ఇది ఫస్ట్ లుక్ కాదంట

నిజానికి రామ్ చరణ్ సినిమా నుంచి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ కాదిది. షూటింగ్ స్పాట్ లో సరదాగా బయట తీసిన ఫొటో.

పుట్టినరోజు సందర్భంగా జాన్వి కపూర్ స్టిల్ ఒకటి రిలీజ్ చేసింది రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా యూనిట్. శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన ఫొటోలో జాన్వి కపూర్ అందంగా, క్యూట్ గా ఉంది.

అయితే మేకర్స్ ఒకటి భావిస్తే, ఫ్యాన్స్ ఇంకోలా అర్థం చేసుకున్నారు. రామ్ చరణ్ సినిమాలో జాన్వి గెటప్ ఇలానే ఉంటుందని చాలామంది ఫీల్ అయ్యారు. జాన్వి ఫస్ట్ లుక్ అంటూ కొంతమంది ఈ స్టిల్ ను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

నిజానికి రామ్ చరణ్ సినిమా నుంచి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ కాదిది. షూటింగ్ స్పాట్ లో సరదాగా బయట తీసిన ఫొటో. మరో ప్రత్యేక సందర్భంలో జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్.

తెలుగులో జాన్వి కపూర్ కు ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఆమె ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేసింది. ఇప్పుడు చరణ్ సరసన నటిస్తోంది. దేవర టైమ్ లోలా కాకుండా, చరణ్ సినిమాకు ఆమె పూర్తిస్థాయిలో కాల్షీట్లు కేటాయిస్తోంది.

4 Replies to “ఇది ఫస్ట్ లుక్ కాదంట”

Comments are closed.