ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలాగోలా విశాఖ ఎంపీ సీట్ కొట్టేసిన గీతం భరత్ ఇప్పుడు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది అటు టీడీపీ పార్టీలోనూ ఇటు కూటమి పెద్దగా భావిస్తున్న బిజెపి నుంచి రకరకాల ప్రతికూల పరిస్థితులు తప్పడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా భరత్ కు కంట్లో నలుసులా మారుతున్నారు. నిధుల సేకరణ , అలాగే బడ్జెట్ కేటాయింపు విషయంలో అన్నీ భరత్ నే చూడాలంటూ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు భరత్ పై తీవ్రమైన భారం వేస్తున్నారంటూ ఆయన అనుచరుల నుంచి వస్తున్న సమాచారం . ప్రతి పనికి అయ్యే ఖర్చు అంత భరత్ చూస్తాడంటూ ఫిక్స్ అవడంతో ఉక్కిరిబిక్కురవుతున్నాడట భరత్.
ఈసారి ఎలాగైనా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావించింది ఒకవైపు బాలకృష్ణ మరోవైపు సామాజిక వర్గం ఒత్తులతో గీతం భారతను విశాఖ ఎంపీ టికెట్ ను కేటాయించింది తెలుగుదేశం అసలే బాలకృష్ణ చిన్నల్లుడు కావడంతో చంద్రబాబు కాదనలేకపోయారు ఇదే విశాఖ ఎంపీ సీట్లు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు సాధించాలని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఏపీ బీజేపీ జివిఎల్ కు మోకాలిట్టింది దీంతో ఆయన పూర్తిస్థాయిలో మనస్థాపం చెంది మౌనంగా ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జీవీఎల్ వర్గం చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని పురందేశ్వరి రాజకీయాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తుంది మౌనంగా ఉంటూ పరోక్షంగా దెబ్బ కొట్టాలని భావిస్తూ వస్తోంది ఇది ఒక రకంగా గీతం వరకు చాలా మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విశాఖ సిటీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటుందని భావించిన భరత్ ఈసారి ఎలాగైనా ఎంపీ సీటు గెలిచే వచ్చునే ధీమాతో ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూసినప్పుడు భరత్ ఆశలు నెరవేరేటట్టుగా లేవు. ఒకవైపు బిజెపి పూర్తిగా సహకరించకపోవడం మరోవైపు ఆర్థిక భారం అంతా భరత్ మాత్రమే భరించాల్సి రావడం, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు ఓడిపోతామన్న భయంతోనో ఏమో గాని పైసా కూడా తీయకుండా కాలక్షేపం చేస్తుండడం ఏ ఖర్చైనా భరత్ వైపే వేళ్ళు చూపిస్తుండడం లాంటి చర్యలు ఈసారి విశాఖ నగరంలో టిడిపికి చావు దెబ్బ తప్పదేమో అన్న సంకేతాన్ని ఇస్తున్నాయి.
స్థానికత అంశం కూడా భరత్ను చుట్టుముడుతోంది తెలుగుదేశం పార్టీలోనే ఉన్న విశాఖకు చెందిన చాలామంది నేతలు భరత్ తీరును తప్పుపడుతున్నారు స్థానికంగా ఉండే అభ్యర్థి అయితే బెటర్ అన్న కోణంలో చాలామంది ప్రజానీకం ఆలోచన చేస్తున్నారు.
యువకుడు విద్యార్థికుడు ఆయన భరత్ కు చాలా సమస్యలు వెంటాడుతున్నాయి ముఖ్యంగా గీతం భూముల కుంభకోణం అలాగే తన తాత ఎంవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా పనిచేసిన సమయంలో పేద ప్రజలకు ఏమీ చేయలేదన్న అభిప్రాయాలు, గీతం యూనివర్సిటీలో సామాన్యులు, పేదలకు ఒక్క సీటు కూడా ఇవ్వరు అన్న వాదన ఇలాంటి చాలా అంశాలు పరిశీలించినప్పుడు వీళ్ళు సామాన్యులకు మేలు చేయరు అన్న ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది..
