జ‌నాల‌కు ప‌ట్ట‌ని సినిమాలు ఆస్కార్ జాబితాలోనా!

త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్న ఆస్కార్ అవార్డుల‌కు సంబంధించి ప్ర‌స్తుతం 207 సినిమాలు పోటీలో ఉండ‌గా.. ఇందులో ఏడు ఇండియా సినిమాలున్నాయ‌ట‌!

త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్న ఆస్కార్ అవార్డుల‌కు సంబంధించి ప్ర‌స్తుతం 207 సినిమాలు పోటీలో ఉండ‌గా.. ఇందులో ఏడు ఇండియా సినిమాలున్నాయ‌ట‌! అయితే ఆ జాబితాలో కంగువా వంటి సినిమా ఉండ‌టం, జ‌నాల‌కు అస‌లే మాత్రం ఎక్క‌ని ఈ సినిమా ఆస్కార్ బ‌రిలో ఏమిటి అనే ఆశ్చ‌ర్యానికి కార‌ణం అవుతూ ఉంది.

దీంతో పాటు ఎప్పుడొచ్చాయో తెలియ‌ని మ‌రి కొన్ని సినిమాలు కూడా ఈ 207 జాబితాలో ఉన్నాయి. ఈ జాబితా కోసం భార‌త‌దేశం అధికారికంగా ప్ర‌క‌టించిన లాప‌టా లేడీస్ ఎప్పుడో తిరుగుట‌పాలో వెన‌క్కి వ‌చ్చింది. భార‌త‌దేశం అధికారికంగా పంపిన ఎంట్రీ అది. మిగ‌తావ‌న్నీ ప్రైవేట్ ఎంట్రీల‌నుకోవాలి. వాటిల్లో ఏడు సినిమాలు రేసులో ఉన్నాయ‌ట‌!

తెలుగు వారికి వీటిలో తెలిసిన సినిమాలు ఆడు జీవితం, వీర్ స‌వార్కర్ పై హిందీలో వ‌చ్చిన సినిమా. ఆడు జీవితం మ‌ల‌యాళీలకు సంబంధించిన క‌థ‌, తెలుగు వాళ్లు కూడా కొంత వ‌ర‌కూ ఈ సినిమాను ప్ర‌శంసించారు. వీర్ స‌వార్క‌ర్ సినిమాను ఎందుకో అనుకున్నంత స్థాయిలో సంఘీలు కూడా ప్ర‌మోట్ చేయ‌లేక‌పోయారు. అయితే ఆస్కార్ రేసుకు అయితే పంపించిన‌ట్టుగా ఉన్నారు.

207 సినిమాల జాబితాలో ఈ ఏడూ ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తూ ఉన్నా, నెక్ట్స్ వ‌డ‌పోత క‌ళ్లా ఈ సినిమాలు ఏమ‌వుతాయ‌నేది వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆడుజీవితం కూడా కేర‌ళీయుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది కానీ, గ‌ల్ఫ్ వ‌ల‌స కార్మికులు ఉన్న తెలుగు రాష్ట్రాల‌కు కూడా పూర్తి స్థాయిలో క‌నెక్ట్ కాలేదు. గ‌ల్ఫ్ వ‌ల‌స క‌ష్టాల గురించి తెలుగులో కూడా ఒక ద‌శ‌లో బోలెడున్న క‌థ‌లు ప్ర‌చురితం అయ్యాయి. 2000 నుంచి 2010 వ‌ర‌కూ గ‌ల్ఫ్ వ‌ల‌స క‌ష్టాలు నిత్యం ప‌త్రిక‌ల్లో ప్ర‌చురితం అయ్యేవి. ఆ త‌ర్వాత వాటి తీవ్ర‌త త‌గ్గిపోయింది. ఆడుజీవితం కూడా ఆ కాలం నాటి క‌థే. న‌టుడిగా పృథ్విరాజ్ క‌ష్టం బాగానే నోటీస్ అయ్యింది. మ‌రి ఆస్కార్ బ‌రిలో ఈ సినిమా ఎంత వ‌ర‌కూ పోరాడుతుందో చూడాలి!

5 Replies to “జ‌నాల‌కు ప‌ట్ట‌ని సినిమాలు ఆస్కార్ జాబితాలోనా!”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి పని

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.