రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గుంటూరు మరియు విజయవాడ పార్లమెంట్ రెండు సీట్లను చేజిక్కించుకోవడానికి వైసిపి పార్టీ ఆపసోపాలు పడుతుంది ఎలాగైనా ఈ ఎన్నికలలో ఆ రెండు పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవాలని వైసిపి చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేతిస్తుంది.
విజయవాడ పార్లమెంటుకు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరిన కేశినేని నానికి టికెట్ ఇవ్వడంతో ఈసారి వైసీపీ పార్టీకి మంచి అభ్యర్థి దొరకడంతో పాటు గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక గుంటూరు పార్లమెంటుకు వచ్చే సరికి 2019లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల రెడ్డిని కాదని పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కిలారు రోశయ్యకు గుంటూరు పార్లమెంటు బాధ్యతలను అప్పగించారు.
కానీ కిలారు రోశయ్య అభ్యర్థిత్వంపై మొదట్లో గుంటూరు పార్లమెంట్ కు చెందిన అభ్యర్థులతో పాటు కార్యకర్తలు కూడా టీడీపీ పార్టీ తరుపున పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను తట్టుకోవడం కష్టమని అమెరికా నుంచి అతడు తెచ్చిన వందల కోట్ల రూపాయలు ముందు కిలారి రోశయ్య ఏమాత్రం సరిపోడని ఇంకాస్త మంచి అభ్యర్థి అయితే బాగుండేదని ఇలా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు.
కానీ సీఎం జగన్ తాను అనుకున్న పంథాలోనే ముందుకు పోతూ తన లెక్కలు తనకు ఉన్నాయని ఎవరు ఏమి చెప్పినా వినకుండా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కిలారు రోశయ్యను ప్రకటించిన దగ్గర నుంచి అతడు పార్లమెంట్ నియోజక వర్గాలు మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తలకు పరిచయం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
దాదాపుగా నాలుగు నెలల నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన గెలుపుని ఆపేవారే లేరనట్లు ఇష్టానుసారంగా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెడుతూ, అతడు పర్యటించిన కొన్ని ప్రాంతాలలో అతడి ప్రసంగాలలో శృతిమించి మాట్లాడిన మాటల వీడియోలు కూడా వైరల్ కావడంతో పాటు, గెలిచిన తరువాత అతడు గుంటూరు పార్లమెంట్ కు దూరంగా అమెరికాలో స్థిరపడతాడని వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం పెమ్మసాని చంద్రశేఖర్ వేసుకున్న లెక్కలన్నీ తారుమారు అవుతున్నట్లు కనపడుతుంది.
సీఎం జగన్ కూడా గుంటూరు పార్లమెంట్ పై సోషల్ ఇంజనీర్ చేసి ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కిలారు రోశయ్యకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసారు. గుంటూరు పార్లమెంట్ కిందా మొత్తం కాపుల ఓట్లు 2.07 లక్షలు ఉన్నాయి. వారితోపాటు ముస్లిం ఓట్లు 1.80 లక్షల ఓట్లు మరియు వైసీపీకి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అయినా రెడ్డి ఓటు బ్యాంకు 1.05 లక్షలు, మాల కులానికి చెందిన ఓట్లు 2.03 ఓట్లు ఉన్నాయి.
ఇక ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ కింద ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు సత్సంబంధాలు ఉండడం, కాపు కులానికి ఎలాంటి కష్టం వచ్చినా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముందుండి వారి సమస్యలు తీర్చడం కాపులకు ఉమ్మారెడ్డిపై కొంత సానుకూలత ఉంది. దీనితో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.
దీనితో పాటు గుంటూరు పార్లమెంటు కింద ఉన్న మూడు నియోజకవర్గాలు ప్రత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి మాత్రమే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండటం మిగిలిన నాలుగు నియోజకవర్గాలలో వైసీపీకి సానుకూల అంశాలు ఉండటంతో పాటు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ సీట్లలో వైసీపీ పార్టీకి మంచి మెజారిటీ కూడా తెచ్చి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
ఇక పక్కనే ఉన్న తెనాలి నియోజకవర్గంలో కూడా నాదెండ్ల మనోహర్ కు అనుకున్నంత సానుకూలంగా లేదని తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించిన భంగపడిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు టికెట్ దక్కకపోవడంతో అతడి వర్గం మొత్తం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండటం ఆ వర్గం మొత్తం రాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీకి చెందిన అన్నాబత్తుని శివకుమార్ కు పనిచేసే అవకాశాలు ఉండటంతో, అతడి గెలుపు నల్లేరుపై నడక అని చెప్పుకోవచ్చు.
ఇక దీనితో పాటు పొన్నూరు నియోజకవర్గంలో కూడా అంబటి మురళీకృష్ణ వైపు కొంత సానుకూలత ఉన్నప్పటికీ, దూళిపాళ్ల నరేంద్ర రాజకీయం ముందు నిలబడి గెలవడం అంత కష్టమేమి కాదని గతంలో కిలారు రోశయ్య నిరూపించాడు. ఇప్పుడు అంబటి మురళి కృష్ణ కూడా ప్రజలతో మమేకమవుతూ పోవడంతో పాటు కిలారు రోశయ్య వర్గం కూడా పూర్తిగా అంబటి మురళి కృష్ణకు మద్దతుగా గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడంతో గట్టి పోటీ అయితే ఉంటుందని తెలుస్తుంది.
ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు కింద ఉన్న మంగళగిరి నియోజకవర్గంపైనే పెమ్మసాని ఎక్కువ ఆశలు పెట్టుకుని ఉన్నాడు అక్కడ నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు పోటీ చేయనుండటం గత ఐదేళ్లుగా ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని తిరుగుతుండడంతో ఈసారి మంచి మెజారిటీతో విజయం సాధించాలని లోకేష్ పట్టుదలతో ఉన్నాడు. సర్వేలన్నీ కూడా ఈసారి లోకేష్ బాబుకి సానుకూలంగా ఉండటం కూడా అక్కడ మంచి మెజారిటీ వస్తే మిగిలిన నియోజకవర్గాలలో కాస్త అటు ఇటుగా ఉన్నా ఎలాగైనా బయటపడవచ్చని పెమ్మసాని చంద్రశేఖర ఆలోచిస్తున్నప్పటికీ, గ్రౌండ్ లో అంత సానుకూలత అయితే కనపడటం లేదు.
దీనితో పాటు గుంటూరు పార్లమెంటు కింద తెలుగుదేశం పార్టీ ఒక్క కాపు అభ్యర్థికి కూడా సీటు ఇవ్వకపోవడం కూడా వారికి కాపుల ఓట్లు గంప గుత్తుగా పడే అవకాశం లేదని తెలుస్తుంది. కాపుల ఓట్లు కచ్చితంగా ఒక ఓటు ఎమ్మెల్యేకు వేసినా మరొక ఓటు కిలారు రోశయ్యకు వేయాలని భావిస్తే మాత్రం వైసీపీ పార్టీ గత రెండు ఎన్నికలలో కన్న కళలు నిజమయ్యి గుంటూరు పార్లమెంట్ చేజిక్కించుకొని అవకాశాలు ఉన్నాయి.