ప్రతి దర్శకుడికి ఏదో ఒక శైలి వుంటుంది. అందరూ రొటీన్ రొడ్డ కొట్టుడు దర్శకులు కారు. సీనియర్ వంశీ, కృష్ణ వంశీ, పూరి జగన్నాధ్ అలాంటి వారే. వీళ్ల సినిమాలు అన్నీ శైలి అన్నా అభిమానించే వారు వుంటారు. కానీ ఓ స్థాయికి చేరాక సరైన కథలు వండలేక, సరైన సినిమాలు అందించలేకపోతున్నారు. కానీ అలా అని వారి శైలి ఎక్కడికీ పోదు. వారి క్రాఫ్ట్ వారి దగ్గర వుంటుంది. కానీ సబ్జెక్ట్ అన్నది కీలకం. లైగర్ సినిమాతో పూరి వెనుక పడ్డారు. సరైన కథ అల్లలేకపోయారనో, తన కథలే రెండు మూడు కలిపి అల్లారనో మాట పడ్డారు. తరువాత వెనుక పడ్డారు.
ఇప్పుడు మళ్లీ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్. గతంలో తీసిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ అనుకోవాలి. తలలోపల చిప్ పెట్టడం అన్నది అప్పటికి కొత్త కాన్సెప్ట్. ఓ కింగ్ పిన్ తన మెదడులోని తెలివితేటలు అనాలో, సమాచారం అనాలో, మొత్తానికి అవన్నీ మరో బుర్రలోకి మార్చడం అన్నది ఇప్పుడు కాన్సెప్ట్.
కాన్సెప్ట్ ప్రకారం ఇస్మార్ట్ కు, డబుల్ ఇస్మార్ట్ కు పెద్దగా భిన్నమైనది కాకపోయినా, పూరి స్టయిల్ అనేది ఒకటి వుంటుంది. అది వేరే. హీరో ఆటిట్యూట్, యారోగెన్స్, పూరి మార్క్ డైలాగులు, పూరి మార్క్ హీరోయిన్ అందాల ప్రదర్శన ఇవన్నీ కామన్. కానీ వీటిని అన్నీ కలిపి విజయం దిశగా తీసుకెళ్లాల్సింది మాత్రం కథ. స్క్రీన్ ప్లే. మరి ఇప్పుడు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ఈ కథ, స్క్రీన్ ప్లే ఎలా వుండబోతోందో తెలియాల్సి వుంది.
కానీ ఒకటి మాత్రం చాలా మందిలో వున్న కోరిక. పూరి బౌన్స్ బ్యాక్ కావాలి. ఎందుకంటే పూరి స్టయిల్ సినిమాలు పూరి మాత్రమే తీయగలరు. అలాంటి సినిమాలు కూడా మన జనాలకు కావాలి. అవి రావాలంటే ముందుగా ఈ సినిమా హిట్ కావాలి. పూరికి ఓ కసి వుండేది గతంలో. కసిగా సినిమా తీయడం అన్నది అలవాటు వుండేది. మరి అదే అలవాటు ఇప్పటికీ వుందో, లేదో అన్నది డబుల్ ఇస్మార్ట్ చెప్పేస్తుంది. నిజంగా మనసు పెట్టి, పూరి కసితో సినిమా తీస్తే అది వేరే లెవెల్ లో వుంటుంది. కానీ అదే పూరిలో ఓ ఉదాసీనత కూడా కాస్త వుందనిపిస్తుంది. కసిని కనుక ఈ ఉదాసీనత డామినేట్ చేస్తే కష్టం.
అలా డామినేట్ చేసి వుండదనే నమ్ముదాం. ఆల్ ది బెస్ట్ పూరి జగన్నాధ్.
yes.
పూరీ చల్లారిపోయి నానిపోయి పాచిపోయి చాలాకాలమైంది
Creative people destoryed their talent by Drugs and girls, ex : Varma, puri,
Vc available 9380537747
Call boy jobs available 8341510897
Enduku, decoitgadiki supporter ana? Vaadi cinemalu Neninthe tappa migilinavanni balisi kottukuni teesina cinemalu.
జనం పట్టించుకోరు
ఎలా తీసినా మేం థియేటర్లో చూడం
ఈడు కసి తో కాదు . చార్ మీ బొక్కలో వేలెట్టి సినిమాలు చేస్తాడు.. అన్నీ వెస్ట్ సినిమాలు.. బూతులు వల్గారిటీ..