యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా దిల్ రుబా. మరోవారంలో విడుదలయ్యే ఈ సినిమా నుంచి ట్రయిలర్ ను విడుదల చేసారు. తప్పు చేసిన తరువాత చెప్పిన సారీకి, అవసరం తీరాక చెప్పే థాంక్స్ కు విలువ లేదు అని నమ్మే కుర్రాడి కథ. సినిమాను మూడు జానర్ల మిక్సింగ్ అన్నట్లు తయారుచేసినట్లు కనిపిస్తోంది. ఒకటి లవ్ అండ్ ఫన్. రెండు యాంగ్రీ యంగ్ మన్..మూడు యాక్షన్. ఈ మూడింటిని మిక్స్ చేసి హీరో పాత్రను డిజైన్ చేసారు.
రెగ్యులర్ ఫార్మాట్ లవ్ స్టోరీ. దాన్ని టర్న్ చేసే సంఘటనలు..ఆపైన పర్యవసానాలు. ఈ మూడింటిలో కిరణ్ అబ్బవరం డిఫరెంట్ గా కనిపించడానికి, వైవిధ్యం ప్రదర్శించడానికి, మెప్పించడానికి ప్రయత్నించినట్లు ట్రయిలర్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ మూడు తరహా క్యారెక్టర్లలో చాలా మంది హీరోలను ఇప్పటికే చూసాం. చాలా కథలూ చూసాం. అందువల్ల ఈసారి వీటిల్లో కిరణ్ ఏ మేరకు రాణించాడు. ఎలా మెప్పించాడు అన్నది మాత్రమే చూడాలి.
సినిమా కథ పరంగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి, మాజీ ప్రియుడిని, అతని ప్రియురాలిని కలపడం అన్నది నావెల్ పాయింట్ కావచ్చు. కానీ ట్రయిలర్ లో వేసిన షాట్స్ అన్నీ రెగ్యులర్ కథకు సంబంధించినట్లే వున్నాయి. టెక్నికల్ వర్క్ బాగుంది. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా. మూడు షేడ్స్ లో కిరణ్ బాగానే చేసాడు. సినిమా ఎలా వుంటుంది, ఎలా తీసాడు దర్శకుడు అన్న దానిని బట్టి సక్సెస్ ఆధారపడి వుంటుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,