వెంకీ మళ్లీ తప్పు చేస్తారా?

అవసరం అయితే ఆరునెలలు, ఏడాది వెయిట్ చేస్తారు కానీ వెంకీ మరోసారి తప్పు చేయరనే టాక్ సురేష్ కాంపౌండ్ లో వినిపిస్తోంది.

నారప్ప.. సైంధవ్ అటు రెండు సినిమాలు. ఎఫ్ 2..3 సిరీస్, సంక్రాంతికి వస్తున్నాం. ఇటు రెండు సినిమాలు. వీటి ఫలితాలు చూసిన తరువాత హీరో విక్టరీ వెంకటేష్ ఏ రకం సినిమా చేయాల్సి వుంటుంది అన్నది క్లారిటీ రావాల్సి వుంది.

దృశ్యం సిరీస్ కూడా వెంకీలోని ఫ్యామిలీ కోణాన్ని చూపించింది తప్ప వేరు కాదు. ఓ చిన్న పాయింట్ తో తీసిన ఫ్యామిలీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం వందల కోట్ల కలెక్షన్లు కొల్ల కొట్టింది. బోలెడు ఖర్చు చేసి, కిందా మీదా కష్టపడిపోయి చేసిన సైంధవ్ డిజాస్టర్ అయింది.

ఇప్పుడు ఏ తరహా సినిమా చేయాలి, ఎవరితో చేయాలి అన్నది ఫ్యాన్స్ డిస్కషన్ పాయింట్.

ఇలాంటి నేపథ్యంలో సురేందర్ రెడ్డితో వెంకటేష్ సినిమా అనే వార్త పుట్టింది. అది ఫ్యాన్స్ కు గాభరా పుట్టించింది. కళ్ల ముందు ఏజెంట్ సినిమా కదలాడింది. కానీ అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈవార్త ఇంకా ప్యూర్ గ్యాసిప్ మాత్రమే.

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ ఏ దర్శకుడికి ఓకె చెప్పలేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఇద్దరు ముగ్గురు దర్శకులు వెళ్లారు, కలిసారు..అంత వరకే అంతకు మించి ఏమీ ముందుకు వెళ్లలేదు.

రామ్ తో మైత్రీ నిర్మించే సినిమాలో సీనియర్ హీరో రియల్ హీరోగా నటించే పాత్ర వుంది. దానికి ఓ డిస్కషన్ అయితే జరిగింది.

కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ రవితేజతో ఫిక్స్ అయింది. సురేందర్ రెడ్డి కి చేయాలని వుంది కానీ నిర్మాత ఎవరూ రెడీగా లేరు. నల్లమలపు బుజ్జి ఎంత వరకు రెడీగా వున్నారన్నది అనుమానం.టాగోర్ మధు అయితే చేయడానికి రెడీగా లేరు. పైగా ఏజెంట్ ఇచ్చిన బ్యాడ్ ఎఫెక్ట్ ఇంతా అంతా కాదు. అందువల్ల అంత సులువుగా వెంకటేష్ కాంబినేషన్ సెట్ కావడం కష్టమే. అవసరం అయితే ఆరునెలలు, ఏడాది వెయిట్ చేస్తారు కానీ వెంకీ మరోసారి తప్పు చేయరనే టాక్ సురేష్ కాంపౌండ్ లో వినిపిస్తోంది.

2 Replies to “వెంకీ మళ్లీ తప్పు చేస్తారా?”

Comments are closed.