ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి లాజిక్ అవ‌స‌రం లేదా?

అంబ‌టి రాంబాబు మాత్రం లాజిక్ గురించి ఆలోచించ‌రు. ఏదో ఒక విమ‌ర్శ ప‌వ‌న్‌పై చేయాల‌నే ఏకైక ల‌క్ష్యం అంబ‌టిలో క‌నిపిస్తుంటుంది. అందుకే వైసీపీ అప్ర‌తిష్ట‌పాల‌వుతోంటోంది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైసీపీకి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి. టీడీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం వైసీపీకి ఏ మాత్రం ఇష్టం లేదు. ప‌వ‌న్ త‌న సామాజిక వ‌ర్గాన్ని టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చేలా చేయ‌డంలో విజ‌యం సాధించార‌ని, అందుకే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము ఓడిపోయామ‌నే ఆవేద‌న వైసీపీ నేత‌ల్లో బ‌లంగా వుంది. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్‌ను వైసీసీలోని ఆయ‌న సామాజిక వ‌ర్గ నేత‌లు టార్గెట్ చేస్తుంటారు. వీళ్ల‌లో అంబ‌టి రాంబాబు, పేర్ని నాని మొద‌టి వరుస‌లో వుంటారు. ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డంలో పేర్నినాని లాజిక్‌ను వాడుతుంటారు.

కానీ అంబ‌టి రాంబాబు మాత్రం లాజిక్ గురించి ఆలోచించ‌రు. ఏదో ఒక విమ‌ర్శ ప‌వ‌న్‌పై చేయాల‌నే ఏకైక ల‌క్ష్యం అంబ‌టిలో క‌నిపిస్తుంటుంది. అందుకే వైసీపీ అప్ర‌తిష్ట‌పాల‌వుతోంటోంది. తాజాగా ప‌వ‌న్‌ను ఎక్స్ వేదిక‌గా అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. అదేంటో తెలుసుకుందాం.

“అన్న‌ను దొడ్డిదారిన మంత్రివ‌ర్గంలోకి తీసుకురావ‌డంలో ఘ‌న విజ‌యం సాధించిన త‌మ్ముడికి శుభాకాంక్ష‌లు” అని అంబ‌టి సెటైర్ విసిరారు. నాగ‌బాబుని ఎమ్మెల్సీని చేసి, ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలోకి తీసుకురావ‌డంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ‌యం సాధించార‌ని అంబ‌టి విమ‌ర్శ‌. ఇందులో దొడ్డిదారి ఏముందో అంబ‌టికే తెలియాలి.

శాస‌న మండ‌లి స‌భ్యుల్ని కేబినెట్‌లోకి తీసుకోవ‌డాన్ని అంబ‌టి కించ‌ప‌రుస్తున్న‌ట్టుగా వుంది. కేవ‌లం అసెంబ్లీకి ఎన్నికైన వాళ్లు మాత్ర‌మే ప్ర‌జాప్ర‌తినిధుల‌నే చిన్నచూపు అంబ‌టి విమ‌ర్శ‌లో చూడొచ్చ‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ప‌వ‌న్‌ను త‌ప్పు ప‌ట్టాలంటే, ఇంత‌కంటే మంచి స‌బ్జెక్ట్ అంబ‌టికి దొర‌క‌న‌ట్టుంది. ఏదో ర‌కంగా ప‌వ‌న్‌ను గిల్లుతూ, వ్య‌తిరేక‌త‌ను య‌ధాత‌థంగా ఉంచుకోవాల‌నే తాప‌త్ర‌యం దేనికో అర్థం కాదు. ఈ విష‌యంలో చంద్ర‌బాబును చూసి, వైసీపీ నేత‌లు రాజ‌కీయం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం వుంది. రాజ‌కీయాల్లో ఎవ‌రితోనైనా శాశ్వ‌త శ‌త్రుత్వం వుండాల‌నే వైసీపీ మ‌న‌స్త‌త్వాన్ని అంబ‌టి రాంబాబు ట్వీట్ ప్ర‌తిబింబిస్తోంది.

