బాబు న‌మ్ముకున్న అస్త్రం… వ్య‌వ‌స్థల విధ్వంసం!

రాజ‌కీయంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ‌ద్నాం చేయ‌డానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు న‌మ్ముకున్న అస్త్రం వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం. ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన‌ప్ప‌టికీ, చంద్ర‌బాబునాయుడిని ఇంకా ఏదో భ‌యం వెంటాడుతున్న‌ట్టోంది. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణమే…

రాజ‌కీయంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ‌ద్నాం చేయ‌డానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు న‌మ్ముకున్న అస్త్రం వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం. ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన‌ప్ప‌టికీ, చంద్ర‌బాబునాయుడిని ఇంకా ఏదో భ‌యం వెంటాడుతున్న‌ట్టోంది. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణమే అనేలా జ‌గ‌న్ విష‌యంలో వుండ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు భావ‌న‌.

ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పాల‌న‌లో మొత్తం వ్య‌వ‌స్థ‌ల‌న్నీ విధ్వంసం అయ్యాయ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు. అప్పుడు ఎన్నిక‌లు క‌దా అని అంతా అనుకున్నారు. అయితే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా వైసీపీ విధ్వంసం గురించే చంద్ర‌బాబు ప‌దేప‌దే మాట్లాడుతున్నారు. తామిచ్చిన హామీల అమ‌లు గురించి అస‌లు మాట్లాడ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఒక‌ట్రెండు హామీల‌ను అమ‌లు చేసి, మిగిలిన వాటి ఊసే ఎత్త‌క పోవ‌డం వెనుక చంద్ర‌బాబు వ్యూహాన్ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

మ‌ళ్లీ జ‌గ‌న్ అనే నాయ‌కుడిని ఆద‌రించాలంటే ప్ర‌తి ఒక్క‌రూ భ‌య‌ప‌డేలా చేయ‌డం బాబు ఎత్తుగ‌డ‌. జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏదీ మిగ‌ల్చ‌రు అనే భ‌యాన్ని పుట్టించ‌డ‌మే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. త‌మ హామీల అమ‌లు కంటే, జ‌గ‌న్ భ‌యాన్ని స‌జీవంగా ఉంచడ‌మే కూట‌మి స‌ర్కార్ ప్ర‌ధాన ఎజెండాగా క‌నిపిస్తోంది. అందుకే క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌మావేశంలోనూ గ‌త ఐదేళ్ల పాల‌న గురించే చంద్ర‌బాబు ఎక్కువ‌గా మాట్లాడార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కూట‌మి ఇచ్చిన హామీల‌ను పూర్తిగా మ‌రిపించ‌డం, అలాగే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న భ‌యంక‌ర‌మైంద‌ని గుర్తు చేయ‌డం చంద్ర‌బాబు ప్ర‌ధాన ఆశ‌యంగా ఆయ‌న మాట‌ల తీరే చెబుతోంది. జ‌గ‌న్ పేరు వింటే చివ‌రికి సొంత పార్టీ వాళ్లు కూడా భ‌య‌ప‌డేలా విస్తృతంగా దుష్ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కు మించి మ‌రో ఎజెండానే క‌నిపించ‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదో జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే… రాజ‌ధాని వుండ‌ద‌ని, ప‌ట్టాదారుపుస్త‌కాల‌పై ఆయ‌న ఫొటో వుంటుంద‌ని, భూముల‌న్నీ లాక్కునేందుకు ట్యాండ్ టైటిలింగ్ చ‌ట్టాన్ని తీసుకొస్తార‌ని, ఉద్యోగుల‌కు వేధింపులు, అలాగే సంక్షేమం త‌ప్ప అభివృద్ధి వుండ‌ద‌ని, అక్ర‌మ కేసులుంటాయ‌ని ఇలా అనేక విష‌యాలు తెర‌పైకి తెచ్చి ఇప్ప‌టి నుంచే భ‌య‌పెట్ట‌డం కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్యం.

ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల అమ‌లు ఏమంత పెద్ద విష‌యం కాద‌న్న‌ట్టుగా మ‌రుగున ప‌డేయాల‌ని ప్ర‌భుత్వం చూస్తోంది. ఎటూ ప్ర‌భుత్వ అనుకూల మీడియా బ‌లంగా వుంది. దీంతో హామీల‌ను అమ‌లు చేసినా, చేయ‌క‌పోయినా అడిగే దిక్కు వుండ‌ద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. అయితే సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన క్ర‌మంలో గ‌తంలో మాదిరిగా టీడీపీ ప‌న్నాగాలు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయ‌నేది ప్ర‌శ్న‌.

2024లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌తే కూట‌మికి అధికారాన్ని తెచ్చి పెట్టింది. భ‌విష్య‌త్‌లో చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త రాకూడ‌ద‌నే నియ‌మేమీ లేదు. అధికారంలో ఉన్న వాళ్లు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై చేసే దుష్ప్ర‌చారం కంటే, పాల‌నారీతుల్నే జ‌నం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తుంటారు. అధికారాన్ని నిల‌బెట్టేది, ప‌డ‌గొట్టేది ప‌రిపాల‌నే. రాజ‌కీయ పార్టీల ఎజెండాలతో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌ల‌కు చేసే మంచిప‌నులపై మాత్ర‌మే ఆద‌ర‌ణ‌, నిరాద‌ర‌ణ ఆధార‌ప‌డి వుంటాయి. బాబు ఏం చేస్తారో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంటుంది.

23 Replies to “బాబు న‌మ్ముకున్న అస్త్రం… వ్య‌వ‌స్థల విధ్వంసం!”

  1. నిజమె కదా! 2019 లొ 151 సేట్లు ఇస్తె జగన్ చెసిన విద్వంసం అంతా ఇంత కాదు.

    .

    ఇక వ్యవస్థల గురించి ఎంత తక్కువ మట్లడుకుంటె అంత మంచిది. మండలి రద్దు అని, రాజధాని మార్పు అని, పొలవరం రైవెర్సె టెండరింగ్ అని, SEC పధవీ కాలం ముగియకుండానె రద్దు అని, హై కొర్ట్ న్యయమూర్తులకి నీ వదలకుందా ఎంత చండాలాం చెసారు.

    .

    జగన్ కి వ్యతిరెకంగా ఫసె బూక్ లొ పోస్త్ పెట్టిన్నా CID చేత కె.-సు.-లు పెట్టించి వేదించారు. ఇక TDP నాయకుల మీద కె.-సులకి హద్దె లెదు! అసలు 5 ఎళ్ళలొ చట్టబద్ద పాలన అన్నది ఎక్కడన్నా ఉందా? అంతా రాజా రెడ్డి రాజ్యంగమె కదా?

    1. నిజమె! జగన్ తు.-గ్ల.-క్, నియంత పాలనని ఒక సారి గుర్తు చెస్తె చాలు, జన్మలొ మళ్ళి ఎవరూ జగన్ కి వొటు వేయరు.

  2. వీడు బొంద బాబు ఒంటరిగా గేలేవలేదు పొత్తు లేకుంటే MLA కాలేదు ఒక్క హామీ కూడా చెయ్యలేదు 2029 టీడీపీ ఇంకా గోరమైన ఫలితాలు వస్తాయి నిర్మల సీతారామన్ చెప్పింది జగన్ పాలన ఇండియా lo ఏ సీఎం చెయ్యని విధంగా చేసాడు అని మొత్తం 1.7 లక్షలు అప్పు చేసాడు ఇప్పటికి బాబు 50 వేల కోట్లు అప్పు చేసాడు అని

    1. మన జగన్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు 175 కి 175 గెలిచేస్తాం.. వై నాట్.. అన్నాడు.. జరిగిందా..?

      నిర్మలా సీతారామన్ వచ్చి నీ చెవిలో చెప్పిందా..

      మీ బతుకులకు ఇంచార్జీలే లేరు..

