ఆ కాంబినేషన్‌కు నిర్మాతలు నో!

ఒకసారి ఖర్చు ఎక్కువ పెట్టించేస్తారని దర్శకుడికి పేరు పడిపోతే, నిర్మాతలు చాలా జాగ్రత్త పడిపోతారు. ఒకసారి దొరికేస్తారు. రెండుసార్లు దొరికేస్తారు. కానీ ప్రతిసారీ బుక్‌ అయ్యిపోరు కదా!

ఒకసారి ఖర్చు ఎక్కువ పెట్టించేస్తారని దర్శకుడికి పేరు పడిపోతే, నిర్మాతలు చాలా జాగ్రత్త పడిపోతారు. ఒకసారి దొరికేస్తారు. రెండుసార్లు దొరికేస్తారు. కానీ ప్రతిసారీ బుక్‌ అయ్యిపోరు కదా!

ఓ యంగ్‌ డైరెక్టర్‌ ఉన్నాడు. ఈ జనరేషన్‌ డైరెక్టర్లు చాలా మంది భారీ భారీ టెక్నీషియన్లను తీసుకుంటారు. వాళ్ల టాలెంట్‌ను వాడేసుకుంటారు. కానీ ఖర్చు మాత్రం నిర్మాతల నెత్తిన పడుతుంది. ఈ యంగ్‌ డైరెక్టర్‌ కూడా అదే బాపతు. అందువల్ల సినిమాకు భారీగా ఖర్చు చేయించేస్తారని టాక్‌ ఉంది.

అయినా కూడా అతడితో సినిమా చేయడానికి నిర్మాతలు రెడీ. అయితే, ప్రస్తుతం అందుబాటులో సరైన హీరో ఎవరూ లేరు. సదరు యంగ్‌ డైరెక్టర్‌ ఓ సీనియర్‌ హీరోతో చేస్తానంటున్నాడు. ఆ హీరో కూడా తాను రెడీనే అంటున్నాడు. కానీ నిర్మాతలే రెడీగా లేరు.

గతంలో ఇదే కాంబినేషన్‌లో సినిమా చేసినా, అది బ్లాక్‌బస్టర్‌ అయినా, నిర్మాతలకు మిగిలిందేమీ లేదు. అందుకే, ఇప్పుడు ఎవరూ పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. దానికి కారణం హీరో, డైరెక్టర్‌ రెమ్యూనరేషన్‌లే దాదాపు వంద కోట్ల బడ్జెట్ అవడం. సినిమాకు మరో వంద కోట్లు కావాలి. మొత్తం 200 కోట్ల బడ్జెట్‌ ఎక్కువై, వర్కౌట్‌ కావడం కష్టంగా మారుతోంది.

అందుకే, వేరే కాంబినేషన్‌ ఏదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏమైనా సరే, దర్శకులు మారాలి. పెద్ద సినిమాటోగ్రాఫర్‌ను తీసుకుని, సినిమా కోసం భారీగా ఖర్చు చేయించడం, ఆ మేకింగ్ ఘనత అంతా తమదే అని చెప్పుకోవడం బదులు, చక్కగా రీజనబుల్‌ టెక్నీషియన్లను తీసుకుని, తమ క్రియేటివిటీని వాడి, నిర్మాతలకు ఓ రూపాయి మిగిల్చే పని చేయాలి. అప్పుడు జనం “శభాష్” అంటారు.

10 Replies to “ఆ కాంబినేషన్‌కు నిర్మాతలు నో!”

Comments are closed.