వైసీపీకి షాక్‌.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

వైసీపీకి ఎదురు దెబ్బ త‌గిలింది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల నాని పార్టీ ప‌ద‌వుల‌న్నింటికి రాజీనామా చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏలూరు నుంచి పోటీ చేశారు. త‌న స‌మీప…

వైసీపీకి ఎదురు దెబ్బ త‌గిలింది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల నాని పార్టీ ప‌ద‌వుల‌న్నింటికి రాజీనామా చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏలూరు నుంచి పోటీ చేశారు. త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థి బ‌డేటి రాధాకృష్ణ‌య్య చేతిలో 60 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం అనంత‌రం ఆయ‌న మౌన‌వ్ర‌తం పాటిస్తున్నారు.

ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, అలాగే ఏలూరు జిల్లా వైసీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తూ, ఈ మేర‌కు వైఎస్ జ‌గ‌న్‌కు ఆయ‌న లేఖ రాశారు.

వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో భ‌విష్య‌త్‌లో రాజ‌కీయాల‌కు దూరంగా వుండాల‌ని అనుకుంటున్న‌ట్టు జ‌గ‌న్‌కు రాసిన లేఖ‌లో ఆయ‌న తెలిపారు. జ‌గ‌న్ కేబినెట్‌లో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా ప‌ని చేశారు. వివాద ర‌హితుడిగా, సౌమ్యుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. వైసీపీలో ముగ్గురు నానిల్లో ఈయ‌న ఒక‌రు.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు వ్య‌క్తిగ‌త టార్గెట్‌ల‌తో సాగుతున్నాయి. దీంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెందిన‌ట్టు నాని అనుచ‌రులు చెబుతున్నారు. త‌న స్వ‌భావానికి రాజ‌కీయాలు ప‌డ‌వ‌ని కొంత కాలంగా స‌న్నిహితుల‌తో ఆళ్ల చెబుతున్నార‌ని తెలిసింది. ఏది ఏమైనా ఆళ్ల నాని రాజీనామాతో వైసీపీకి దెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

14 Replies to “వైసీపీకి షాక్‌.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!”

  1. నిజంగా క్యాడర్ బలంగా ఉన్న పార్టీ ని నాయకులు ఎప్పుడూ విడిచి పెట్టరు ..

    నాయకులు పార్టీ ని వదిలేస్తున్నారంటే.. అక్కడ క్యాడర్ లేదని అర్థం.. క్యాడర్ ని చూసుకొనే నాయకులు ఎదుగుతారు.. ఎప్పుడైతే ఆ క్యాడర్ నశించిపోతుందో .. అక్కడ నాయకుల అవసరం ఉండదు.. పార్టీ బతికే ఉండదు..

    వైసీపీ లో క్యాడర్ ని మనుషులుగా చూడలేదు.. గొర్రెలుగా బతికారు.. బానిస బతుకులు బతికారు..

    40% ఓట్లు పడ్డాయి అని చెప్పుకొనేవాళ్ళకి.. 51% నుండి పడిపోయిన సంగతి గుర్తు లేదా..? పతనం ఎప్పుడూ నెమ్మదిగా మొదలవుతుంది.. చాలా దరిద్రం గా ముగుస్తుంది..

    వైసీపీ అంటే ఫేక్ రాజకీయాలు.. ఫేక్ ప్రచారాలు.. నమ్ముకుని బతుకుతున్న పార్టీ.. 2029 కి 20% కూడా రావు..

    1. అవును. శవాలు, అబద్దాల మీద నిర్మించిన వైసీపీ ముగింపు చాలా భయంకరముగా ఉంటుంది.

  2. మంచిదే – సౌమ్యుడు, వివాదరహితుడు అని పేరు తెచ్చుకున్న తరువాత, అన్న దగ్గర వుండాలంటే కష్టమే. పార్టీకు చెడ్డ పేరు తెచ్చే, పార్టీ స్థాయికి తగని ఇటువంటి వారు పార్టీలో వుంటే అన్నకు కూడా ఇబ్బందిగానే వుంటుంది.

Comments are closed.