మీరిచ్చేది వ‌ద్దు.. మేము డిమాండ్ చేసిందే కావాలి!

నాలుగు రోజుల క్రితం ఆశావ‌ర్క‌ర్ల‌కు తీపి క‌బురు చెప్పామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ఘ‌నంగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో, ఇవాళ వాళ్లంతా ఆందోళ‌న బాట ప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

నాలుగు రోజుల క్రితం ఆశావ‌ర్క‌ర్ల‌కు తీపి క‌బురు చెప్పామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ఘ‌నంగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో, ఇవాళ వాళ్లంతా ఆందోళ‌న బాట ప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మీరు (ప్ర‌భుత్వం) ఇచ్చేది వ‌ద్ద‌ని, తాము డిమాండ్ చేసిందే ఇవ్వాల‌ని ఆశా వ‌ర్క‌ర్లు ఆందోళ‌న బాట ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆశా వ‌ర్క‌ర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 62 ఏళ్ల‌కు పెంచ‌డం, అలాగే మొద‌టి రెండు ప్ర‌స‌వాల‌కు 180 రోజుల వేత‌నంతో కూడిన సెల‌వులు, నిబంధ‌న‌ల ప్ర‌కారం గ్రాట్యుటీ చెల్లింపు. స‌ర్వీస్ ముగింపు స‌మ‌యంలో గ్రాట్యుటీ కింద రూ.1.50 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం ఉంద‌ని ఆశా వ‌ర్క‌ర్ల‌కు తీపి క‌బురు అందించిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి కూడా చంద్ర‌బాబు స‌ర్కార్ సిద్ధ‌మైంది.

కానీ ప్ర‌భుత్వం చెప్పిన వాటితో ఆశా వ‌ర్క‌ర్లు సంతృప్తి చెంద‌డం లేదు. డిమాండ్ల సాధ‌న‌కు ఆశా వ‌ర్క‌ర్లు చ‌లో విజ‌య‌వాడకు పిలుపు ఇచ్చారు. ఈ మేర‌కు ఆశా వ‌ర్క‌ర్లు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి బ‌స్సులు, రైళ్ల‌లో విజ‌య‌వాడ‌కు బ‌య‌ల్దేరారు. ప్ర‌ధాన న‌గ‌రాల్లోని రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌లో ఆశావ‌ర్క‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అడ్డంకుల‌ను అధిగ‌మించి చాలా మంది విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్‌కు చేరుకున్నారు. ధ‌ర్నాకు దిగిన ఆశా వ‌ర్క‌ర్ల‌ను పోలీసులు అడ్డుకున్నారు.

రెండేళ్ల వ‌యో ప‌రిమితి పెంపు, ప్ర‌సూతి సెల‌వుల‌ను 180 రోజులు చేయ‌డం లాంటివి త‌మ‌కు వ‌ద్ద‌ని ఆశా వ‌ర్క‌ర్లు అంటున్నారు. వేత‌నాన్ని రూ.26 వేలు చేయాల‌ని ఆశా వ‌ర్క‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వంలో త‌మ‌కు రాత‌మూల‌కంగా ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదే సంద‌ర్భంలో పోలీసులు త‌మ ఉద్య‌మంపై ఉక్కుపాదం మోప‌డాన్ని ఆశా వ‌ర్క‌ర్లు తీవ్రంగా వ్య‌తిరేకించారు.

3 Replies to “మీరిచ్చేది వ‌ద్దు.. మేము డిమాండ్ చేసిందే కావాలి!”

  1. ఎంత విడ్డురం .. గత ప్రభుత్వంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలచెయ్యలా ? రాను రాను ప్రభుత్వ ఉద్యోగుల దౌర్జన్యం /డిమాండ్స్ కి అడ్డు అదుపు లేకుండా పోతుంది . దీనికి అడ్డుకట్ట వేయలేకపోతే నెక్స్ట్ 10 ఇయర్స్ లో రాజీకీయనాయుకులని ప్రభుత్వ ఉద్యోగులే రూల్ చేసేటట్లు ఉన్నారు .

Comments are closed.