18 Replies to “ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి లాజిక్ అవ‌స‌రం లేదా?”

  1. నిన్న జలగన్ చేసిన కామెంట్ లో ఏం లాజిక్ కనపడింది నీకు! గాలి తీసిన జగన్, పంచ్ వేసిన జగన్ అంటూ రాసుకున్నావు? జలగడు ఏమన్నా గాలి కొట్టుకుంటూ పంచర్లు గానీ వేడుకుంటున్నాడా అని పలువురు నెటిజనులు అనుకుంటున్నారు

  2. నిన్న జలగన్* చేసిన కామెంట్ లో ఏం లాజిక్ కనపడింది నీకు! గాలి తీసిన జగన్, పంచ్* వేసిన జగన్ అంటూ రాసుకున్నావు? జలగడు* ఏమన్నా గాలి కొట్టుకుంటూ పంచర్లు గానీ వేడుకుంటున్నాడా అని పలువురు* *నెటిజనులు అనుకుంటున్నారు.

  3. నిన్న జ లగన్* చేసిన కామెంట్ లో ఏం లాజిక్ కనపడింది నీకు! గాలి తీసిన జగన్, పంచ్* వేసిన జగన్ అంటూ శునకాన*దం పొందావు? జ లగడు* ఏమన్నా గాలి కొట్టుకుంటూ* *పంచర్లు గానీ వేడుకుంటున్నాడా అని పలువురు* నె టి జ ను లు అనుకుంటున్నారు

  4. నిన్న జ లగన్* చేసిన కామెంట్ లో ఏం లా జి క్ కనపడింది నీకు! గా లి తీసిన జ ల గన్, పంచ్* వేసిన జ ల గన్ అంటూ శునకాన*దం పొందావు? జ లగడు* ఏమన్నా గాలి కొట్టుకుంటూ* *పంచర్లు గానీ వేడుకుంటున్నాడా అని పలువురు* నె టి జ ను లు అనుకుంటున్నారు

  5. నిన్న జ లగన్* చేసిన కా మెం ట్ లో ఏం లా జి క్ కనపడింది నీకు! గా లి తీసిన జ ల గన్, పంచ్* వేసిన జ ల గన్ అంటూ శునకాన*దం పొందావు? జ లగడు* ఏమన్నా గాలి కొట్టుకుంటూ* *పంచర్లు గానీ వేసు కుంటున్నాడా అని ప లు వు రు నె టి జ ను లు అనుకుంటున్నారు

  6. Y Sheep’s are Memes మెటీరియల్ & ట్రోలింగ్ స్టాక్.. వారానికి ఒకసారి వస్తేవారం అంతా అవే చూడాలంటే బోరింగ్.. కనీసం నెలలో 11 సార్లు ఇలా press మీట్ పెట్టు..సోషల్మీడియా లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది..ఆంధ్ర మొత్తం సంతోషంగా u ట్యూబ్ లో నీ కామిడీ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.

  7. లాజిక్ లు అర్థం అవుతాయా అసలు ఈయనకి .. నాకు పోలవరం అర్ధం కాలేదు అన్నారు గతం లో ..అది కూడా ఇరిగేషన్ మినిస్టర్ హోదా లో ..

  8. అసలు Y.-.C.-.P అన్న పార్టికె లాగిక్ లెదు! బులుగు మీడియాకి అసలె లెదు!!

  9. ఓటర్లు అందరు గుర్తుపెట్టుకొని ఇంకోసారి ఫ్యాన్ గుర్తు వైపు చూడకుండా జాగ్రత్త పడాలి….అందుకు ఇప్పటినుండే సమయాత్తమవ్వాలి….

  10. మార్చి 14 జనసేన పిఠాపురం ప్లీనరీ

    పవన్ కళ్యాణ్ స్పీచ్ కు కావాల్సిన అమ్మూనిటిన్ జగన్ ఛాన్స్ ఇచ్చేసినట్టే.

    అధికారంలోకి వచ్చాకా పవన్ కళ్యాణ్ కాస్త అగ్రెషన్ తగ్గించారు… ఇప్పుడు జగన్ గాడే రెచ్చగొట్టేశాడు .. ఇంక ఉతుకుడే ఉతుకుడు ..

    ఒక శివమణి జాజ్ కొట్టినట్టు

    తమన్ గాడు డ్రమ్స్ కొట్టినట్టు

    ఒకటే ఉతుకుడు ఇంకా..!

Comments are closed.