ఆనం ట్వీట్ ఎఫెక్ట్‌.. అయ్య‌య్యో మ‌హిళా ఐఏఎస్ అధికారి!

టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ట్వీట్ దెబ్బ‌తో మ‌హిళా ఐఏఎస్ అధికారి హ‌రిత జాయింట్ క‌లెక్ట‌ర్ పోస్టును పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆమెకు ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా జీఏడీకి బ‌దిలీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నాలుగు…

టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ట్వీట్ దెబ్బ‌తో మ‌హిళా ఐఏఎస్ అధికారి హ‌రిత జాయింట్ క‌లెక్ట‌ర్ పోస్టును పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆమెకు ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా జీఏడీకి బ‌దిలీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నాలుగు రోజుల్లో హ‌రిత‌కు మూడు బ‌దిలీలు అంటూ వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ఐఏఎస్‌ల బ‌దిలీల్లో భాగంగా ఆమెను ఐటీడీఏ పీవోగా ప్ర‌భుత్వం పంపింది. అయితే ఆమె ఆ పోస్టులో చేర‌లేదు. బాబు కేబినెట్‌లో కీల‌క మంత్రి నారాయ‌ణ సిఫార్సుతో హ‌రిత అనంత‌పురం జాయింట్ క‌లెక్ట‌ర్‌గా బ‌దిలీ చేయించుకున్నార‌ని ఉన్న‌తాధికారుల వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో హ‌రితపై ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ట్వీట్ చేశారు. హ‌రిత నెల్లూరు కార్పొరేష‌న్ కమిషనర్ గా ప‌ని చేశార‌ని, అవినీతి అధికారి అంటూ ట్వీట్ చేశారాయ‌న‌. అలాగే తిరుప‌తిలో టీడీఆర్ బాండ్ల అవినీతిలో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అంతా హ‌రితే అని ఆనం భావ‌న‌.

ఈ నేప‌థ్యంలో హ‌రిత అవినీతిపై ప్ర‌భుత్వ దృష్టికి ఆనం తీసుకెళ్లారు. అనంత‌పురం జేసీగా హ‌రిత‌ను పంపితే, ఇంత‌కాలం ఆమె అవినీతిపై టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు విలువ వుండ‌ద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఆనం వివ‌రించిన‌ట్టు తెలిసింది. దీంతో హ‌రిత బ‌దిలీని నిలుపుద‌ల చేశారు. ఆమెను జీఏడీకి పంపుతూ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మంత్రి నారాయ‌ణ అండ ఉన్న‌ప్ప‌టికీ ఆమెను కాపాడలేక‌పోయార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

9 Replies to “ఆనం ట్వీట్ ఎఫెక్ట్‌.. అయ్య‌య్యో మ‌హిళా ఐఏఎస్ అధికారి!”

Comments are closed.