రాంగోపాల్‌వ‌ర్మ‌పై బెడిసికొట్టిన సీఐడీ కేసు

త‌న‌పై న‌మోదైన కేసును క్వాష్ చేయాలంటూ వ‌ర్మ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన ఏపీ హైకోర్టు కీల‌క కామెంట్స్ చేసింది.

ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌పై ఏపీ సీఐడీ కేసు బెడిసి కొట్టింది. టీడీపీకి మొద‌టి నుంచి వ‌ర్మ కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సంగ‌తి తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌, అలాగే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై గ‌త కొన్నేళ్లుగా వ్యంగ్య సినిమాలు తీస్తూ, వాళ్ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో బాబు, లోకేశ్‌, ప‌వ‌న్‌ల‌ను కించ‌ప‌రుస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌ని ప‌లుచోట్ల టీడీపీ, జ‌నసేన కార్య‌క‌ర్త‌ల ఫిర్యాదులు, కేసుల న‌మోదు గురించి తెలిసిందే.

ఆ కేసుల్లో అరెస్ట్ చేయాల‌ని ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్లిన‌ప్ప‌టికీ, హైకోర్టులో వ‌ర్మ ఇప్ప‌టికే ఉప‌శ‌మ‌నం పొందారు. దీంతో మ‌రో కేసును తెర‌పైకి తెచ్చారు. 2019లో క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు పేరుతో సినిమా తీసి కులాల్ని రెచ్చ‌గొట్టార‌ని వ‌ర్మ‌పై సీఐడీకి మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఆత్మ‌కూరుకు చెందిన వ్య‌క్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ కేసు న‌మోదు చేసి, విచార‌ణ నిమిత్తం వ‌ర్మ‌కు నోటీసులు పంపింది.

త‌న‌పై న‌మోదైన కేసును క్వాష్ చేయాలంటూ వ‌ర్మ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన ఏపీ హైకోర్టు కీల‌క కామెంట్స్ చేసింది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసిన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది. అలాగే వ‌ర్మ‌ను విచారించ‌డంపై న్యాయ స్థానం స్టే విధించింది. పూర్తి వివ‌రాల‌తో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సీఐడీ అధికారుల్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో వ‌ర్మ‌ను కూడా పోసానిని జైలుకు పంపిన‌ట్టు చేయాల‌నుకున్న ప్ర‌భుత్వ పెద్ద‌ల ఎత్తులేవీ పార‌లేదు. న్యాయ స్థానం ఆదేశాలు సీఐడీకి, దాని వెనుక వుండి ఆడిస్తున్న వాళ్ల‌కు షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

20 Replies to “రాంగోపాల్‌వ‌ర్మ‌పై బెడిసికొట్టిన సీఐడీ కేసు”

  1. అదెంటయ్య! చంద్రబాబు కి అయితె స్టె తెచ్చుకున్నాడు అని రాస్తావ్ కదా.. అలా RGV కి రాయకుండా CID కె బెదిసికొట్టింది అని రాసావ్!

    .

    స్టె కూడా కొర్ట్ విచరాణ చేసాకె ఇస్తుంది. గొర్రెలు ఆ విషయం అర్థం చెసుకొవాలి!

  2. “క్వాష్” చెయ్యమని అభ్యర్థిస్తే కోర్ట్ “స్టే” విధించింది….interim relief ఇచ్చ్చారు ఆరు వారాలు ….ఈ మాత్రం దానికి షాక్ ఎందుకు అవ్వాలి? షాక్ అవ్వాల్సి వస్తే జెగ్గు వారి లాయర్ ల బృందం షాక్ అవ్వాలి ఒక్కడికి కూడా కనీసం బెయిల్ ఇప్పించలేక పోయినందుకు….పోసాని ఆంధ్ర లో స్టేషన్ లు అన్నీ తిరుగుతున్నాడు….

  3. ఎన్నికల ముందు ఒక వర్మ ని ఇంటికే పరిమితం చేసారు.

    నిన్న ఎన్నికల్లో ఇంకో వర్మని ఇంటి పంపించారు.

    మొత్తానికి ఈ వర్మ ని ఏమి ఈకలేకపోయారు.

    ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజులు..మసకబారు రాజకీయం బాగుంది.

  4. పోసాని – పవన్

    కమ్మ – కాపు గొడవ

    పార్టీలకి చుట్టి పండగ చేసుకుంటున్నారు.

  5. పోసాని తాను ఇక రాజకీయాలకు దూరమని చెప్పిన తర్వాత కొంత కాలం సైలెంటుగా ఉన్నారు. కానీ వదిలి పెట్టే ప్రశ్నే లేదని ఆయన హఠాత్ అరెస్టుతో నిరూపించారు. పోసానితో పోలిస్తే రామ్ గోపాల్ వర్మనే ఎక్కువగా కూటమి నేత అహం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అడ్డగోలు మాటలు మాట్లాడారు. సినిమాలు తీశారు. మార్ఫింగ్‌లు వేశారు. ఆయనకు ఇంకా మిసెరబుల్ ట్రీట్ మెంట్ ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇవన్నీ ఆయనకు తెలుస్తూనే ఉన్నాయి.

    Miserable ki Spelling rayistharu Jagrathha!!

Comments are closed.