Advertisement

Advertisement


Home > Movies - Movie News

వావ్‌...అనురాగ్‌కు ఊహించ‌ని మ‌హిళ‌ నుంచి మ‌ద్ద‌తు

వావ్‌...అనురాగ్‌కు ఊహించ‌ని మ‌హిళ‌ నుంచి మ‌ద్ద‌తు

లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ద‌ర్శ‌క - నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్‌న‌కు ఎవ‌రూ ఊహించ‌ని వ్య‌క్తి నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఆ మ‌ద్ద‌తు ఆయ‌న మాజీ భార్య , న‌టి క‌ల్కి కోచ్లిన్ నుంచి రావ‌డం బాలీవుడ్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

అనురాగ్ క‌శ్య‌ప్ మాజీ భార్య , న‌టి క‌ల్కి కోచ్లిన్ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టు కంటే ముందు ... అస‌లు ఈ వివాదం ఎలా మొదలైందో తెలుసుకుందాం.  ఇందుకోసం రెండురోజుల వెన‌క్కి వెళ్దాం. అనురాగ్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్‌ శనివారం ఆరోపించారు. ఆమె ఆరోప‌ణ‌లు దేశ వ్యాప్తంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం రేకెత్తించాయి.

పాయ‌ల్ ఆరోప‌ణ‌ల‌పై  బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ మ‌రింత దూకుడుగా స్పందించ‌డంతో వివాదం మ‌రింత ముదిరింది.  వెంటనే అనురాగ్‌ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.  బాలీవువడ్‌లో‌ ఇలాంటివి సర్వసాధార‌ణ‌మ‌ని, ఇకనైన ఇలాంటి ఘటనపై స్పందించాలని కంగ‌నా డిమాండ్ చేశారు.  ఈ నేప‌థ్యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అనురాగ్‌కు స‌పోర్ట్‌గా  మాజీ భార్య సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసిన పోస్టు గురించి తెలుసుకుందాం.

‘ప్రియమైన అనురాగ్‌ సోషల్‌ మీడియాల్లో వస్తున్న పుకార్లను మీరు పట్టించుకోకండి. మీ స్కిప్ట్‌లో మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. దానికి నేనే సాక్ష్యం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చూశారు. మన విడాకుల తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను నా వర్క్‌ ప్లేస్‌లో అసౌకర్యం, అసురక్షితకు లోనైనప్పుడు మీరు నాకు మద్దతుగా నిలిచారు’ అంటూ కల్కి రాసుకొచ్చారు.

సుదీర్ఘ‌మైన ఆ పోస్టులో ఇంకా ఆమె ఏమ‌న్నారంటే....‘ఈ సమయం చాలా ప్రమాదకరమైనది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ విమర్శించడంతో పాటు తప్పుడు వాదనలు చేస్తారు. ఇది స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది.

అలాగే అవసరమైన సమయంలో ప్రేమ పంచే మనుషులే కాకుండా.. చుట్టూ ఎవరూ లేనప్పుడు దయ చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. అయితే అలాంటి గౌరవానికే మీరు కట్టుబడి ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’  అంటూ ఆమె గ‌ట్టి మ‌ద్ద‌తు తెలిపారు. త‌న మాజీ భార్య నుంచి ఇలాంటి మ‌ద్ద‌తు ద‌క్కుతుంద‌ని అనురాగ్ అస‌లు ఊహించి ఉండ‌రు. అలాంటిది క‌ల్కి కోచ్లిన్ నుంచి త‌న‌కు స‌పోర్ట్ రావ‌డం, అనురాగ్‌కు వెయ్యి ఏనుగుల బ‌లం ల‌భించిన‌ట్టైంది. 

ఏపీ పోలీస్ సేవ యాప్ ప్రారంభ కార్యక్రమం

చంద్రబాబు వైఎస్ఆర్ ఇంటికొచ్చి డబ్బు ఆడిగేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?