెట్టి తమ్మి తో జగ్గా గు…*/ద్ద బెంగిచ్చాడు..చాల లేదా.. ఓ ఒకటే రాసేస్తుండావ్!

    ఆ నేషనల్ ఛానళ్లు..ఇక్కడి మీ బు..లు..గు ఛానళ్లు చిరు ఎతులు పీ…క్కోండి .

  4. ద..ణ్ణం పెట్టినట్టే పెట్టి తమ్మి తో j గాడి గు/..ద్ద బెంగి..చ్చాడు..చా..ల లేదా.. ఓ ఒకటే రా.ఎంసేస్తుండావ్!

    ఆ నేష..నల్ ఛానళ్లు..ఇక్కడి మీ బు..లు.ఎంగు ఛానళ్లు చిరు ఎతు..లు పీక్కోండి .

    1. హాహా.. ఒంటికి రంగెసునే బతుకులకు వొళ్ళు అమ్ముకోవడం లేదా తాకట్టు పెట్టుకోడం తప్ప.. గెలవడం .. దానికోసం పోరాడడం తేలేదు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవ బొల్లి గాడికి కూడా చేతకాదు అనుకో.. ఆది వేరే విషయం.. పిల్ల పూ

      1. పోరాటమా ..అంటే అడగకుండా చేతులు ఎత్తేయడమా …సరే అయితే మన జాతి రత్నం పోరాట వీరుడే ..

  5. అందరికీ సామాజిక బాధ్యత ఉండాలి, కానీ మన తుగ్లుక్ కి మాత్రం అవేమీ అవసరం లేదు. అయినా మన గొర్రెలు పెద్ద బాధ్యత లు ఇస్తుంటారు వాడికి అదేమీ విడ్డురమో అర్ధం అవ్వట్లేదు .

  6. హమ్మయ్య……ఈ ఇబ్బందులు మొత్తం శ్రేష్ఠుడు ఐన చిరంజీవి గారి లాంటి వాళ్ళకు మాత్రమే అంటావు…..సొంత తల్లిని, చెల్లిని కూడా డబ్బు కోసం హింసించే మన అన్నయ్య లాంటి పరమ నీచులు యేమీ మాట్లాడినా ఇబ్బంది లేదు అంటావు…..బావుంది GA…😂😂

    1. Thalli తండ్రి ni గాలికి వదిలేసి.. తమ్మడ్ని పిచోడ్ని చేసి తాళ్లతో బంధించడం కన్నా తక్కువే లే.. అత్యాశ గల చెల్లికి గుణపాఠం…

  7. బాగుంది. నా లాగే(?) అన్ని మీకు తెలుసు అని ఒప్పుకొన్నాను కాని, శ్రేష్ఠ అనే పదం అర్థం మార్చి కొత్తిమీర గాళ్ళకి ఆపాదించకు. ఇక ఒక “మామూలు” మనిషిగా చిరుని చూస్తే అది ప్రతి ఇంట్లో జరిగే సంభాషణ. చిరు ఒక డబ్బు సంపాదించిన “మామూలు” మనిషి, కోరికలు అలాగే ఉంటాయి.విశేషాలు ఆపాదించద్దు

  8. సరే అన్న ని మాత్రం చిరు ని చూసి నేర్చుకోమని చెప్పు తన చెల్లళ్లకి తన సంపాదన lo భాగం ఇచ్చాడు అన్న అక్రమంగా దొబ్బేసినా దానిలో నుండి కూడా ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం లేదు…

  9. మంచి ఆర్టికల్. చమత్కారంగా మాట్లాడుతున్నాను అనుకుంటూ అనవసరమైన విషయాలు మాట్లాడడం జరుగుతోంది. ప్రతి అడ్డమైన వెధవా కామెంట్ చేయడానికి ఆస్కారం ఇవ్వడం అవుతోంది. చిరంజీవి లాంటి స్టేచర్ ఉన్న మనిషికి అది చాలా అనవసరం. 

  10. వాళ్ళు వీళ్ళు అంటున్నావు కానీ ముందు నువ్వే ఉంటావవ్ ఆవగింజంత అయినా సందు దొరికిద్దని ఎర్రి పువ్వులు

  11. శ్రేష్టులు చేసే పనులు సామాన్య జనులు అనుకరిస్తారు.. ఇది మీ ఫస్ట్ స్టేట్మెంట్ ..

    శ్రేష్టులు ఎవరంటే రాజకీయ, సినీ, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందినవారు.. ఇది మీ సెకండ్ స్టేట్మెంట్ …

    ఇదే నిజమైతే ఆంధ్రాలో 40% మంది ఓటర్లు ఇప్పటికే అవినీతి పరులు, నేరస్తులు అయిపోయి ఉండాలి, బంధువులను రక్త సంబంధీకులను రోడ్డున పడేయాలి.. అంతేనా సారూ

  12. ఆడ వాళ్ళు ఎప్పటికీ వారసత్వాన్ని పుణికిపుచ్చు కోలేరు ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటి పేరు మారుతుంది కాబట్టి

  13. ఆ సంగతి jaggu గాడికి చెప్పు వాడిని చూసి అన్యాయం గా అయిన సరే mny సంపద పెంచుకోవాలి అనుకుంటున్నారు జనాలు.

Comments are closed.