లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ప‌వ‌న్ ప‌రిస్థితి?

లోకేష్ ఎలాగూ స‌మ‌ర్థుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ అనే మాట వినిపిస్తూ ఉంది.

జ‌గ‌న్ సీఎం గా ఉన్న‌ప్పుడు ఐదు మంది డిప్యూటీ సీఎంలు, అంత‌కు ముందు 2014 నుంచి 2019 మ‌ధ్య‌న చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలుండేవారు. అయితే 2024లో తెలుగుదేశం- జ‌న‌సేన‌- బీజేపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాకా మాత్రం.. డిప్యూటీ సీఎం ప‌ద‌విలో ఒక‌రే ఉండాల‌ని, అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ ప‌ద‌విని తీసుకుంటార‌నే ప్ర‌చారం జ‌రిగింది. మంత్రివ‌ర్గం ఏర్పాటుకు ముందే ఈ ప్ర‌చారం ముమ్మ‌రంగా జ‌రిగి, ఆ మేర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్యూటీ సీఎం హోదా పొంద‌డం తెలిసిన సంగ‌తే!

మ‌రి ఏడాదైనా గ‌డ‌వ‌క‌మునుపే ఏపీ మంత్రివ‌ర్గంలో మార్పుల అంశం చ‌ర్చ‌గా మారింది. రేపోమాపో పెద్ద ఎత్తున మార్పులు అనే టాక్ వ‌స్తూ ఉంది. ఇందులో భాగంగా జ‌రిగే ప‌లుమార్పుల్లో ఒక‌టి నారా లోకేష్ కు ప్ర‌మోష‌న్ అనే మాట కూడా వినిపిస్తూ ఉంది.

అతి త‌క్కువ కాలంలో అస‌మ‌ర్థులుగా తేలిన ప‌లువురు మంత్రుల‌కు ఉద్వాస‌న లేదా డిమోష‌న్ అని, లోకేష్ ఎలాగూ స‌మ‌ర్థుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు ప్ర‌మోష‌న్ అనే మాట వినిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ద‌క్క‌వ‌చ్చు అనే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతూ ఉంది.

మ‌రి అదే జ‌రిగితే.. డిప్యూటీ సీఎం హోదాలో త‌ను ఉండాలంటే, ఆ హోదా త‌న‌కొక్క‌డికే ఉండాల‌నే ఆ ప‌ద‌వి తీసుకునే ముందు ప‌వ‌న్ పెట్టిన ష‌ర‌తు ప‌రిస్థితి ఏమిట‌నేది ఆఫ్ ద రికార్డుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌! కూట‌మి ప్ర‌భుత్వం మంత్రివ‌ర్గం ఏర్పాటు చేసుకున్న‌ప్పుడు ప‌వ‌న్ కు త‌ప్ప మ‌రెవరికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. గ‌తంలో కాపు కోటాలో ఒక‌రికి, బీసీ కోటాలో మ‌రొక‌రికి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల‌ను ఇచ్చిన చ‌రిత్ర చంద్ర‌బాబుదే. అయితే ప‌వ‌న్ కోసం అని ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో బీసీలు ఎవ్వ‌రికీ ఆ హోదాను ఇవ్వ‌లేదు.

త‌మ‌ది బీసీల పార్టీగా చెప్పుకుంటూ ఉంటారు చంద్ర‌బాబు. అందుకే బీసీల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అని ఇచ్చిందీ ఆయ‌నే, ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం బీసీల‌కు ఆ పాటి ప్రాధాన్య‌త‌ను కూడా ఇవ్వ‌లేదు. మ‌రి ఇప్పుడు త‌న‌యుడు లోకేష్ ను చంద్ర‌బాబు డిప్యూటీ సీఎం హోదాలోకి ప్ర‌మోట్ చేస్తే.. వ్య‌వ‌హారం ర‌స‌కందాయ‌కంలో ప‌డిన‌ట్టే.

ఒక్క‌రే డిప్యూటీ సీఎం గా ఉంటేనే ప‌వ‌న్ ను డీసీఎం అంటూ ఫ్యాన్స్ కూడా పిలుచుకుంటున్నారు. మ‌రి రేపు లోకేష్ గ‌నుక డిప్యూటీ సీఎం అయితే.. అప్పుడు ఇద్ద‌ర‌వుతారు! డిప్యూటీ సీఎం హోదా అప్పుడు ఒక‌రిదే కాదేమో!

35 Replies to “లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ప‌వ‌న్ ప‌రిస్థితి?”

  1. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి… వర్క్

  2. చాలా కష్టపడుతున్నావు.. కానీ వాళ్ళు నీకు ఇంచు అవకాశం కూడా ఇవ్వడం లేదు..

    కాబట్టి.. నీకొక సలహా..

    వాళ్ళు విడిపోయాక వచ్చి కష్టపడు .. అప్పుడు నీ సొల్లు వినే జనాలు ఉంటారు..

    అప్పటిదాకా నీ బాధ అరణ్య రోదనే..

  3. ….DCM lu yentha mandi vunna yevari pani valladi….chese pani important GA….ippudu Opposition leader status kuda pawan kalyan thesukunte 5 yrs mana anniyya paristhithi yenti GA 😂😂😂…mari party ni congress lo kalipeyyadaniki ready naa…

  4. నిన్నే కదా GA పవన్ గారికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని రాసావు ఇప్పుడేమో పొగ పెట్టేలా వున్నట్టు రాస్తున్నావు.. ఎంటో నీ భాధ

  5. First step : Snake Babu will be made minister

    2nd step : Pawan will be sent to Center as Cabinet Minister as Rajya Sabha MP

    3rd step : Lokesh Babu will be made as Dy CM along with 2 other dummy Dy CMs (one from OBC and another from SC/ST)

    4th step : Lokesam will be made CM after next elections. Snake Babu will be dumped or given unimportant portfolio and Nadendla will be made as Home

    5th step : Pawan will be forced to accept dy. CM post under Lokesam after his Rajya Sabha term expiry.

  6. పవన్ పరిస్థితి ఏమిటో తెలియదు కానీ జగన్ 2029 లో సీఎం కావడం గారంటీ

  7. From what it looks on the face of it MODI wants Pawan in the Center. But CBN also wants Pawan in AP for the reason that he wants an able support/foil to take up important decisions. Otherwise, CBN knows that there will be danger of people looking at the Govt as one community oriented to open the doors for chillara and dying YCP to encourage fissiparous propaganda for deleterious affect on the state development.

  8. From what it looks on the face of it MODI wants Pawan in the Center. But CBN also wants Pawan in AP for the reason that he wants an able support/foil to take up important decisions. Otherwise, CBN knows that there will be danger of people looking at the Govt as one community oriented to open the doors for chillara and d0ying YCP to encourage fissiparous propaganda for deleterious affect on the state development.

  9. From what it looks on the face of it MODI wants Pawan in the Center. But CBN also wants Pawan in AP for the reason that he wants an able support/foil to take up important decisions. Otherwise, CBN knows that there will be danger of people looking at the Govt as one community oriented to open the doors for dying Y0CP to encourage fissiparous propaganda for deleterious affect on the state development.

  10. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. ఫర్ వీసీ

  11. వైసీపీ కాడర్ అందరూ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే జగన్ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న ఎంత సిల్లీగా ఉందో నువ్వు రాసిన ఆర్టికిల్ కూడా అంతా సిల్లీగా ఉంది.

Comments are closed.