Advertisement

Advertisement


Home > Politics - Analysis

జగన్ రైట్ కాదా చంద్రబాబూ?

జగన్ రైట్ కాదా చంద్రబాబూ?

జగన్ మద్యపాన నిషేధం చేయలేదు.. పదేపదే చంద్రబాబు అండ్ కో విమర్శ.

రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యం అందిస్తాం... చంద్రబాబు ఎన్నికల మాట.

వాలంటీర్ల వ్యవస్థ అరాచకం. రాజకీయాలు చేస్తున్నారు... చంద్రబాబు అండ్ కో ఆరోపణ.

వాలంటీర్ల జీతం అయిదు నుంచి పది వేలకు పెంచుతాం... చంద్రబాబు ఎన్నికల వాగ్గానం.

జగన్ అమ్మ ఒడి ఇచ్చినట్లే ఇచ్చి, ఏదో విధంగా వెనక్కు తీసుకుంటున్నారు.. చంద్రబాబు విశ్లేషణ

అమ్మఒడి ఇద్దరకు ఇస్తాం.. ఒక్కరికి కాదు.. ఎన్నికల టైమ్ లో చంద్రబాబు తాయిలం.

పింఛన్లు ఇంటికే అందిస్తాం..నాలుగు వేలు చేస్తాం… చంద్రబాబు

జగన్ ప్రవేశ పెట్టినది అదే కదా.. ఇంటికి వెళ్లి అందించడం అనేది జగన్ సాధించిన ఘనతే కదా

మరి జగన్ ఏమిటి అధోగతి పాలు చేసారు రాష్ట్రాన్ని. ఏమన్నా అంటే ఉద్యోగాలు, ఐటి అంటూ చిట్టా తీస్తారు. ఈ మధ్య లోకేష్ ఏమంటున్నారు. ఐటి కాదు, ఇతరత్రా రంగాలు వృద్దికి చాన్స్ వుంది. వాటితో పాటు ఐటి కూడా అంటున్నారు. ఎందుకని, ఇప్పుడు ఐటి రంగం వెనుక బడి వుంది కనుక. రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చి ఐటి కంపెనీలు తేలేకపోతే జనం నిలదీసే ప్రమాదం వుంది కనుక, ముందే ఉత్పాదక రంగం, నౌకా రేవుల రంగం అంటూ కబుర్లు చెబుతున్నారు. మరి జగన్ చేస్తున్నది అదే కదా, పోర్టులు అన్నీ వరుస పెట్టి నిర్మించుకుంటూ వెళ్తున్నారు కదా?

అప్పుల సంగతేమిటి?

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు జగన్ అని పదే పదే చెబుతున్నారు చంద్రబాబు అండ్ కో. మరి ఎన్నికల సందర్భంగా ఈ మేరకు హామీ ఇవ్వగలరా? ఎన్నికల హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు వున్న అప్పులను పెంచకుండా వుంటామని, లేదా ఇంతకు మించి అప్పులు చేయమని చంద్రబాబు వాగ్దానం చేయగలరా? ఆ ఒక్క మాట మాత్రం చెప్పరు. చంద్రబాబు ఒక వేళ అధికారంలోకి వచ్చి ఎన్ని అప్పులు చేసినా, దాన్ని కప్పిపెట్టేందుకు ఎలంలో మీడియా, సామాజిక కుల పిచ్చ హ్యాండిల్స్ వుండనే వుంటాయి కదా. అదీ ధీమా?

స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్ మీద పదే పదే జగన్ ను కార్నర్ చేస్తుంటారు చంద్రబాబు అండ్ కో. మరి తాము అధికారంలోకి వస్తే వాటిని సాధిస్తామని ఎందుకు హామీ ఇవ్వడం లేదు? ఆ మాట మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు? ఆ మాట మాట్లాడితే భాజపాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయమా?

జనం గ్రహించాల్సి వుంటుంది చంద్రబాబు అండ్ పవన్ కేవలం అధికారం కోసం ఆడుతున్న ఈ నాటకాన్ని. నిజాలు కప్పి పుచ్చి, అబద్దాలు ప్రచారం చేస్తూ, మళ్లీ అదే జగన్ బాటలోకి వెళ్లిపోతూ, జనాల్ని వెర్రివాళ్లను చేస్తున్న వైనం అదే జనం గ్రహించాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?