Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

సంక్రాంతికి పెద్ద సినిమాలున్నాయనే భయంతో ఒక వారాన్ని టాలీవుడ్‌ వృధా చేసింది. సంక్రాంతి తర్వాతి వారంలో చెప్పుకోతగ్గ సినిమా ఏదీ విడుదల చేయకుండా వదిలేసింది. తీరా సంక్రాంతి టైమ్‌లోనే నీరుగారిపోయిన సినిమాలు మరో వారం స్పేస్‌ దొరికినా క్యాష్‌ చేసుకోలేకపోయాయి.

వారం తిరగకుండానే అజ్ఞాతవాసి అడ్రస్‌ గల్లంతు కాగా, జైసింహా చిత్రానికి రెండవ వారంలో వసూళ్లు రాబట్టేంత సత్తా లేకపోయింది. పండక్కి మరో చెప్పుకోతగ్గ సినిమా లేకపోవడంతో బయ్యర్ల పెట్టుబడిని మాత్రం తిరిగి తేగలిగిన ఈ చిత్రం అప్పటికీ కొన్ని ఏరియాల్లో నష్టపోయింది.

గ్యాంగ్‌ చిత్రం సూర్య నటించిన ఇటీవలి చిత్రాలకంటే ఒక మోస్తరుగా పర్‌ఫార్మ్‌ చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం పర్‌ఫార్మెన్స్‌ని యావరేజ్‌గా పేర్కొనవచ్చు. మళ్లీ ఈ వారంలో భాగమతి చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద కళ కనిపిస్తుందని ఆశిస్తున్నారు.

అనుష్క నటించిన ఈ హారర్‌ చిత్రానికి ఆరంభ వసూళ్లయితే బాగున్నాయని ఎర్లీ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. మరి ఇదైనా ఈ ఏడాదికి ఫస్ట్‌ విన్నర్‌ కాగలదో లేదో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?