జనాలొస్తున్నారట.. బాబులో ఆనందం ఆగట్లేదుగా!

చంద్రబాబు యాత్రకి జనాలు భారీగా వస్తున్నారట. టీడీపీ సర్కిల్స్ వినిపిస్తున్న మాట. టీడీపీ అనుకూల మీడియాలో కూడా జరుగుతున్న చర్చ. బాదుడే బాదుడికి ఊహించని స్పందన వచ్చిందని.. ప్రభుత్వ వ్యతిరేకత ఇలా బయటపడుతుందని టీడీపీ…

చంద్రబాబు యాత్రకి జనాలు భారీగా వస్తున్నారట. టీడీపీ సర్కిల్స్ వినిపిస్తున్న మాట. టీడీపీ అనుకూల మీడియాలో కూడా జరుగుతున్న చర్చ. బాదుడే బాదుడికి ఊహించని స్పందన వచ్చిందని.. ప్రభుత్వ వ్యతిరేకత ఇలా బయటపడుతుందని టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. నిజంగానే జనాలు చంద్రబాబు మీటింగ్ లకు వస్తున్నారా..? అసలేంటి కథ.

పవన్ కల్యాణ్ రోడ్ షో చేస్తే అంతకంటే ఎక్కువమంది వస్తారు. మరి వారంతా పవన్ కి ఓట్లు వేస్తున్నట్టేనా..? అదే నిజమైతే జనాలు వస్తేనే సభలు సక్సెస్ అయి ఓట్లు వేసేట్టయితే సినిమా వాళ్లను చూసేందుకే ఎక్కువమంది వస్తారు. సినిమావాళ్లు పార్టీ పెడితే వాళ్లే కచ్చితంగా గెలుస్తారు. కానీ అది జరగదు. 

ఎందుకంటే పవన్ ని చూసేందుకు వచ్చినవారిలో చాలామంది వైసీపీకే ఓటు వేస్తారు. వేశారు కూడా. ఈ విషయం పవన్ కి కూడా తెలుసు. చాలాసార్లు ఈ విషయంలో పవన్ అసహనం వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు చంద్రబాబు యాత్రలకి జనం వస్తే వారంతా టీడీపీకే ఓటు వేస్తారనే గ్యారెంటీ ఏంటి.. ? ఈ రకమైన ప్రచారంతో బాబు ఏం సాధిస్తారు..?

సొంతవారికే టోపీ..

నమ్మినవారిని వెన్నుపోటు పొడిచే చంద్రబాబు.. తనతో ఉన్నవారికే టోకరా పెడుతుంటారు. బకరాల్ని చేస్తుంటారు. ఆహా ఓహో అంటూ తన గురించి వార్తలు రాయించుకుంటూ ఏదో జరగబోతోందనే భ్రమల్లోకి నెట్టేస్తారు. ఆ భ్రమలో ఉన్నవాళ్లంతా నిజంగా టీడీపీ గెలుస్తుందనే ఊహల్లో ఉంటారు. ఇటీవలే స్థానిక ఎన్నికల్లో అలాంటి ఊహలన్నిటినీ పటాపంచలు చేశారు జనం. కానీ బాబుకి ఇంకా బుద్ధి రాలేదు, ఆయన్ను గుడ్డిగా నమ్మేవారికి ఇంకా భ్రమలు తొలగిపోలేదు.

తాజాగా చంద్రబాబు చేస్తున్న బాదుడే బాదుడు యాత్రలకు జనం భారీగా వస్తున్నారంటూ ఓ ఫేక్ ప్రచారం జరుగుతోంది. టీడీపీ అనుకూల మీడియాతో పాటు, సోషల్ మీడియాలో కూడా ఈ రకమైన తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆ  భ్రమలు తొలగడానికి ఎక్కువ టైమ్ పట్టదు.

బాదుడే బాదుడుతో మరోసారి చంద్రబాబు తనని తాను మోసం చేసుకుంటూ కార్యకర్తల్ని కూడా మోసం చేస్తున్నారు. ప్రజల మద్దతు తమకే ఉందంటూ రెచ్చిపోతున్నారు. 2019లో జనాల్ని మీడియాతో మోసం చేసి 23 సీట్లకే పరిమితం అయిన బాబు, ఇప్పుడు కూడా అదే రీతిలో తన అసమర్థత బయటపెట్టుకుంటున్నారు.