మిర్చి గొడవ తప్ప సకలం మాట్లాడిన అచ్చెన్న!

క్వింటాలుకు ఒక్క రూపాయి అయినా సరే.. ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా అందిస్తుందని అచ్చెన్న నోటమ్మట హామీ రావడం లేదు.

నోరేసుకుని అరుస్తూ ఉంటే.. వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవచ్చునని భ్రమపడితే అంతకంటె అవివేకం ఇంకొకటి ఉండదు. ప్రజలు ప్రతి విషయాన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. పైగా వారు క్షేత్రస్థాయిలో ఒక విషయంలో కష్టాలు పడుతూ, దాని తాలూకు దుష్ఫలితాలను స్వయంగా అనుభవిస్తూ ఉన్నప్పుడు.. వారి దృష్టి మళ్లించడం అనేది అసాధ్యం. పైపెచ్చు.. దృష్టి మళ్లించే నెపంతో చెప్పే డొంకతిరుగుడు మాటలను, అబద్ధాలను జనం అసహ్యించుకుంటారు కూడా. కానీ, ఈ లాజిక్ తెలియని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ఆయన డిమాండ్లకు లాజిక్ లేని కౌంటర్లు ఇవ్వడం మాత్రమే లక్ష్యంగా మాట్లాడుతున్న అచ్చెన్న.. ప్రజలు తమ ప్రభుత్వపు తప్పుడు విధానాలను గుర్తిస్తారని అనుకోవడం లేదు.

రాష్ట్రంలో మిర్చి రైతు దారుణంగా నష్టపోతున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులైనా సరే.. ఈ విషయాన్ని కాదనలేరు. ఎందుకంటే.. పార్టీ కాదు ఇక్కడ ముఖ్యం. ఈ సారి పురుగుల బెడద ఎక్కువకావడం, పురుగుమందుల ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దురదృష్టం కొద్దీ.. దిగుబడి వచ్చిన తర్వాత మిర్చికి ధర పలకడం లేదు.

జగన్ 11 వేలు అంటున్నారు గానీ, క్వింటాలుకు 13 వేలు ధరపలికినా సరే.. రైతులకు ఎకరాకు లక్షన్నర దాకా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ గుంటూరు మిర్చియార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.

జగన్ డిమాండ్లకు కౌంటర్ ఇవ్వడానికి మంత్రి అచ్చెన్నాయుడు ముందుకొచ్చారు. ఇక్కడ సమస్య ఏమిటి? ‘‘మిర్చికి ధర లేదు.. ప్రభుత్వం ఏం చేయదలచుకుంది?’’ అనేదే కదా! ఈ విషయం తప్ప.. అచ్చెన్నాయుడు.. ప్రస్తుత సమస్యకు సంబంధం లేని విషయాలు అనేకం మాట్లాడారు. టమోటా ధర పడిపోతే ప్రభుత్వం కొన్నదని, రైతులకు జగన్ పెట్టిన 1600 కోట్ల బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని, డిప్ లు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదని ఇలా టాపిక్ కు సంబంధంలేని ఆరోపణలు జగన్ మీద చేస్తున్నారు.

ఒకవైపు మిర్చి రైతులకు ఇబ్బందులున్న మాట వాస్తవం అని ఒప్పుకుంటున్నారు.. సాగు ఖర్చులు పెరగడం వలన నష్టపోతున్నారని కూడా ఒప్పుకుంటున్నారు. కానీ.. వారి నష్టాన్ని భర్తీ చేసేలాగా ప్రభుత్వం తరఫున ఏ చర్యలు తీసుకుంటున్నారనేది మాత్రం వెల్లడించడం లేదు.

క్వింటాలుకు ఒక్క రూపాయి అయినా సరే.. ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా అందిస్తుందని అచ్చెన్న నోటమ్మట హామీ రావడం లేదు. కానీ.. సాధారణ రాజకీయ విమర్శల సమయంలో ఇలాంటి డొంకతిరుగుడులు, బుకాయింపులు ప్రజలు సహిస్తారు. కానీ వారే అలమటిస్తున్న ప్రస్తుత సమయంలో అచ్చెన్న తరహాలో మాట్లాడితే.. ప్రజలు ఆగ్రహిస్తారు.

6 Replies to “మిర్చి గొడవ తప్ప సకలం మాట్లాడిన అచ్చెన్న!”

  1. ఇంతకి అన్నియ రైతులతో మాట్లాడి ఏమి చేసాడు వాళ్లకోసం… గవర్నమెంట్ ని ప్రశ్నిస్తాడా?

    లోగడ steelplant గురించి రాసినట్టు ఉత్తరం రాస్తాడా?

  2. అర్థం కాలేదా.. సొమ్ములన్నీ బకాయి లకి పొతే ఎలా ఆదుకొంటారు.. శతకోటి దరిద్రాలకు కారణం ప్రజలకు అర్ధం అవుతోంది

    1. 2019 లో ఈ లంగ కూటమి గాళ్లు అప్పులు లేకుండా ఇచ్చారా 2019 లో ఈ లంగ గాళ్లు ఖజానాలో 100 కోట్లు పెట్టి దిగేసాడు 2024 లో జగన్ ప్రభుత్వం 9000కోట్లు కాజాన లో ఉండి దిగారు ఇప్పుడు చెప్పు లంగ లాగా

  3. అచ్చన్న మా ల0గా గాడ్ని ఒకే ఒక్క గంట అడుగుతున్నాడు?? కానీ ఎందుకు??

    అచ్చన్న ముందు ఈ పొట్టేదవ నిలబడితే సరిగ్గా అక్కడికి సరిపోతాడు.. బట్టలు ఉప్పుకుని ఎంజాయ్ చేయ్యడమే..

    ప్యాలెస్ లో గుసగుస..

Comments are closed.