అసెంబ్లీకి వెళ్ల‌డు… కానీ జ‌గ‌న్ ఉచిత స‌ల‌హాలు!

ప్ర‌తిప‌క్ష హోదాతో సంబంధం లేకుండా అసెంబ్లీకి వెళ్లి, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ కూడా గ‌ళ‌మెత్తడానికి ప‌క‌ర‌య‌త్నిస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌రు. కానీ ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీలేని పోరాటం చేయాల‌ని త‌న పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులకు జ‌గ‌న్ దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ నెల 10 నుంచి పార్ల‌మెంట్ మ‌లివిడ‌త బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ స‌భ్యుల‌తో జ‌గ‌న్ ఇవాళ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. జ‌గ‌న్ మాట్లాడుతూ రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో పార్టీ ఎంపీలు గ‌ట్టిగా గ‌ళం వినిపించాల‌న్నారు. ఏపీకి పోల‌వ‌రం ప్రాజెక్ట్ జీవ‌నాడి అని, దాని ఎత్తు త‌గ్గిస్తే తీవ్ర న‌ష్ట‌మ‌ని, పార్ల‌మెంట్‌లో నిల‌దీయాల‌ని జ‌గ‌న్ సూచించారు. పోల‌వ‌రం ఎత్తు విష‌యంలో రాజీలేని పోరాటం చేయాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌కుండా కేంద్రంపై పోరాటం చేయాల‌ని త‌న ఎంపీల‌కు జ‌గ‌న్ సూచించారు. అలాగే పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో ద‌క్షిణాదికి న‌ష్టం వ‌స్తుంద‌నే ప్ర‌చారంపై కేంద్రం నుంచి స్ప‌ష్ట‌త వ‌చ్చేలా పార్ల‌మెంట్‌లో వ్యూహాత్మ‌కంగా మెల‌గాల‌న్నారు.

అలాగే బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల‌న్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డాన్ని పార్ల‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఉభ‌య పార్ల‌మెంట్ స‌భ‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో త‌న పార్టీ స‌భ్యుల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేయ‌డం మంచిదే. అయితే ఇదే విధానాన్ని త‌న వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి లైట్ తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ప్ర‌తిప‌క్ష హోదాతో సంబంధం లేకుండా అసెంబ్లీకి వెళ్లి, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ కూడా గ‌ళ‌మెత్తడానికి ప‌క‌ర‌య‌త్నిస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కానీ జ‌గ‌న్ మాత్రం తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా, ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. తాను త‌ప్ప‌, మిగిలిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులంతా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై మాట్లాడాల‌ని జ‌గ‌న్‌కే చెల్లింది.

25 Replies to “అసెంబ్లీకి వెళ్ల‌డు… కానీ జ‌గ‌న్ ఉచిత స‌ల‌హాలు!”

  1. ఊరుకో సామీ…. టీం కెప్టెన్ పరుగులు చేయక పోయినా….మిగిలిన ప్లేయర్లకు దిశా నిర్దేశం చేసినట్లు… జగనన్న కూడా దిశా నిర్దేశం చేస్తాడు…

    1. సమస్యేమంటే మిగతా ప్లేయర్స్ (MLA ) ని కూడా పరుగులు చెయ్యొద్దంటున్నాడు కదా?

  2. మిగితావాళ్ళకి పని లేదు కాబట్టి వెళ్ళమన్నాడు. అన్న కి తాడేపల్లి – బెంగళూరు ట్రిప్స్ కి టైం ఉండటం లేదు. మిగిలిన కొద్ది టైం పూబిగ్ ఆడుకొని సేద తీరదాయానికి

  3. ఆక్ పాక్ కరివేపాక్ జగన్ రెడ్డి గారు సూచించిన పోరాటాలు ఏమిటో ఒకసారి చూసొద్దాం..

    ..పోలవరం ఎత్తు విషయం లో పోరాడాలంట.

    .. అది రెండు విడతలుగా కట్టాలనే ప్లాన్ పంపిందే జగన్ రెడ్డి.. ఇప్పుడు మళ్ళీ డిజైన్ మారిస్తే.. డబ్బు బొక్క..

    ఎత్తు తగ్గించే ఆలోచన జగన్ ప్రభుత్వానికీ లేదు.. చంద్రబాబు ప్రభుత్వానికి అంతకన్నా లేదు.. రాజకీయం కోసం అష్టకష్టాలు.. అంతే..

    .. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంట ..