గంటా దెబ్బకు వణుకుతున్న భరత్
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాల్సిందే అంటూ పట్టు మరి ఎంపీ అభ్యర్థి భరత్ టిక్కెట్టు తెచ్చేలా చేశారు కానీ అదే గంట శ్రీనివాసరావు ఇప్పుడు భరత్ కు కంట్లో నలుసులా మారుతున్నారు. భీమునిలో జరిగే ఏ కార్యక్రమానికైనా ఏ చేరికలకైనా ఇంత రేటు అంటూ కట్టేసి ఆ రేటు చెల్లించాల్సిందే అంటూ భరత్ పై ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం మరో వైపు మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులు మాకు ఏడు కావాలి ఎనిమిది కావాలి అంటూ డిమాండ్లు చేస్తుండటంతో ఇదేమి ఖర్మరా బాబు అంటూ భరత్ తల పట్టుకుంటున్నారన్నది తాజా సమాచారం.
చంద్రబాబు వచ్చిన పెరగని జోష్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో గాజువాకలో పాల్గొన్నప్పటికీ నగరంలో పార్టీలో ఏమాత్రం జోష్ పెరగలేదు గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అదే పరిణామాలు ప్రభావం ఉంటుందని తెలుగుదేశం పార్టీ అంచనాల్లో ఉంది కానీ 2019 నాటికి 2024 నాటికి పరిస్థితిలు బాగా మారినట్లుగా అర్థమవుతుంది తాజా రాజకీయ పరిణామాలతో అటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి భరత్ అయోమయంలో పడినట్లుగా కనిపిస్తోంది మంజూరు విషయంలో ప్రజలను మోసం చేసి దరఖాస్తులు తీసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2019లో కేవలం నగర పరిధిలో విజయాలు సాధించారు కానీ అసలు విషయం 2019లో వైసీపీ వచ్చిన తర్వాత ప్రజలకు తెలిసి వచ్చింది.
కేవలం ఓట్ల కోసమే తమను మోసం చేశారంటూ తెలుసుకున్న ప్రజానీకం పశ్చిమ నియోజకవర్గం ఉత్తర నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం భీమిలి గాజువాక ప్రాంతాల్లో అక్కడున్న తెలుగుదేశం నేతలను నిలదీయడం ప్రారంభించారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద మైనస్ గా మారాయి అటు ఉత్తర నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణు కుమార్ రాజు కూడా ఇదే ఇళ్లు పేరుతో భారీగా ప్రభుత్వానికి డబ్బులు కట్టించి మరీ చేతులెత్తేశారు .వైసీపీ వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందజేయడంతో అసలు నిజం ప్రజలకు అర్థమైంది.
ఇప్పుడు ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి పెద్ద మైనస్ గా మారాయి మరోవైపు పలు నియోజవర్గంలో ఉన్న దొంగ ఓట్లు సైతం అధికారులు తొలగించడంతో నగరంలో టిడిపికి బలుపు కాదు ఇది వాపు మాత్రమే అన్నది తేటతెలమైంది. ఈ పరిణామాలని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడం మరోవైపు కూటమిలోని పార్టీలు భరత్ కు సహకరించకపోవడం భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఓ వర్గం పూర్తిగా మౌనం వహించడం వల్ల తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే తగలనుందన్న భావన విశ్లేషకులు నుంచి వినిపిస్తోంది. బిజెపికి అండగా ఉండే ఉత్తర భారత దేశ ఓటర్లు సుమారుగా లక్షన్నర మంది విశాఖలో వీరంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే ఆలోచనలో లేరు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న మార్వాడి నేతలంతా కూడా తీవ్రంగా వైసీపీ కోసం కృషి చేస్తున్నారు.
జాతీయ పార్టీ ఏది కూడా విశాఖ నుంచి పోటీ చేయకపోవడంతో తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ నే బెటర్ అన్న భావన విశాఖలో స్థిరపడిన ఉత్తర భారత దేశ ఓటర్ల లో కనిపిస్తోంది. ముఖ్యంగా మార్వాడీలకు సంబంధించిన సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో వైసిపి సానుకూలంగా ఉండటం ఆయా వర్గాల ఓటర్లు వైసీపీకి పట్టం కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తమ ఓటమి ఖాయమన్న ఆలోచనలో పడిపోయి ఒక్క పైసా కూడా తీయకుండా రాజకీయం చేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మొత్తం మీద ఈ ఎన్నికలు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ భరత్ కు మాత్రం పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇదేమి కర్మ రా బాబు అంటూ ఆయన తల పట్టుకుని గీతం యూనివర్సిటీలో కూర్చున్నారన్నది విమర్శకులు చెబుతున్న మాట!!