ఒక సూపర్ ప్లాప్ తర్వాత పరోటా విశ్వనాథ్ మళ్లీ సినిమా తీసాడు. విలేకర్లు ఎప్పటిలాగే గుండె ధైర్యంతో సమావేశంలో కూచున్నారు.
“గత డిజాస్టర్ నుంచి మీరేం నేర్చుకున్నారు?” అడిగారు విలేకరులు.
“నేనేం నేర్చుకోలేదు. ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు నా సినిమా కొనకూడదని నేర్చుకున్నారు” చెప్పాడు విశ్వనాథ్.
“ఈ సారి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా?”
“ఒక వయసు దాటిన తర్వాత టైమ్‌కి మెడిసిన్స్ తప్ప ఇంకేం తీసుకోరు. నేను నా పాత సినిమాల్నే మళ్లీమళ్లీ తీసాను. జనం కన్ఫ్యూజన్‌తో ఒకోసారి హిట్ చేసారు. ఎక్కువ సార్లు ప్లాప్ చేసారు. సింపుల్‌గా చెప్పాలంటే పరోటాలో ఎన్నో రకాలుంటాయి. కానీ పిండి ఒకటే. ఆలూ పరోటా అంటే ఆలూ, పుదీనా పరోటా అంటే పుదీనా ఇలా యాడ్ అవుతుంటాయి. కానీ పిండి సేమ్, కుకింగ్ సేమ్. నా దగ్గర కథ ఒకటే, మేకింగ్ ఒకటే. కొంత మంది నటులు యాడ్ అవుతుంటారు. ప్రేక్షకుల విధిరాత మీద మిగతావి ఆధారపడి వుంటాయి”
“అంతే తప్ప, మీరు చేసిందేమీ లేదా?”
“చేసేదెవరు? చేయించెదెవరు? సినిమా కథ గోధుమ పిండి లాంటిది. పూరి, పుల్కా , చపాతి, రోటీ, పరోటా. పిండిని మిక్స్ చేయడమే ఆర్ట్. శ్రేష్టమైన నూనెని వాడితే రుచి. అయితే వీటన్నింటికి సైడ్ డిష్ వుండాలి. దానికోసం నేను యాక్షన్, కామెడీ, ఐటమ్ సాంగ్స్ కలుపుతాను. ఒక్కోసారి సైడ్ డిష్ ఎక్కువై రోటీ కనపడకుండా పోతుంది. యాక్చ్‌వల్‌గా పరోటీ అనాలి. కానీ వాడుకలో పరోటాగా మారిపోయింది”
విలేకరులు బుర్ర గోక్కుంటూ “సినిమా గురించి చెప్పమంటే పరోటా సిద్ధాంతం చెబుతారేంటి?” అని అడిగాడు.
“పరోటా అర్థమైతే సినిమా అర్థమవుతుంది. జీవితమే ఒక పరోటా. పొరలుపొరలుగా వుంటుంది. జీవితానికి కష్టాలు, పరోటాకి వేడి అవసరం. నిప్పుల్లో కాలకపోతే జీవితం పచ్చి మొక్క జొన్న పొత్తు”
“ఏమైంది నీకు? మీ సినిమాని కొన్నవాళ్లు కదా ఫిలాసఫి మాట్లాడాలి!”
“కాశీకి, హిమాలయాలకి టికెట్లు బుక్ చేసుకున్న తర్వాతే వాళ్లు నా సినిమా కొన్నారు. ముందుగానే కాషాయ వస్త్రాలు, కమండలం ఉచితంగా ఇచ్చాను”
“అయినా ఆగస్టు 15, స్వాతంత్ర్య దినం నాడు ప్రేక్షకుల్ని థియేటర్‌లో బంధించడం న్యాయమా?”
“వాళ్లు థియేటర్‌లోనే వుంటే నేను తర్వాత సినిమా తీసే స్వాతంత్రం పొందుతాను. ప్రేక్షకులు గేట్లు పగలగొడితే ఒకే రోజు రెండుసార్లు స్వాతంత్రం పొందిన వాళ్లవుతారు”
“ఒకప్పుడు మీరు కూడా మంచి సినిమాలు తీసారు కదా?”