    .. ఇప్పుడు ప్రైవేటీకరణ ఎవడు చేస్తున్నాడు.. జగన్ రెడ్డి కి కల గాని వచ్చిందేమో..

    ..

    .. పార్లమెంట్ పునర్విభజన..

    .. అమిత్ షా క్లారిటీ ఇచ్చాడు.. పునర్విభజన జనాల ప్రతిపతిక కాదు అని చెప్పాడు.. అయినా ఈ అరుపులు ఎందుకు..

    .. బ్యాలట్ విధానం లో ఎన్నికలు..

    .. బ్యాలట్ లో ఎన్నికలు పెడితే పారిపోతాడు.. ఈవీఎంలతో పెడితే ఏడుస్తాడు.. వీడికేం కావాలో వీడికే తెలీదు.. ఖర్మ..

  4. Jagan knows his weakness that he cannot speak spontaneously. He needs teleprompter to speak. If he goes to assembly, comparisons arises between “Jagan vs Lokesh” and “Jagan Vs Pawan”. Jagan is fearing to face Lokesh and Pawan.

  5. పథకాలు ఇవ్వలేక …

    సంపద సృష్టి చేతకాక…

    ఉచిత సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నాడు.

  6. రాష్ట్రంలో ఉండే 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లను ఒక్కటి గెలవలేక పోయారు అధికారంలో ఉండి కూడా.. అవి బ్యాలెట్ తో జరిగినవి.. జన్మ లో జగ్గూ మళ్ళీ అధికారం లోకి రాలేడు.. రాసిపెట్టుకోండి

  7. ఆడ లేక మద్దెల ఓడు అనే సామెత సజ్జల, జగ్గుల కు అతికినట్టు సరిపోతుంది.

    ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి సజ్జల తమ ఓటర్లు వేరేగా ఉన్నారని అంటాడు.

    జగ్గుల్ ఏమో ఈవీఎం అయితే ట్యాంపరింగ్,

    బ్యాలెట్ అయితే రిగ్గింగ్ అంటూ కబుర్లు చెబుతున్నాడు.

    సరిపోయారు ఇద్దరికి ఇద్దరు..

    #PsychoFekuJagan

    #EndOfYCP

    #AndhraPradesh

  8. ఆడ లేక మద్దెల ఓడు అనే సామెత సజ్జల, జగ్గుల కు అతికినట్టు సరిపోతుంది.

    ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి సజ్జల తమ ఓటర్లు వేరేగా ఉన్నారని అంటాడు.

    జగ్గుల్ ఏమో ‘ఈవీఎం అయితే ట్యాంపరింగ్,

    బ్యాలెట్ అయితే రిగ్గింగ్ అంటూ కబుర్లు చెబుతున్నాడు.

    సరిపోయారు ఇద్దరికి ఇద్దరు..

  9. పోలవరం, స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు నిలదీస్తే జనం గువ్వ తో నవ్వుతారు…

    అధికారం వున్నప్పుడు కాళ్ల మధ్యలో దూరాడు.. ఇప్పుడు నీలాదీస్తాడు అంట… సింతకాయ ఏమి కాదా?

  10. ఈడు Memes మెటీరియల్, ట్రోలింగ్ స్టాక్.. వారానికి ఒకసారి వస్తేవారం అంతా అవే చూడాలంటే బోరింగ్.. కనీసం నెలలో 11 సార్లు ఇలా press మీట్ పెట్టు..సోషల్మీడియా లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది..ఆంధ్ర మొత్తం సంతోషంగా u ట్యూబ్ లో నీ కామిడీ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.

  11. నీ దింపుడు కళ్లెం ఆశే గాని ఆడెప్పుడో కాడి దించేశాడ్రా అబ్బాయ్

  12. బాలట్ అయితే సులువుగా .. ఇంకు పోయొచ్చు .. బాక్స్ ఎత్తుకుని పోవచ్చు .. రిగ్గింగ్ చేసుకోవచ్చు .. ఎన్నో లాభాలు ..

  13. ఇంత పనికిమాలిన రాజకీయ నాయకుడిని నేనెక్కడా చూడలేదు. ప్రపంచ చరిత్రలో కూడా ఇలాంటి వాడు లేడు. తుగ్లక్ ని మించి చరిత్రలో నిలుస్తాడు. ఫేస్ లో తత్తరపాటు, భయం , సిగ్గు అన్నీ కన్పిస్తున్నాయి. వీడిని సింహం అని ఎలా అన్నారు రా సామీ.

Comments are closed.