రాధా… ఏమిటి నీ బాధ‌?

రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్డున ప‌డింద‌ని, జ‌గ‌న్‌ది మ‌రీ ఇంత నీచ‌మా? అని ఆంధ్ర‌జ్యోతి, కొత్త ప‌లుకులో రాధాకృష్ణ రాసారు. ఆయ‌న పేప‌ర్‌, ఇష్టం వ‌చ్చింది రాసుకుంటారు. అయితే ఆయ‌న నీతిబోధ, ధ‌ర్మ…

రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్డున ప‌డింద‌ని, జ‌గ‌న్‌ది మ‌రీ ఇంత నీచ‌మా? అని ఆంధ్ర‌జ్యోతి, కొత్త ప‌లుకులో రాధాకృష్ణ రాసారు. ఆయ‌న పేప‌ర్‌, ఇష్టం వ‌చ్చింది రాసుకుంటారు. అయితే ఆయ‌న నీతిబోధ, ధ‌ర్మ ప‌న్నాలు, న్యాయ మీమాంస వ‌ల్లిస్తూ వుంటారు. అదే పేచీ.

ఆయ‌న రాసిన వాక్యాలు ఇవీ.

1.చాలా మంది ముఖ్య‌మంత్రుల పిల్ల‌లు ఎవ‌రో, ఇపుడేం చేస్తున్నారో, ఎక్క‌డ వుంటున్నారో కూడా చాలా మందికి తెలియ‌దు.

జ‌గ‌న్ ఒక‌డే వైఎస్ వార‌స‌త్వంతో సీఎం కాగ‌లిగారు. ఇత‌ర మాజీ ముఖ్యమంత్రుల ఇళ్ల‌లో జ‌ర‌గ‌ని విధంగా వైఎస్ కుటుంబంలో గొడ‌వ‌లు తారాస్థాయికి చేరాయి. — ఎన్టీఆర్ బ‌తికి వుండ‌గానే ఆయ‌న కుటుంబంలో అధికారం కోసం జ‌రిగిన గొడ‌వ‌లో రాధాకృష్ణ ఎవ‌రి ప‌క్షాన ఉన్నారో వివ‌రిస్తే బాగుంటుంది. ఆంధ్ర‌జ్యోతి చీఫ్ రిపోర్ట‌ర్‌గా చంద్ర‌బాబు క్యాంప్‌కి ఎమ్మెల్యేలను త‌ర‌లించ‌డంలో ఆయ‌న‌కి క‌లిగిన ప్ర‌యోజ‌నాలు ఎన్ని?

హ‌రికృష్ణ రాజ‌కీయ ఉనికి కోసం పార్టీ పెట్టినపుడు పైకి లేవ‌కుండా తొక్కేసింది ఎవ‌రు?

2.ఓడిన త‌ర్వాత కూడా సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన వాళ్లంద‌ర్నీ జ‌గ‌న్ బాగా సంతృప్తిప‌రుస్తున్న‌ట్టు భావించాలి.

—సోష‌ల్ మీడియాది ఏముంది చిన్న చేప‌లు. మీరు చంద్ర‌బాబు త‌ర‌పున తిమింగ‌లంగా ఎదిగారు క‌దా! వాళ్లు పేటీఎం బ్యాచ్ స‌రే, మీరేంటి? టీడీపీని రెండు ద‌శాబ్దాలుగా ఏటీఎంగా వాడుకోలేదా? ప‌త్రికా నిర్వ‌హ‌ణ‌లో న‌ష్టాలు వ‌స్తాయ‌ని త‌ర‌చూ చెప్పే మీ ఆస్తులు వేల కోట్ల‌కి ఎలా పెరిగాయో, ఆ ర‌హ‌స్యాన్ని పేటీఎం బ్యాచ్‌కి వివ‌రిస్తే వాళ్లు కూడా బాగుప‌డ‌తారు క‌దా.

3.వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి మాట‌ల్లో నిజం వుంద‌ని ఆర్కే ఆవేద‌న చెందుతున్నారు. మంచిదే.
ఆ రోజు ఎన్టీఆర్ బ‌తికి వుండ‌గానే, ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తిపై అన్యాయ‌మైన రాత‌లు రాయ‌డంలో ఆంధ్ర‌జ్యోతి భాగ‌స్వామి కాదా? ఆ త‌ర్వాతే క‌దా మీరు య‌జ‌మానిగా ఎదిగారు!

4.ఒక‌వైపు జ‌గ‌న్‌వి అక్ర‌మాస్తులు అంటూనే ఆ ఆస్తుల్లో ష‌ర్మిల‌కి వాటా ఇవ్వ‌క‌పోవ‌డం నీచ‌మ‌ని రాయ‌డం ఏ త‌ర‌హా జ‌ర్న‌లిజం?

