చంద్రబాబుతో వైరం ఉంది.. దగ్గుబాటి సంచలనం!

రాజకీయాలు అన్నీ వదిలేశాక, ఇక బాబుతో వైరం ఎందుకు?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మధ్య రాజకీయ వైరం ఉందన్నది తెలిసిందే. ఈ ఇద్దరూ టీడీపీలో దశాబ్దాల పాటు పనిచేశారు. రెండు వర్గాలుగా హవా చాటుకున్నారు. దగ్గుబాటిని పార్లమెంటుకు పోటీ చేయించి, రాష్ట్ర రాజకీయాల్లో తనకు అడ్డం కాకుండా బాబు చూసుకున్నారన్నది అప్పట్లో ప్రచారంలో ఉన్న మాట.

వీటికి మించి, చరిత్రలో నిలిచిపోయిన ఒక అరుదైన ఘటనలో ఇద్దరూ చేతులు కలిపారు. ఎన్టీఆర్‌ను గద్దె నుండి దించేయడంలో బాబుకు దగ్గుబాటి సహకరించారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బాబు హామీ ఇచ్చి, చివరకు ఇవ్వలేదని తిరిగి ఎన్టీఆర్ వైపు దగ్గుబాటి వెళ్లిపోయారు.

ఎన్టీఆర్ మరణం తరువాత, 1995 వెన్నుపోటు ఎపిసోడ్, వీటిపై దగ్గుబాటి పుస్తకాలు రాశారు. వాస్తవాలు ఇవే అని చాటి చెప్పారు. వాటిలో తప్పు చంద్రబాబుదేనన్నట్లుగా ఉంది. అయితే, ఇద్దరు తోడల్లుళ్లు 1995 తరువాత మళ్లీ 2025లో విశాఖ వేదికగా కలుసుకున్నారు. దగ్గుబాటి రాసిన పుస్తకావిష్కరణకు చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా దగ్గుబాటి చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు కొంత సంచలనం కలిగించాయి. తనకూ చంద్రబాబుకు మధ్య వైరం ఉందని అనుకుంటారని, అయితే అది వాస్తవమే అన్నారు. “మా ఇద్దరి మధ్యన వైరం ఉంది. కానీ అది గతం,” అని దగ్గుబాటి స్పష్టం చేశారు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు కదా. పైగా, ప్రతి మనిషికి ఒక్కటే జీవితం అని దగ్గుబాటి కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు. “తనకు ఇప్పుడు చంద్రబాబుతో ఎలాంటి వైరాలు లేవు,” అని తెలిపారు. అయితే, తాను గతంలో ఆయనపై తన పుస్తకంలో రాసిన విషయాలను చూసినవారు వైరం ఉందని అనుకుంటారని, అది అప్పటి ముచ్చట అని తేల్చేశారు.

“చంద్రబాబు కృషిని అభినందిస్తున్నాను. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను,” అని దగ్గుబాటి అన్నారు. “బాబును తాను పొగుడుతున్నానని ఏమీ అనుకోవద్దు. తనకు పదవుల మీద ఎలాంటి ఆశలు లేవు సామీ!” అని దగ్గుబాటి మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

దగ్గుబాటి ముక్కుసూటి మనిషి. ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పారు. గతంలో గొడవలు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రశాంత జీవితాన్ని కోరుకుంటున్న తాను అందరితో మంచిగా ఉంటున్నానని చెప్పారు.

పైగా, “రాజకీయాలు అన్నీ వదిలేశాక, ఇక బాబుతో వైరం ఎందుకు?” అన్నది దగ్గుబాటి మార్క్ ఫిలాసఫీ. అందుకే తన పుస్తకావిష్కరణకు బాబును పిలవడమే కాకుండా, ఆయన గురించి నాలుగు మంచి మాటలు కూడా చెప్పారు.

దానికి బాబు కూడా స్పందిస్తూ, “మా కుటుంబంలో దగ్గుబాటి ఒక విశిష్టమైన వ్యక్తి,” అని కొనియాడారు. “ఆయన ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేస్తారు. ఆయన జీవితం స్పూర్తివంతం,” అని అన్నారు. తాను, దగ్గుబాటి ఇద్దరూ ఎన్టీఆర్ నుండి ఎంతో నేర్చుకున్నామని చంద్రబాబు గతాన్ని నెమరేసుకున్నారు.

24 Replies to “చంద్రబాబుతో వైరం ఉంది.. దగ్గుబాటి సంచలనం!”

  1. పాపం….మ్యాటర్ ఏమి లేక హెడ్డింగ్ పెట్టుకొని సుంకానందం అన్నమాట

  2. అందరికీ యదార్థం అర్థం అవుతుంది. వాస్తవంలోకి వస్తారు. జగన్ మరియు GA ఎప్పటికీ అంధకారంలో బ్రతుకుతారు. ఎప్పటికీ మార్పురాదు.

  3. ఇంతకీ ఆ పుస్తకం లో ఎం రాసారు ? ఈయన , ఈయన తోడల్లుడు కలిసి ఎలా ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారనణా ?

    1. Avunu prapancha charitra ante mana neelam valaki ntr charitra laga vundi

      Goddali potu mundu gundepotu tarvata emo narasura tarvata ….

  4. కుటుంబ కలహన్నీ రాజకీయంగా వాడుకుని చంద్రబాబు మీద పుస్తకాలు రాయించారు వైఎస్సార్..CBN ఎప్పుడూ నోరు జారలేదు ఆ తరువాత జగన్ దగ్గరకు తీసుకున్నట్టే తీసుకుని అవమానించాడు చివరికి బంధం బలమైందని మరోసారి నిరూపించబండింది

    1. అంటే దుగ్దపాటి ఎవరు ఏమి చెప్పినా చేసే జంపింగ్ జంపంగ్ అంటారు.

Comments are closed.