“అది గత జన్మ. అప్పుడు నేను సామాన్యుల మధ్య వుండేవాన్ని. వాళ్లకేం కావాలో నాకు తెలిసేది. సక్సెస్ తర్వాత నేను అసామాన్యున్ని అనుకో సాగాను. అందుకే బ్యాంకాక్‌లో కథలు రాసుకున్నా. బ్యాంకాక్ వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ తప్ప ఇంకేమీ జరగదని అర్థమైంది. మదర్‌లాండ్‌ను మరిచి థాయ్‌లాండ్‌ని నమ్మడం వల్ల జనం బ్యాండ్ వాయించారు”
“అయినా ఇప్పటికీ హీరోలు మిమ్మల్ని నమ్ముతున్నారు”
“అది నా అదృష్టం. వాళ్ల దురదృష్టం”
“మీతో పాటు స్టార్ట్ అయిన ఎందరో డైరెక్టర్లు వృద్ధ సినీ ఆశ్రమాల్లో చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు. మీరింకా జర్నీ సాగిస్తున్నారు”
“టికెట్ లేదని నన్ను కూడా చాలా సార్లు దించేసారు. ఎలాగో దొంగల బండి ఎక్కి జర్నీలో వున్నాను”
“ఈ సినిమాలో ఏం చెప్పదలచుకున్నారు?”
“చెబితే వినరు. చూపిస్తే చూస్తారు. హీరో మైండ్ బ్లోయింగ్. ఆయనకి మెదడు ఒకేలా వుండదు”
“అంటే ప్రేక్షకుడి మెదడుకి మేత”
“తేడా వస్తే జేబుకి కోత”
“యంగ్ డైరెక్టర్స్‌కి మీరిచ్చే మెసేజ్?”
“ప్రేక్షకుడు ఎదిగాడు. ఎదగాల్సింది డైరెక్టర్లే. మీ చుట్టూ మీరు తిరుగుతూ , మీ చుట్టూ తిరిగే వాళ్లే ప్రపంచమని నమ్మకండి. బ్యాంకాక్‌కి కాదు, బాచుపల్లికి వెళ్లండి. కథలు దొరుకుతాయి. మట్టిలో వెతకండి, మహల్‌లో కాదు”
“సందేశం బాగుంది వింటారా?”
“ఎవరూ ఏదీ వినరు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి, సర్వజ్ఞులమని నమ్మే జనరేషన్ వచ్చింది. గుంటూరు కారం కంటే ఘాటైంది అహంకారం. అది తలకెక్కితే మెదడులో చిప్ పనిచేయదు. తెలుగు భాషలో ఉన్నన్ని కారాలు మరే భాషలో లేవు. చమత్కారం, మమకారం తెలిస్తే సత్కారం. లేదంటే ఛీత్కారం”
“మీ సినిమా హిట్ అయి మరిన్ని మెరుపు దాడుల్ని ప్రేక్షకుల మీద చేయాలని కోరుకుంటున్నాం”
“దాడి (గడ్డం) ఎప్పుడూ నాతోనే వుంటుంది. కొత్తగా చేయాల్సిన పనిలేదు”
జీఆర్ మహర్షి
గురువు గారికి ఛార్మి తో వండించిన కుర్మా కావాలి పరోటా లోకి.
Vc available 9380537747
maro mee asthana cinima vidhvamsa karta madisi kaani madisi RGV???
Call boy works 8341510897
Nenu already oka sari request chesanu, Malli aduguthunna.
Daya chesi article title lo mi name vesukondi (like MBS), Adhi chuse article ni skip chesestha.