5.సంప‌ద కోసం ర‌క్త సంబంధాల్ని తెగ‌దెంపులు చేసుకోడానికి కూడా వెనుకాడ‌ని జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌జాజీవితంలో కొన‌సాగ‌డానికి అర్హుడా? — మంచి ప్ర‌శ్న‌. ఇదే మీరు చంద్ర‌బాబుకి వేయ‌గ‌ల‌రా? మామ బ‌తికుండ‌గానే అధికారం లాక్కున్న‌ప్పుడు ఆయ‌న్ని వ్యూహ‌క‌ర్త అని పొగిడారు క‌దా. ఆ రోజు జ‌రిగింది ర‌క్త సంబంధాల తెగ‌దెంపులు కాదా?

28 Replies to “రాధా… ఏమిటి నీ బాధ‌?”

  1. లక్ష్మీపార్వతి. విజయమ్మ ఒకటేనా అయితే సేద భాష్ . పార్వతి ఒక రాజ్యాంగ ఎత్ర శక్తి వలె బెహేవ్ చేసారు. అందువల్ల ఆ రోజు అలా చేసారు. దానికి ఒక్క బాబే కాదు టీడీపీ లో ఎక్కువ మంది అలానే ఫీల్ అయ్యారు ఇప్పుడు బాబు మీద ఎవడు అలా చేయడం లేదు అయితే .

  2. నీకు పూర్తిగా మతి భ్రమించింది. మంచి treatment తీసుకో. లేకపోతే నిన్ను జనాలు తన్ని tagalestaru

  3. Anduke kada pachha media annaru varukuda raseu kada rammurthi naidu ki share thesukokapothe hand cuffs vesi itcharu, antha goppa manasu babu gari di inka emi rayali rendu acrala nundi ela yedigero kuda raseru kada

  4. oreyi erripooka nee baadha emito cheppara.nijalani bayataku cheppadamaena leka neela,sakshi la abaddhalanu prachurinchala.poramboku gaa mee bathukulu ap rastra prajalandariki telusu kadara inka enduku raa voora kukkala arsthunnavu.

    meeku rastra prajale 11 ki parimitham chesina chiggu anedi raledu kadara chiggu leni poramboku gaa.

  5. మరి జగ్గడి ఇంట్లో జరిగిన హత్యల్లో మన సాక్షి ఏమైనా వివేకా వైపు నిలబడిందా?

  6. మరి విజయమ్మ బ్రతికుండగానే ఆమె పై ఆస్తుల కోసం కేసు వేసిన వాడిని ఏమనాలి? అప్పుడు సాక్షి e పక్కన వుంది? అవినాసం గాడి పక్కనా?

  7. rk మీద బురద జల్లడానికి లక్ష్మి పార్వతి ని విజయమ ని ఒకటి చేసేశారా ?????

  8. Laxmiparvati కి ఆల్రెడీ ఓ మొగుడు ఓ కొడుకు వున్నారు. విడాకులు లేకుండా మళ్ళీ పెళ్ళి

    విజయమ్మ ని ఆవిడతో పోల్చి క్యారెక్టర్ ని దిగజార్చ వద్దు….

  9. గ్రేట్ ఆంధ్ర గా, నీ బాధ ఏమిరా ????? ఛీ ఈబతుకు ఒక బతుకేనా??? డబ్బులు తీసుకొని వాళ్లకు నచ్చినట్టు రాసేయడం…..

  10. Abn ఛానల్ మీద పేపర్ మీద abn రాధా కృష్ణ మీద పరువు నష్టం కేసు నమోదు చేయండి

    ఒకరి వ్యక్తి గత విషయాలు పబ్లిష్ చేసే అధికారం ఎవరు ఇచ్చారు పత్రిక వారికి

  11. లక్ష్మీపార్వతి రాజేశేఖరరెడ్డి గారి భార్య ఒకే క్యారెక్టర్ అని నీ ఉద్దేశ్యమా గ్రేట్ ఆంధ్ర?

  12. రాధా చెప్పింది నిజం పక్కా అది నీ బాధ ఏమిటో చెప్పు ప్యాకేజీ ఛానల్ బాగా దొబ్బవా

  13. వెనకట రెడ్డి గారు,

    ఎన్టీఆర్ రెండో భార్య లక్కీ పార్వతి నీ వైఎస్ఆర్ అసలు భార్య నీ ఒకే పోలిక కింద చేసావా ?

    సిగ్గు లేదా , అప్పట్లో వైఎస్ఆర్ వలెనే కదా వెబ్సైట్ పెట్టుకున్నావ్?

  14. జగన్ చాలాబుద్ధిమంతుడు కదారా రెడ్డి. తండ్రి అధికారంలో జోక్యం చేసుకున్నోడు మంచోడా! ఏంది రెడ్డి నీ రాతలు

  15. మంచి విమర్శ ఉంటేనే ప్రజాస్వామ్యం బతికి, సమాజభివృద్ధి జరుగుతుంది….అలాగే ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి ని వెలికి తీయండి…కోట్ల రూపాయలు వెనకేసుకొని విచ్చలవిడిగా బ్రతికేస్తున్నారు…అప్పుడు ఆంధ్ర నిజంగా గ్రేట్ అవుతుంది…

Comments are closed.