కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత?

తెలంగాణకు కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఆ ఉద్యమ నేత మరెవరో కాదు, తెలంగాణ కోసం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే ఉమ్మడి రాష్ట్రంలో కోదండరాం…

తెలంగాణకు కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఆ ఉద్యమ నేత మరెవరో కాదు, తెలంగాణ కోసం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే ఉమ్మడి రాష్ట్రంలో కోదండరాం ఉద్యమాన్ని కదం తొక్కించారు. పరుగులు పెట్టించారు. కొత్త రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరో విధంగా చెప్పాలంటే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు.

కానీ అలాంటి కోదండ రామ్ ను తెలంగాణ మొదటి సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్ నెత్తిన పెట్టుకొని సముచిత స్థానం ఇస్తాడనుకుంటే మాటలతో, చేతలతో ఘోరంగా అవమానించాడు. ఆయన చేసిన ఉద్యమాన్ని అసలు గౌరవించలేదు. చాలా చీప్ గా మాట్లాడాడు. తెలంగాణ జేఏసీలో వివిధ సంఘాలను బయటకు రప్పించాడు.

కేసీఆర్ ఇలా వ్యవహరించడానికి నిర్దిష్టమైన కారణాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. కోదండరాంను ఒంటరి చేశానని కేసీఆర్ అనుకున్నాడు. కానీ ఆయన తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ పెట్టి దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మరి కాంగ్రెస్ కాదు కదా విద్యా శాఖ మంత్రి ఎలా అవుతాడు? అనే ప్రశ్న వస్తుంది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పోస్టులు ఉన్నాయి కదా.

వాటికి చాలా కాలం క్రితమే కోదండరాం పేరును, అమీర్ అలీ ఖాన్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు. కానీ గులాబీ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అడ్డుపుల్ల వేశారు. అంటే కోర్టులో కేసు వేశారు. హై కోర్టులో కేసు వేస్తే స్టే విధించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టును కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడమన్నది ప్రభుత్వ విధి అని పేర్కొంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ నియామకాలను అప్పటి గవర్నర్ తమిళిసై పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ఆమోదం తెలిపారు.

వీరిద్దరి నియామకంలో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ నియామక గెజిట్ కొట్టివేస్తూ.. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. లైన్ క్లియర్ అయింది.

రేవంత్ సర్కారులో విద్యా శాఖ మంత్రి లేడు. దాన్ని కోదండరాంకు ఇవ్వాలని రేవంత్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోదండరామ్ సహకరించారు. ప్రజాభిమానం ఉన్న ఉద్యమకారుడు. కేసీఆర్ అవమానించాడు. విద్యావేత్త అండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ వాడు కాకపోయినా పదవి ఇవ్వడం సముచితమే.

13 Replies to “కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత?”

      1. ఎం బాబూ….పూలోకేశీ ఇచ్చే పెటిఎమ్ సరిపోక ఇలాంటి బుడగల వ్యాపారం కూడా మొదలెట్టారా…పచ్చ సాని పుత్రులు…ఛీ..ఛీ!

      1. ఎం బాబూ….పూలోకేశీ ఇచ్చే పెటిఎమ్ సరిపోక ఇలాంటి బుడగల వ్యాపారం కూడా మొదలెట్టారా…పచ్చ సాని పుత్రులు…ఛీ..ఛీ!

Comments are closed.