పరోటా మనకెందుకు లే కాని జగ్గులన్నియ్య ఈ మధ్య పలావ్ సిద్ధాంతం చెప్తున్నాడు..దాని గురించి ఒక ఆర్టికిల్ వదులు మహర్షీ
పరోటాల ఛీరాం అనొక దారిదోపిడి దొంగని గులగుల తో పెద్ద తోపు అని వాడి కొడుకు రేవ్ పార్టీ, నక్సల్స్ పేరుతో దొంగతనాలు చేసి బతికేవాడు…డ్రామారావు మీద రెండు పేకు డా0బులు వేసాడు…దానికే వాడికి ఉ!చ్చ కారిపోయి గులగుల సంఘాల అండతో రాజకీయ ఆశ్రయం ఇచ్చి చేరదీశాడు…దాన్నే చెంబు వాడుకున్నాడు….వాడకం అయిపోయాక కోడెదూడల వాడి అనుచరుడి చేతిలో హతం అయ్యాడు.
పరోటాల ఛీరాం అనొక దారిదోపిడి దొంగని గులగుల తో పెద్ద తోపు అని వాడి కొడుకు రే!వ్ పార్టీ, నక్సల్స్ పేరుతో దొ0గతనాలు చేసి బతికేవాడు…డ్రామారావు మీద రెండు పేకు డా0బులు వేసాడు…దానికే వాడికి ఉ!చ్చ కారిపోయి గులగుల సంఘాల అండతో రాజకీయ ఆశ్రయం ఇచ్చి చేరదీశాడు…దాన్నే చెంబు వాడుకున్నాడు….వాడకం అయిపోయాక కోడెదూడల వాడి అనుచరుడి చేతిలో హతం అయ్యాడు.
పరోటాల ఛీరాం అనొక దారిదో(పి)డి దొ0గని గులగుల తో పెద్ద తోపు అని వాడి కొడుకు రే!వ్ పార్టీ, నక్సల్స్ పేరుతో దొ0గతనాలు చేసి బతికేవాడు…డ్రామారావు మీద రెండు పేకు డా0బులు వేసాడు…దానికే వాడికి ఉ!చ్చ కారిపోయి గులగుల సంఘాల అండతో రాజకీయ ఆశ్రయం ఇచ్చి చేరదీశాడు…దాన్నే చెంబు వాడుకున్నాడు….వాడకం అయిపోయాక కోడెదూడల వాడి అనుచరుడి చేతిలో హతం అయ్యాడు.
పరోటా!ల ఛీరాం అనొక దా!రి!దో(పి)డి దొ0గని గులగుల తో పెద్ద తోపు అని వాడి కొడుకు రే!వ్ పార్టీ, న(క్స)ల్స్ పేరుతో దొ0గత(నా)లు చేసి బతికేవాడు…డ్రామారావు మీద రెండు పేకు డా0బులు వేసాడు…దానికే వాడికి ఉ!చ్చ కా(రి)పో!యి గులగుల సంఘాల అండతో రాజకీయ ఆశ్రయం ఇచ్చి చేరదీశాడు…దాన్నే చెంబు వాడుకున్నాడు….వాడకం అయిపోయాక కో!డెదూ!డల వాడి అనుచరుడి చేతిలో హ!తం అయ్యాడు.
పరోటా!ల ఛీరాం అనొక దా!రి!దో(పి)డి దొ0గని గులగుల తో పెద్ద తోపు అని వాడి కొ!డు!!కు రే!వ్ పార్టీ, న(క్స)ల్స్ పేరుతో దొ0గత(నా)లు చేసి బతికేవాడు…డ్రామారావు మీద రెండు పేకు డా0బులు వేసాడు…దానికే వాడికి ఉ!చ్చ కా(రి)పో!యి గులగుల సంఘాల అండతో రాజకీయ ఆశ్రయం ఇచ్చి చేరదీశాడు…దాన్నే చెంబు వాడుకున్నాడు….వాడకం అయిపోయాక కో!డెదూ!డల వాడి అనుచరుడి చేతిలో హ!తం అయ్యాడు.
Pichi vagudu
Matter endu mee vaagudendi