టాలీవుడ్ లో ఐటెంసాంగ్ సెగ్మెంట్ లో ఎప్పుడూ గ్యాప్ ఉంటూనే ఉంటుంది. గతంలో ముమైత్ ఖాన్ ఓ ఊపు ఊపింది. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా ఆ గ్యాప్ లో ఫిట్ అయింది. హీరోయిన్లే ఐటెంసాంగ్స్ చేసిన ట్రెండ్ కొన్నాళ్లు నడిచింది..
ఇప్పుడీ విభాగంలోకి మరో హీరోయిన్ ఎంటరైంది. ఆమె పేరు కేతిక శర్మ. మరి ప్రస్తుతం ఐటెంసాంగ్స్ లో ఉన్న ఖాళీని కేతిక కవర్ చేయగలదా? ఊర్వశిని మరిపించగలదా?
ఊర్వశితో పోలిస్తే కేతికకు తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో నటించిన అనుభవం ఎక్కువ. పైగా ఊర్వశితో పోలిస్తే టాలీవుడ్ సర్కిల్ కూడా ఎక్కువే. కాబట్టి కాస్త గట్టిగా దృష్టిపెడితే ఈ రంగంలో రాణించడం కేతికకు కష్టమేం కాదు.
ఐటెం భామకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కేతికకు ఉన్నాయి. ఇప్పుడామెకు కావాల్సింది ఒకే ఒక్కటి. అదే అదృష్టం. అది కాస్త కలిసొస్తే టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టడం ఖాయం.
నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’లో ఐటెంసాంగ్ చేసింది కేతిక. “అదిదా సర్ ప్రైజు..” అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ను 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ లో లిరిక్స్ కు తగ్గట్టు కేతిక సర్ ప్రైజ్ చేస్తుందో లేదో మరో 4 రోజుల్లో తేలిపోతుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Chudam