      ఈవీఎంలు వద్దు.. బ్యాలట్ ముద్దు అనుకుంటూ పార్టీ ని సంక నాకించేసుకొన్నారు..

    1. అందుకే 11 సీట్లు ఇచ్చారు.. బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..

      ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసారు..

      సెక్యూరిటీ ఇవ్వండి మహాప్రభో అని అడుక్కొంటున్నాడు..

      ఇంటికి ముప్పై అడుగుల గోడ కట్టుకుని బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాడు..

  3. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది 2019 జూన్;

    హామీలు అమలు చేయడం మొదలుపెట్టింది

    అమ్మఒడి – 2020 జనవరి

    రైతు భరోసా – 2019 అక్టోబర్

    వసతి దీవెన – 2020 ఫిబ్రవరి

    విద్యా దీవెన – 2020 ఏప్రిల్

    సున్నా వడ్డీ – 2020 ఏప్రిల్

    మత్స్యకార భరోసా – 2019 నవంబర్

    నేతన్న నేస్తం – 2019 డిసెంబర్

    కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లో వెయ్యి పెన్షన్ పెంచితే అదే వెయ్యి పెంచడానికి జగన్ రెడ్డి అసమర్థ పాలనలో ఐదేళ్ళు పట్టింది.

    దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశాం.

    16 వేల ఉద్యోగాలు ఇచ్చే మెగా డీఎస్సీ ఇచ్చాం,

    దుర్మార్గపు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం,

    ఉచిత ఇసుక ఇస్తున్నాం,

    అన్న క్యాంటీన్లు రెడీ అవుతున్నాయి,

    గంజాయి బ్యాచ్ ని వెంటాడుతున్నాం,

    పోలవరంలో చేసిన దారుణాలు సరిచేస్తున్నాం,

    రాజధాని లేని రాష్ట్రంగా చేసిన మీ నిర్వాకాన్ని కరెక్ట్ చేస్తున్నాం!

    రెండు నెలల్లో ఇన్ని చేసిన మాకు, మేము చెప్పి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేమా?

  4. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది 2019 జూన్..

    హామీలు అమలు చేయడం మొదలుపెట్టింది

    అమ్మఒడి – 2020 జనవరి

    రైతు భరోసా – 2019 అక్టోబర్

    వసతి దీవెన – 2020 ఫిబ్రవరి

    విద్యా దీవెన – 2020 ఏప్రిల్

    సున్నా వడ్డీ – 2020 ఏప్రిల్

    మత్స్యకార భరోసా – 2019 నవంబర్

    నేతన్న నేస్తం – 2019 డిసెంబర్

    కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లో వెయ్యి పెన్షన్ పెంచితే అదే వెయ్యి పెంచడానికి జగన్ రెడ్డి అసమర్థ పాలనలో ఐదేళ్ళు పట్టింది.

    దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశాం.

    16 వేల ఉద్యోగాలు ఇచ్చే మెగా డీఎస్సీ ఇచ్చాం,

    దుర్మార్గపు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం,

    ఉచిత ఇసుక ఇస్తున్నాం,

    అన్న క్యాంటీన్లు రెడీ అవుతున్నాయి,

    గంజాయి బ్యాచ్ ని వెంటాడుతున్నాం,

    పోలవరంలో చేసిన దారుణాలు సరిచేస్తున్నాం,

    రాజధాని లే ని రాష్ట్రంగా చేసిన మీ నిర్వాకాన్ని కరెక్ట్ చేస్తున్నాం!

    రెండు నెలల్లో ఇన్ని చేసిన మాకు, మేము చెప్పి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేమా?

  5. Gutami failed miserably in all aspects – welfare, governance and development. But, they broke the previous records in demolitions and.atracks. In this What ycp did in 5 years is achieved in two months in gutami rule. They will know only when the ballot boxes are open next time.

  6. CBN garu is called visionary for a reason, ఆయన చేస్తుంది వ్యవస్థల ప్రక్షాళన, అది మీలాంటి అవినీతిపరులకు ఇబ్బంది గానే ఉంటుంది !!

Comments are closed.