ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు చేయాలా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయరా? కావాలనే వాళ్లు ఆ రేసు నుంచి తప్పుకున్నారా? లేక వాళ్లకు అలాంటి కథలు రావట్లేదా?
పైన చెప్పుకున్న హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా చిరంజీవికి మార్కెట్ ఉంది. సినిమా క్లిక్ అయితే కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది. ఫ్లాప్ అయితే ఆ నష్టాలు లెక్కకు కూడా అందవు. అది వేరే సంగతి. సీనియర్లలో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న చిరంజీవి నుంచి మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా రాలేదు. రాలేదు అనే కంటే, ఆయన అలాంటి ప్రయత్నం చేయలేదేమో అనుకోవాలి.
రీఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు చిరంజీవి కొన్ని హిట్స్, మరికొన్ని ఫ్లాపులిచ్చారు. ఫ్లాపుల్ని వదిలేస్తే, ఆయన హిట్స్ ఏవీ నార్త్ బెల్ట్ లో క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సబ్జెక్టే. ఖర్చు కూడా బాగానే చేస్తున్నారు. కానీ ఇక్కడ సమస్య ఖర్చు కాదు. విశ్వంభర సబ్జెక్ట్ నార్త్ జనాలకు పట్టాలి. అది జరిగితే చిరంజీవి పాన్ ఇండియా కల నెరవేరినట్టే. రీఎంట్రీలో కూడా బాలీవుడ్ లో మెరిసిన ఘనత సొంతం అవుతుంది.
బాలకృష్ణ ఆల్రెడీ ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భగవంత్ కేసరి సినిమాకు స్వయంగా తనే డబ్బింగ్ చెప్పి మరీ హిందీలో రిలీజ్ చేశారు. కాకపోతే సైమల్టేనియస్ రిలీజ్ కాదు. తాజాగా డాకు మహారాజ్ హిందీ వెర్షన్ కూడా రిలీజైంది. అయితే ఆ రెండూ అక్కడ క్లిక్ అవ్వలేదు. బాలకృష్ణకు పాన్ ఇండియా ఇమేజ్ ఇవ్వలేదు.
ఇప్పుడు బాలకృష్ణ తన ఆశలన్నీ అఖండ-2 పైనే పెట్టుకున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి బోయపాటి ఊరమాస్ టేకింగ్ కాగా, రెండోది నార్త్ జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేసే మైథలాజికల్ సబ్జెక్ట్. ఇంతకుముందు బోయపాటి తీసిన కొన్ని సినిమాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అలా ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా కుంభస్థలాన్ని కొట్టాలని డిసైడ్ అయ్యారు.
ఇక నాగార్జున, వెంకటేష్ అయితే ఈ రేసులో చాలా దూరంగా ఉన్నారు. వెంకటేష్ తన సినిమాల్ని పూర్తిగా తెలుగు మార్కెట్ కే పరిమితం చేశారు. బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను ఉత్తరాదిన విడుదల చేయలేదు. పాన్ ఇండియా లెవెల్ సినిమా చేయాలని అనుకొని చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవ్వదని, చేసిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్టయినప్పుడు మాత్రమే అది పాన్ ఇండియా సినిమా అనిపించుకుంటుందని గతంలో వెంకీ అన్నారు. స్టేట్ మెంట్ అయితే బాగుంది కానీ, కనీసం ఆ దిశగా ఆయన ప్రయత్నించడం లేదు.
ఇక నాగార్జున సంగతి సరేసరి. ఆయన రీజనల్ సినిమానే తీయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశించడం అత్యాశే అవుతుంది. కాకపోతే ఈ లోటును కాస్త భర్తీ చేస్తూ, భారీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు నాగ్.
Paniki vasthaaru Pan(Parag ads)ki.
ఏం మాట్లాడుతున్నావ్.. ధర్మేంద్ర సినిమా ఇక్కడ రిలీజ్ అయితే నువ్ చూస్తావా
em matladutunnado atham kaledaara
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Orey pichi pu….nag ki eppudo pan india star after shiva…he is only south actor done more hindi films….
Chiru balayya waste…edo andhra gorrelu followers valana surviving…ika venki and nag r ok in panindia
Chiranjeevi, balakrishna waste hero’s
Chudalli@
బాబు అక్కడ 1st pan india star nagarjuna కనబడటం లేదా shiva తో pan india block buster కొట్టిన మొదటి టాలీవుడ్ హీరో. అయన ముందలా కుప్పి గేంతులు. హిందీ నిర్మాతలు హిందీ సినిమా ల్లో నటించమని బతిమలాడేవాళ్ళు తెలుగు సినిమా తరువాతే అని చాలా సినిమా లు వదిలేసిన హీరో nagarjuna. ఇప్పటి జనాలకు నాగ్ గురించి ఏమి తెలుసు all india లొ తెలుగు హీరోలు తెలుసో తెలియదో కానీ నాగార్జున తెలియని వాడు ఇండియా లోనే లేడు